Home / Inspiring Stories / బట్టతల వచ్చేస్తోందా…?

బట్టతల వచ్చేస్తోందా…?

Author:

Bald head Natural treatment

మారిన ఆహరపు అటలవాట్లూ, కాలుష్యం, జన్యుపరమైన సమస్యలూ కారణం ఏదైనా కావొచ్చు గానీ బట్టతల ఒక శాపం గా మారిందిప్పుడు. డిప్రెషన్ వల్ల కూడా బట్టతల వచ్చే అవకాశం ఉందని సైక్రియాటిస్ట్లు చెబుతునే బట్ట తల కూడా యుక్త వయస్కుల్లో డిప్రెషన్ ని పెంచుతోందని  కూడా చెప్తున్నారు. చిన్న వయసులోనే బట్ట తల వల్ల యువకుల్లో ఆత్మ విశ్వాసం తగ్గిపోతోందని చెబుతున్నారు.

పురుషుల్లో బట్టతల ఆరంభం కావడానికి భూమి ఆకర్షణ శక్తి కూడా కారణం అయ్యే అవకాశముందని, దీనికి తోడు టెస్టోస్టిరాన్‌లో మార్పులు కూడా కారణమని అమెరికా పరిశోధకులు తమ అధ్యయనంలో వెల్లడించారు. టెస్టోస్టిరాన్‌లో మార్పుల వల్ల తలపై కొన్ని భాగాల్లో జట్టు ఊడిపోతుందని,  హార్మోన్‌లో ఈ మార్పును డిహైడ్రోటెస్టోస్టిరాన్ (డీహెచ్‌టీ) అంటారు. డీహెచ్‌టీ వల్ల తలపై ఉండే చర్మంలో కొవ్వు మోతాదు తగ్గగడం వల్ల ఒత్తిడిని తట్టుకోలేక జట్టు ఊడిపోతుందన్నది వీరి పరిశోధనలో గుర్తింపు. ఇలా మాడుపై కాకుండా శరీరంలోని ఇతర భాగాల్లో వచ్చే వెంట్రుకల విషయంలో  మాత్రం డీహెచ్‌టీ పాత్ర విభిన్నంగా ఉంటుంది. దీనికి తోడు ఇతర పురుష హార్మోన్ల వల్ల అక్కడి వెంట్రుకల కింద చర్మం మందంగా తయారవుతుందని అంటున్నారు. ఐతే ఈ వాదనలన్నీ సాధారణం గా వచ్చే బట్టతల విషయం లోవి. కానీ ఈ రోజుల్లో ముప్పయ్ల్లోకి రాకుండానే జుట్టు ఊడి చేతుల్లోకి వస్తోంది. యువకులలోనే 30% పైగా బట్టతలవారు కనిపిస్తున్నారు. ముఖ్యంగా ఉన్నత విద్యావంతులు,సాఫ్ట్ వేర్ రంగంలో వారికి జుట్టు ఊడిపోయే సమస్య ఎక్కువగా కన్పిస్తున్నది. దీనికి ఆయుర్వేదం లోనూ కొన్ని చిట్కాలు ఉన్నాయి ఒకసారి ప్రయత్నించి చూడండి.

బట్టతల రావడానికి అత్యుష్ణమే కారణం. అతి వేడి కారణంగా వెంట్రుకలకు కావాల్సిన కొవ్వు పదార్థం అందక రాలిపోతుంటాయి. ఇందుకు విరుగు అప్పుడే ఆరంభించాలి. పూర్తిగా బోడి అయిన తరువాత ప్రయత్నం చేస్తే ఏ మాత్రం ఉపయోగం ఉండదు. అందుకే ముందుగా జాగ్రత్త తీసుకోవాలి. లక్క, శుద్ధిచేసిన నాభి(మొక్క) , అతి మధురం, చింతాకు, నల్లికాయ రసం, నీలి ఆకులు మెత్తగా నూరి మంచినూనె పోసి బాగా ఉడకపెట్టాలి. వడపోయాలి రాత్రులందు లేపనం చేయాలి. నూరిన మెంతులతో తలకు పట్టించాలి. తెల్లవారి స్నానం చేయాలి. నారింజ రసం, లోహ భస్మం, ప్రవాళ భస్మం తగినంత వేసుకుని భోజనానంతరం రెండు పూటలా తాగాలి. తరువాత తలకు ఎలాంటి తైలాలు వాడ కూడదు. ఫలితంగా బట్టతల పై వెంట్రుకలు మొలిచే అవకాశం ఉంది అని ఆయుర్వేదం చెప్తోందట. ఒకసారి ప్రయత్నించి చూడండి మరి.

Must Read: పవన్ కళ్యాణ్ ఇక సినిమాలు చేయడా…??

(Visited 12,567 times, 1 visits today)