Home / Inspiring Stories / మెదడు లేకుండా పుట్టినా బతుకుతున్నాడు…!

మెదడు లేకుండా పుట్టినా బతుకుతున్నాడు…!

Author:

Boy born without brain

రెండేళ్ళ వయసులో ‘అమ్మా’ అని తన కొడుకు పిలిచినప్పుదు ఎమ్మా విపరీతమైన ఆనందానికి లోనైంది బిడ్ద తొలి సారి పిలిచినప్పుదు ఏ అమ్మ కైనా అలాగే ఉంటుందీ అంటారా. అదీ నిజమేనేమో గానీ పుట్టీన తన కొదుక్కి మెదడు లేదనీ కొన్ని నిమిషాలు మాత్రమే బతుకుతాడనీ తెలిసినప్పుడు కుమిలి పోయిన ఎమ్మా కి మెదడు లేకుండా పుట్టిన తన కొడుకు కొన్ని నిమిషాలు కూడా బతుకుతాడో లేదో అనుకుంటే రెండేండ్ల వయసుకు చేరుకున్నాడు. తల్లిని గుర్తుపట్టి ‘అమ్మా’ అని పిలిచాడు. మరి సంతోషంగా ఉండదా.

స్కాట్‌లాండ్‌లోని లనార్క్‌షాయర్‌లో నివసించే ఎమ్మా 2013 మార్చి నెలలో ఓ రోజు కడుపునొప్పి వస్తుందని ఆస్పత్రికి వెళ్లింది. భరించలేనంత కడుపు నొప్పి కావటం తో అపెండిసైటిస్‌ కావచ్చు అనుకుంది ఎమ్మా. పరీక్షించిన వైద్యులు పురిటి నొప్పులని చెప్పడంతో ఆశ్చర్యపోయింది. ఎందుకంటే ఆమెకు ప్రెగెన్సీ అనే అనుమానమే రాలేదు. అంతకు ముందు ఎటువంటి అనారోగ్య సమస్యలు లేవు, నెలసరి కూడా ఆగిపోలేదు. దీంతో ఆనందం, ఆశ్చర్యం కలిగాయి ఆమెకు ఐతే ఆ ఆనందం కొద్ది సేపే ఉంది ఆస్పత్రిలో బాబుకు జన్మనిచ్చింది. అయితే బాబు మెదడుకు సంబంధించిన హౌలోఫ్రాంజెన్సెఫెలీ జబ్బుతో పుట్టాడు. బాబు మెదడులో చిన్న భాగం తప్ప మిగిలిన భాగం అభివృద్ది చెంద లేదు. అసంపూర్తి మెదడుతో జన్మించాడు. దీంతో బాబు మూడు నిమిషాలు లేదా మూడు గంటలు బతకొచ్చని, ఎక్కువ కాలం జీవించే అవకాశం లేదని వైద్యులు చెప్పారు. బాబు అవయవాలు ఎదగవని, మెదడు అభివృద్ధి చెందే అవకాశమూ లేదని వివరించారు.

అయినా ఎమ్మా కి ఆశ చావలేదు తొందరలోనే చనిపోతాడని తెలిసినా ఆ బిడ్ద మీద విపరీతమైన ప్రేమ పెంచుకుంది. బాబుకు ఎరాన్‌ అనే పేరు పెట్టింది తల్లి ఎమ్మా. కంటికి రెప్పలా కాపాడుకుంది. ఆమె ప్రేమ తోనే ఆ బాబుని బతికించుకొంటోంది. పుట్టుకతోనే వైకల్యం ఉన్న ఎరాన్‌కు ప్రస్తుతం రెండేండ్లు నిండాయి. కొద్దిగా ఆటిజం లక్షణాలతో ఉనా తల్లిని చూడగానే ‘అమ్మా’ అని పదే పదే పిలుస్తున్నాడు. చప్పట్లు కొడుతూ తన హావ భావాలను తెలుపుతున్నాడు.దాంతో ఎమ్మా ఆనందానికి అవధుల్లేకుండా పోయింది.

10వేల మంది పిల్లల్లో ఒకరిద్దరికి మాత్రమే ఇలాంటి హౌలోఫ్రాంజెన్సెఫెలీ అనే జబ్బు వస్తుందని, చాలా సందర్భాల్లో గర్భంలోనే శిశువు చనిపోతుందని వైద్యులు తెలిపారు.ఇంకా ఎన్ని ఏళ్ళు బతుకుతాడో తెలియదు కానీ ఎరాన్ ఆ అమ్మ కొసం బతుకుతాడనే ఆశిస్తున్నారు ఆమె సన్నిహితులు.

Must Read: పవన్ కళ్యాణ్ ఇక సినిమాలు చేయడా??

(Visited 417 times, 1 visits today)