Home / Inspiring Stories / క్యాబ్ డ్రైవర్లుగా మారుతున్న సాఫ్ట్ వేర్ ఇంజినీర్లు…!

క్యాబ్ డ్రైవర్లుగా మారుతున్న సాఫ్ట్ వేర్ ఇంజినీర్లు…!

Author:

క్యాబ్ software engineers changing their profession to cab drivers

మీరు సాఫ్ట్ వేర్ ఇంజినీరా…? మీ జీతం ఎంతా? ఓ నలభై వేలుంటుందా? పోనీ అరవై?ఆ అరవై రావటానికి మీరెన్ని సంవత్సరాలు కష్టపడ్డారు? ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపి ఉంటారు.. కానీ ఇప్పటి తరం మరీ అంత కష్టాన్ని అంగీకరించట్లేదు.అలాగని తమకు రావల్సిన డబ్బునీ వారు వదులుకోవటం లేదు. అందుకే హ్యాపీగా తమ కార్పోరేట్ జాబుల్ని వదిలేసి మరీ క్యాబ్ డ్రైవర్లుగా చేరిపోతున్నారు. మీరు విన్నది నిజమే. సాఫ్ట్ వేర్ డెవలపర్ల దగ్గరి నుంచీ పెద్ద పెద్ద జీతాల ఇంజినీర్ల వరకూ నెమ్మదిగా వాహన చోదకులుగా అవతారాలెత్తుతున్నారు…

బెంగుళూరు లోని ఒక స్థానిక పత్రిక కథనం ప్రకారం ఇప్పటికే అక్కడ ఉన్న క్యాబ్ డ్రైవర్లలో ఇలా కార్పొరేట్ జాబులు మానేసీ లేదా పార్ట్ టైం గా వీకెండ్స్ లో ఇలా డ్రైవింగ్ చేసే వారి సంఖ్య 25% వరకూ ఉందట. డ్రైవింగ్ మీద ఆసక్తితో కొందరూ,ఆ యాంత్రిక జీవితం నచ్చక కొందరూ, ఎక్కువ డబ్బులు సంపాదించొచ్చనే మరికొందరూ ఇలా డ్రైవింగ్ బాట పడుతున్నారు. బంగారం లాంటి ఉధ్యోగాలొదిలేసి ఇదేం పిచ్చీ అంటారా…!? వీరి సంపాదననీ తక్కువ అంచనా వెయ్యొద్దు ఈ రంగం లో నెలకి 60-80వేలు సంపాదించే వారున్నారు.Ola,Uber లాంటి క్యాబ్ సర్వీస్ లలో ఉద్యోగం అంటే మాటలు కాదు. ఊక్కో డ్రైవర్ కి జీతాలు సాఫ్ట్ వేర్ రంగానికి ఏమీ తగ్గవు కస్టమర్ ని ఆకర్షించటానికి చక్కటి ఇంగ్లీష్ మాట్లాడగలిగీ, మంచి కార్పోరేట్ బాడీ లాంగ్వేజ్ ఉన్న డ్రైవర్లకి ఎంత జీతం ఇవ్వటానికైనా ఈ కంపెనీలు వెనకాడటం లేదు.

ఒక ఐటీ కంపెనీలో సాఫ్ట్ వేర్ డెవలపర్ గా చేసే దీపక్ మెహతా వీకెండ్స్ లో Uber క్యాబ్ డ్రైవర్ గా మారి స్టీరింగ్ తిప్పుతాడు. డ్రైవింగ్ అంటే ఉన్న ఇష్టాన్ని అలా తీర్చుకుంటాడు కాలక్షేపానికి కాలక్షేపం డబ్బుకు డబ్బూ. ఇది వరకు నేను చేసే సాఫ్ట్ వేర్ కంపెనీ నాకు 40 వేలు ఇచ్చేది కానీ నేనిపుడు నా క్యాబ్ డ్రైవింగ్ ధ్వారానే 70 వేల వరకూ సంపాదిస్తున్నా.దీన్ని మీరు తక్కువ అనుకోకండి దీనివల్ల గౌరవానికి ఏమాత్రం భంగం కలగదు.మంచి లాంగ్వేజ్ స్కిల్స్, చక్కటి బాడీ లాంగ్వేజ్ తోబాటు మీకు డ్రైవింగ్ కూడా వచ్చి ఉంటే చాలు ఇక మీకోసం ఒక జాబ్ రెడీ గా ఉన్నట్టే అంటాడు ఆంధ్రప్రదేశ్ లోని అనంతపూర్ కి చెందిన రమేష్ రెడ్డి. నాలుగు సంవత్సరాలు ఒక సాఫ్ట్ వేర్ కంపెనీలో పని చేసిన రమేష్ రెడ్డి తనకు అంతంత సేపు ఏసీ గదుల్లో కూర్చునే ఓపిక లేక ఆ యాంత్రిక జీవణ సరళి నచ్చకే బయటికి వచ్చానంటాడు.ఇక ఇప్పుడిప్పుడే ఈ తరహా మార్పు హైదరాబాద్ కీ పాకుతోంది. కార్పోరేట్ ఫైనాన్స్ లో ఎంబీఏ చేసి కూడా ఖాళీ సమయాల్లో డ్రైవింగ్ చేస్తూ. తానూ భవిశ్యత్తు లో ఒక క్యాబ్ సెర్వీస్ ని స్టార్ట్ చేయాలనుకుంటున్నాడు మాదాపూర్ కి చెందిన ప్రదీప్ సింగవేని.నేను కేవలం ఇప్పుడు వచ్చే జీతం కోసమే కాదు తర్వాతి కాలం లో నేను పెట్టబోయే కంపెనీ ని రన్ చేసేందుకు కావాల్సిన అనుభవం కోసమే ఇప్పుడు డ్రైవింగ్ చేస్తున్నా అంటాడితను

నిన్నటి దాకా ఉన్న సాఫ్ట్ వేర్ ఉధ్యోగాల పై ఉన్న భ్రమలు తొలగి పొతున్నాయ్ యువతరం లోనూ తాము జీవితం లో ఏదో కోల్పోతున్నాం అనే ఆలోచన మొదలైంది. వారు డబ్బు కోసమే బ్రతికే యంత్రాలు అనిపించుకోవటానికి ఇష్టపడటం లేదు… ఇది ఒక మంచి మార్పే అంటున్నారు మానసిక విశ్లేషకులు..

 Also Read: ప్రతి ఒక్క హృదయాన్ని తాకే వీడియో.

(Visited 19,564 times, 1 visits today)