Home / Entertainment / జబర్దస్త్ కామెడీ షో పై కేసు.

జబర్దస్త్ కామెడీ షో పై కేసు.

Author:

ఖతర్నాక్ కామెడీ షో జబర్దస్త్ మరోసారి వివాదంలో ఇరుక్కుంది. 2014 లో న్యాయవ్యవస్థను కించ పరుస్తూ ఓ స్కిట్‌ ప్రసారం చేశారంటూ జబర్దస్త్ టీంకు వ్యతిరేకంగా కరీంనగర్ కు చెందిన అరుణ్ కుమార్ అనే అడ్వకేట్ కరీంనగర్ కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. ఈటివీ లో ప్రసారం అవుతున్న జబర్దస్త్ కార్యక్రమం వివాదాస్పదం అవుతున్నట్లుగా ఉంది.కొద్ది రోజుల క్రితం గౌడ సామాజికవర్గం గొడవకు దిగితే, ఈసారి అదే తరహాలో మరో కేసు నమోదు అయింది.ధనాధన్ ధన రాజ్ చేసిన ఒక స్కిట్ లో జడ్జ్ పాత్రధారిని ఉద్దేశించి “భయ్యా” అంటూ మాట్లాడటం. కోర్ట్ హాల్లో బూతులు మాట్లాడినట్టుగా చూపించటం… ద్వారా ఈ దేశ న్యాయవ్యవస్తని అవమనించరని పేర్కొంటూ ఈ పిటీషన్ దాఖలు చేసారు. ఈ మేరకు హుజూరాబాద్ కోర్టు నోటీసులు జారీ చేస్తూ ఆ కామెడీ షో నిర్వాహకులపై కేసు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించింది..

ఇదొక్కటే కాదు వేణూ వండర్స్ చేసిన స్కిట్ వల్ల జరిగిన వివాదమే కాక గతం లో ఈ ప్రోగ్రాం మీద ఇంకో కేసు కూడా నమోదయ్యింది. ఈటీవీలో జూన్ 19న రాత్రి 9.30 గంటలకు జబర్ధస్త్‌లో ప్రసారమైన కామెడీ షో లో బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన వారి మనోభావాలు దెబ్బతినేలా చూపించారని కరీంనగర్ లో కేసు నమోదయింది. మద్యం సేవించినట్లు అమర్యాదగా ప్రవర్తించినట్లు చూపించారని తిమ్మాపూర్‌కు చెందిన కేతిరెడ్డి అంజిరెడ్డి అనే ఆయన కోర్టుకు వెళ్లారు. ఆ మీదట స్పందించిన కోర్టు, జబర్దస్ నటులు శేషు, సుధాకర్, యాంకర్ రష్మీ, న్యాయనిర్ణేతలు నాగేంద్రబాబు, రోజాపై కేసు నమోదు చేసి విచారణ జరపాలని పోలీసులను ఉత్తర్వులు ఇచ్చింది.. గత నాలుగేళ్ళుగా జబర్దస్త్ రియాలిటీ షోల్లోనే నెంబర్ వన్ షోగా నిలిచింది… అయితే అడల్ట్ కామెడీ ఎక్కువ, కుటుంబసబ్యులతో కలిసి ఈ షో చూడలేము అన్న విమర్శలు ఎప్పటి నుంచో ఉన్నాయి..

Must Read: సావిత్రి సినిమా పర్ఫెక్ట్ రివ్యూ & రేటింగ్.

(Visited 2,852 times, 1 visits today)