Home / Inspiring Stories / ఇంటి కోసం ప్రాణాలు వదిలిన చైనా రైతు

ఇంటి కోసం ప్రాణాలు వదిలిన చైనా రైతు

Author:

nail house5

భారతదేశములో రోడ్ల విస్తరణ, కొత్త ప్రాజెక్ట్ల నిర్మాణం జరిగేటప్పుడు కొంతమంది తమ ఇల్లులు, పొలాలు వదిలేసి ప్రభుత్వం ఇచ్చే నష్టపరిహారంతో సరిపెట్టుకుంటారు. కొంతమంది కోర్టులకి వెళ్ళి ఇంకొంత ఎక్కువ పరిహారం పోందుతారు. కానీ చైనా చట్టాల ప్రకారం ఇంటి యజమాని అనుమతి లేనిదే ప్రభుత్వం కూడా ఒక చిన్న ఇంటిని కూడా కూలగొట్టలేదు. చైనా చట్టాల ప్రకారం యజమానికి చాలా హక్కులు ఉంటాయి. అందుకే రోడ్డు విస్తరణలు, కొత్త ప్రాజెక్ట్లు చేసేటప్పుడు అందరి సహకారం ఉంటేనే ఆ పని ముందుకు సాగిపోతుంది.

nail house0

చైనాలో చాలా మంది ఇంటి యజమానులువారికి వచ్చే నష్టపరిహారం సరిపోకపోతే ఎటువంటి ఒత్తిడలకీ లోబడకుండా పోరాటం చేస్తారు. కానీ చాలా ప్రాజెక్ట్‌లు వారిని ఒప్పించలేక వారి ఇంటిని మాత్రం వదిలేసి మిగతా స్థలంలో పని ప్రారంభిస్తాయి. ఇలా పనికి ఆటంకం కలుగజేస్తూ ప్రోజెక్ట్‌ల మధ్యలో ఉండే ఇల్లులనే ముళ్లుల ఇల్లు అని అంటారు. అటువంటి కొన్ని ఇల్లులను ఇక్కడ చూడండి.

nail house2 nail house3 nail house4

ఇన్నాళ్లు అలా మిగిలి పోయిన ఇల్లుల యజమానులని నయానో, భయానో ప్రాజెక్ట్ పూర్తి అయ్యే సమయానికి ఒప్పించి ఆ ఇల్లులని స్వాదీనం చేసుకొనేవారు. కానీ తన ఇల్లు, పొలమే దైవంగా భావించే ఒక చైనా రైతు తన ఇంటిని రోడ్డు విస్తరణ పనులకి ఇవ్వకుండా 2007 నుండి పోరాడుతూ వస్తున్నాడు. కానీ గత సంవత్సరం సెప్టెంబర్ 17న అతను తన ఇంట్లోనే మంటల్లో కాలి చనిపోయాడు. ఈ సంఘటన దేశంలో పెను దుమారం లేపింది. ఆ రైతుని ప్రభుత్వమే కాల్చి ఛంపిందని పలువురు ఆరోపించారు. కానీ పోలీసులు మాత్రం అతనే ఇక పోరాటం చేయలేక ఆత్మహత్య చేసుకున్నాడని ప్రకటించారు. ఏది ఏమైన పెద్దవాళ్ళతో పెట్టుకుంటే నలిగిపోయేది  సాదారణ పౌరులే అని చైనా దేశంలో కూడా నిరూపించబడింది. కానీ యజమానికి అలాంటి అధికారాలు ఇస్తే మన దేశంలో పరిష్టితి ఎలా ఉంటుందో?

Must Read:కమల్ హసన్, ప్రీతి జింతాలతో 1998లోనే రోబో సినిమాకి ఫోటోషూట్ చేసిన శంకర్.

(Visited 13,614 times, 1 visits today)