Home / health / కొబ్బరి బోండాలలో కూడా కల్తీ..! ప్రాణాలకే ప్రమాదం..!

కొబ్బరి బోండాలలో కూడా కల్తీ..! ప్రాణాలకే ప్రమాదం..!

Author:

మనకు పకృతి ప్రసాదించిన గొప్ప వాటిలో ఒకటి కొబ్బరి బొండం. ఎందుకంటే కొబ్బరి బొండం తాగడం వలన మనకు అనేక రకాలైన రోగాలు తగ్గుతాయి అందుకే దీనిని సర్వరోగ నివారిణి అంటారు. పకృతిలోని ఏ పండునైన, లేదా కాయనైనా మనం కల్తీ చేయవచ్చు కానీ కొబ్బరి బొండాలను కల్తీ చెయ్యలేము ఎందుకంటే కొబ్బరి చెట్టు నుండి పిందెలు పెరిగి పెద్దవుతున్న కొద్దీ కాయ లోపల  నీళ్లు వాటంతట అవే రావడం ఈ చెట్టు యొక్క ముఖ్యలక్షణం … అందుకే వీటిని ఇప్పటి వరకు ఎవరు కల్తీ చేయలేదు … కానీ ఇప్పుడు కల్తీ చేస్తున్నారు … మీరు వింటుంది నిజమే కొబ్బరి బొండాలను కూడా కల్తీ చేస్తున్నారు….ఎలా చేస్తున్నారో తెలుసా….!

Coconut-water

మాములుగా ఏవైనా కాయలని కల్తీ చేయాలంటే వాటికి కెమికల్ ఇంజెక్షన్స్ ఇవ్వడమో లేదా కెమికల్ పొడిలో మాగాబెట్టడమో చేస్తారు, కానీ కొబ్బరి బోండాలని అలా ఇంజెక్షన్ ఇవ్వలేరు, పొడిలో మాగబెట్టడం కూడా అసాధ్యం అందుకే కల్తీరాయుళ్లు ఏకంగా కొబ్బరిచెట్టుకే కెమికల్స్ ని ఇస్తున్నారు, మోనోక్రోటోఫాస్ అనే కెమికల్ ని కొబ్బరి చెట్టు యొక్క తల్లి వేరు దగ్గర ఒక కవర్ లో పోసి ఉంచుతారు, ఆ తల్లి వేరు గుండా ఆ కెమికల్ చెట్టులోకి ప్రవేశిస్తుంది, ఈ కెమికల్ వల్ల కొబ్బరి పిందెలు సహజత్వానికి భిన్నంగా చాలా వేగంగా బోండాలుగా మారిపోతాయి, ఇలాంటి బోండాలని తాగితే మనకి కిడ్నీ, లివర్, గుండెకి సంబంధించిన వ్యాధులు వచ్చే ఆవకాశం ఉంది.


ఈ కెమికల్ ని కొబ్బరి చెట్టుకి వ్యాధులు సోకినప్పుడు మాత్రమే వాడాలి, ఆ కెమికల్ వాడిన 40 రోజుల వరకు కాసే కొబ్బరి బోండాలని తాగటానికి ఉపయోగించకూడదు, కానీ ఇప్పుడు ఈ కెమికల్ ని వ్యాధుల నివారణకి కాకుండా కేవలం బోండాలని తొందరగా పెంచుకోవడానికే ఉపయోగిస్తూ ప్రజల ప్రాణాలతో కొంతమంది ఆడుకుంటున్నారు.

Must Read: పడుకున్న ఒక నిమిషంలోనే నిద్రలోకి జారుకునే ట్రిక్..!

(Visited 1,312 times, 1 visits today)