Home / Inspiring Stories / స్నాప్ “ఢీ”ల్ 68 రూపాయలకే ఐఫోన్ 5S అమ్మాల్సి వచ్చింది.

స్నాప్ “ఢీ”ల్ 68 రూపాయలకే ఐఫోన్ 5S అమ్మాల్సి వచ్చింది.

Author:

Iphone 68 rupees 1

ఒక్క చిన్న పొరపాటు ఆ విధ్యార్థి పాలిట వరం అయ్యింది. 28,999 రూపాయల విలువైన ఆపిల్ ఐఫోన్ 5S ని కేవలం 68 రూపాయలకే దక్కించుకునేలా చేసింది. అంతేకాదు స్నాప్ డీల్ అతనికి తిరిగి కోర్టుఖర్చులనిమిత్తం 12,000 రూపాయలను కూడా చెల్లించాల్సి వచ్చింది కూడా… ఇంతకీ ఏం జరిగిందంటే….

iphone 68 rupees

ఆపిల్ ఐఫోన్ పై 99.7% డిస్కౌంట్ అన్న ఆఫర్ స్నాప్ డీల్ వెబ్సైట్లో చూసిన నిఖిల్ బన్సాల్ అనే పంజాబ్ కు చెందిన బీ.టెక్ విధ్యార్థి వెంటనే ఆర్డర్ చేసాడు. అయితే అది పొరపాటున వచ్చిన ప్రకటన అన్న విషయం గమనించిన స్నాప్ డీల్ వెంటనే ఆ ప్రకటనని తీసేసింది. అతనికి ఫోన్ పంపటం కుదరదని కూడా చెప్పలేదు. ఫిబ్రవరి 12 న అతను ఆర్డర్ చేసిన ఆపిల్ ఐఫోన్ 5స్ సెరీస్ ఫోన్ తనకు వస్తుందని ఎదురు చూసీ..చూసీ విసిగిపోయాడు నిఖిల్ బన్సాల్. ఎక్కడో జరిగిన చిన్న పొరపాటు వల్ల వచ్చిన ప్రకటన కావటంతో స్నాప్ డీల్ కూడ పెద్దగా ఈ విషయాన్ని పట్టించుకోలేదు… ఇక చివరకు స్నాప్ డీల్ మీదనే పంజాబ్ లోని సంగ్రూర్ జిల్లా వినియోగదారుల కోర్ట్ లో కేసు ఫైల్ చేసాడు. దాంతో స్నాప్ డీల్ దిగి రాక తప్పలేదు. కోర్టు ఆదేశాల ప్రకారం ఆ ఫోన్ ని అతనికి 68 రూపాయలకు అమ్మటమే కాదు, కోర్టు ఖర్చుల నిమిత్తం తిరిగి అతనికే 2000 రూపాయలని చెల్లించాలి అని కోర్టు తీర్పునిచ్చింది. ఇంకో దిమ్మ తిరిగే విశేషం ఏమిటంటే… ఇదే విషయంలో రెండో సారి రిటర్న్ కేస్ ఫైల్ చేసిన స్నాప్ డీల్ కోర్టునే తప్పుదోవ పట్టించాలని చూసిందన్న అభియోగంతో పాటు 10,000 రూపాయ ఫైన్ కట్టాల్సి వచ్చింది. మొత్తానికి ఒక చిన్న టెక్నికల్ పొరపాటు నికిల్ భన్సాల్ పాలిట వరంగా మారితే స్నాప్ డీల్ కి మాత్రం పంచ్ మీద పంచ్ ఇచ్చింది…

Must Read:షాపింగ్ మాల్స్ ట్రయల్ రూంలలో ఉండే సీక్రెట్ కెమెరాలను ఈ విధంగా కనిపెట్టండి.

(Visited 10,273 times, 1 visits today)