Home / Inspiring Stories / ట్రయల్ రూం లో సీసీ కెమెరా ఉంటే ఎలా తెలుసుకోవాలి?

ట్రయల్ రూం లో సీసీ కెమెరా ఉంటే ఎలా తెలుసుకోవాలి?

Author:

షాపింగ్ మాల్స్,వస్త్రాల షోరూముల్లో మీరు షాపింగ్ చేసే ఉంటారు. అక్కడ ఉన్న ట్రయల్ రూముల్లో బట్టలు మార్చుకునే ముందు ఒక సారి ఆలోచించండి ముఖ్యంగా మహిళలు. ఫ్యాబ్ ఇండియా వస్త్ర దుకాణానికి వెళ్లిన కేంద్రమంత్రి స్మృతి ఇరానీ అక్కడ దుస్తులు మార్చుకునే గదిలో కెమెరాల ఏర్పాటుపై ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే కదా.అయితే ఆ కేసులో బాదితురాలు ఒక కేంద్ర మంత్రి కాబట్టి చర్యలు వేగంగానే తీసుకున్నారు. ఈ కేసులో పోలీసులు అరెస్టు చేసిన ఫ్యాబ్‌ ఇండియా ఉద్యోగులు బెయిల్‌పై విడుదలయ్యారు. హాయిగా మళ్ళీ వాళ్ళ పనుల్లో వాళ్ళున్నారు. పోయిన సంవత్సరం ఏప్రిల్ లో ఈ ఘటన జరిగింది. ఒక కేంద్ర మంత్రి విషయం కాబట్టి వేగంగా చర్యలు తీసుకున్నారు గానీ… మాములు మహిళల విషయం లో ఇలాంటి కేసు ఏమౌతుందో మనకు తెలిసిందే… అందుకే మీ జాగ్రత్తలో మీరుండండి. ఒక చేంజింగ్ రూం లోకి వెళ్ల గానే అక్కడ ఎలక్ట్రిక్ బల్బు తాలూకు ఖాళీ హోల్డర్ కనిపించినా,పై కప్పు మూలల్లో అనుమానిత కారణాలు అంటే రంద్రాలు ఉండటం గానీ,అక్కడ చిన్న బాక్స్ లాంటిది ఉండటం గానీ ఉంటే మీరక్కడ దుస్తులు మార్చుకోవద్దు.అంతే కాదు అక్కడ ఉన్న అద్దం మీద మీ వేళినుంచండి అది మామూలు అద్దం అయితే మీ రిఫ్లెక్షన్ కీ మీ వేళికీ మధ్య కొంత గ్యాప్ ఉంటుంది అదే టూఊవే మిర్రర్ అయితే ఆ గ్యాప్ కనిపించదు.

Two Mirror In Shopping Malls

కింద వీడియో లో 2015 లోనే ఒక అమ్మాయికి ఎదురైన చేదు అనుభవాన్ని చూడండి. అక్కడ చెప్పిన జాగ్రత్తలని పాటించండి.

Must Read: అసలు అసెంబ్లీలో రోజా ఏం మాట్లాడారో వినండి.

(Visited 15,249 times, 1 visits today)