Home / Inspiring Stories / గుంటూరు కుర్రాళ్ళ కొత్త ఆలోచన “మామ చికెన్ బండి”

గుంటూరు కుర్రాళ్ళ కొత్త ఆలోచన “మామ చికెన్ బండి”

Author:

ఎంబీఏ చదివిన త్రిశాంక్, కోటిరెడ్డి ఇద్దరూ బావ బామ్మర్దులు, గుంటూరుకు చెందిన ఈ ఇద్దరికీ తాము ఉద్యోగం చేయడం కాదు మరొకరికి ఉద్యోగాలు కూడా ఇవ్వాలనేది కోరిక. అందుకే కొత్తగా ఏదైనా చేయాలని ఆలోచించారు. వచ్చిన ఆలోచనకు, తమ దగ్గరున్న పెట్టుబడికి ఐస్ క్రీం లా చికెన్ అమ్మితే ఎలా ఉంటుందని ఆలోచించారు. తమ స్టార్టప్ కంపెనీకి మంచి మాస్ టైటిల్ కూడా పెట్టారు ఆ పేరేంటో తెలుసా..? “మామ చికెన్” కే ఎఫ్ సీ లాంటి పెద్ద రెస్టారెంట్లో దొరికే చికెన్ లానే లోకల్ టేస్ట్ తో చికెన్ అమ్మటానికి ఈ బండ్లు కరెక్ట్ గా సరిపోతాయని డిసైడయ్యారు. ఐస్ క్రీమ్ బండ్ల తరహానే “మామ చికెన్” బండ్లను డిజైన్ చేయించారు. అందులో ఉడకపెట్టిన పల్లీ, మొక్కజొన్న పొత్తుల బళ్ళ లాగా బొగ్గులతో కొలిమి ఉండే విధంగా చూశారు. చికెన్ అంటే రెస్టారెంట్లకో, హోటల్స్ కో వెళ్లే అవసరం లేకుండా, మిర్చి బజ్జీల్లా రోడ్ సైడ్ దొరికితే వినియోగదారులు కచ్చితంగా ఆసక్తి చూపిస్తారని నమ్మారు. ఆ నమ్మకం వమ్ముకాలేదు.

mama chicken center

గంట వాయిస్తూనో,సినిమా పాటలు పెద్ద సౌండ్ తో వినిపిస్తూనో ఐస్ క్రీమ్ అమ్మే బండ్లు తిరగని వీధి ఎక్కడా ఉండదు. అయితే ఆ ఐడియా ఐస్ క్రీమ్ కే పరిమితమయింది. అందుకే గుంటూరు కుర్రాళ్లు త్రిశాంక్, కోటిరెడ్డి కాస్త వెరైటీగా ఆలోంచారు. అలాంటి బండిలోనే వేడివేడి పొగలుగక్కే చికెన్ ముక్కలు అమ్మితే ఎలా ఉంటుందని ఆలోచించారు. ఐడియా కత్తిలా వుంది. కంపల్సరీ వర్కవుట్ అవుతుంది. అందరిదీ అదే నమ్మకం. ఇంకేముంది రంగంలోకి దిగారు. “మామ చికెన్” బండ్లతో స్టార్టప్ మొదలుపెట్టారు. లేట్ నైట్ లోనూ, కాస్త వెరైటీ, హెల్థీ స్నాక్ తినాలనుకునే వాళ్ళకూ,మందు బాబుబు లకూ “మామ చికెన్ బళ్ళు” మంచి స్టఫ్ ని అందిస్తున్నాయి.mama chicken vehicle

             బయట ఎక్కడైనా నాన్ వెజ్ తింటున్నామంటే అందరికీ.. ఆ చికెన్ ఎలాంటిదో అనే డౌట్ రావడం సహజం. ఆ డౌట్ “మామ చికెన్” బండి దగ్గర రాదు. ఎందుకంటే వీరిది లైవ్ కిచెన్ కాన్సెప్ట్. కస్టమర్ ఎదుటే చికెన్ రెడీ చేస్తారు. పైగా ధర కూడా అందుబాటులో ఉంటుంది. నిర్వహణ ఖర్చులు బాగా తక్కువ కావడంతో… రూ. 40 నుంచి 70 రూపాయల లోపే చికెన్ వెరైటీస్ అందిస్తున్నారు. ఒడిశా నుంచి తీసుకొచ్చిన చెఫ్ లతో చెకెన్ ఐటెమ్స్ తయారు చేయిస్తున్నారు. మామా చికెన్ బండిలో అమ్మే చికెన్ పూర్తిగా హెల్దీ చికెన్. స్కిన్ లెస్ చికెన్ తో పూర్తిగా నూనె వాడకుండా ఐటమ్స్ రెడీ చేస్తారు. ఆయిల్ లేకుండా తయారు చేయడం వల్ల టేస్ట్ బాగుంటుందనేది ఇద్దరి అభిప్రాయం. కస్టమర్ల ఫీడ్ బ్యాక్ కూడా అదే. బండి మీద ఏం వెరైటీలు ఉంటాయని అనుకోవడానికి లేదు. చికెన్ వింగ్స్, లెగ్ పీసెస్, బేబీ క్యూబ్స్, తందూరి చెకెన్ వీరి మెనూలో ఉన్నాయి. వీటితో పాటు కౌజు పిట్ట మాంసం కూడా దొరుకుతుంది.

మొదట్లో మామా చికెన్ బండ్లు రోడ్డు పక్కన కనపడినప్పుడు కొంతమంది అనుమానంగా చూశారు. కానీ టేస్ట్ చేసిన తర్వాత మళ్లీ మళ్లీ రాకుండా ఉండలేకపోయారు. మౌత్ పబ్లిసిటీయే ఇప్పుడు మామా చికెన్ కు మరింత డిమాండ్ పెంచుతోంది. అందుకే మొదట సింగిల్ డిజిట్ బండ్లతోనే వ్యాపారం ప్రారంభించిన వీరు… కొంచెం సమయం తీసుకుని భారీ ప్రణాళికలతో రావాలని చూస్తున్నారు. హైదరాబాద్, విశాఖ నగరాల్లోనూ వీరు తమ వ్యాపారాన్ని విస్తరించాలని చూస్తున్నారు. అయితే ఇప్పటికే మరిన్ని బళ్ళు మామ చికెన్ తరహాలో తయారౌతున్నాయట…

Must Read: Video: ఆగ్గిపెట్టె అవసరం లేకుండా ఆగ్గిపుల్లని వెలిగించే చిట్కా.

(Visited 10,018 times, 1 visits today)