Home / Entertainment / నేను చనిపోలేదు:వేణు మాధవ్.

నేను చనిపోలేదు:వేణు మాధవ్.

Author:

Venu Madhav

వేణు మాధవ్… పరిచయం అవసరం లేని పేరు. మొన్నటి వరకు బిజి బిజీగా చాలా సినిమాలు చేసిన వేణు ఇప్పుడు సడన్ గా సినిమాలు మానివేయడంతో ఆరోగ్యం భాలేదని మొదట్లో పుకర్లు షికార్లుగా సాగాయి. కానీ ఇప్పుడు ఏకంగా వేణుమాధవ్ చనిపోయాడంటు కొన్ని వెబ్ సైట్స్ మరియు చానల్స్ వార్తలను ప్రచారం చేసాయి. నిజ, నిజాలు తెలుసుకోకుండా ప్రచారం చేయడంతో మనో వేదనకు గురయ్యానని, ఇందుకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కుషాయిగూడ పోలీసులను వేణు మాధవ్ కోరారు.అలాగే రెండు రోజుల క్రితం తమిళ కమెడియన్ సెంథిల్ కి కూడ ఇలాంటి పరిస్థితి రావడంతో వెంటనే తను మీడియ ముందుకు వచ్చి వివరణ ఇవ్వడం జరిగింది.

ఈ రోజులలో సోషల్ నెట్ వర్క్ వాడకం బాగా ఎక్కువ అవడంతో ఎలాంటి చిన్న విషయం జరిగిన క్షణాలలో ప్రపంచం మొత్తం తెలిసిపోతుంది. అలాగే కొన్ని వెబ్ సైట్స్ కావాలని పేరు కోసం ఇలాంటివి చేస్తుంటారు. కానీ ఎవరైన ఇలాంటి వార్తలు రాసే ముందు ఈ వార్త ఎంత నిజం, ఎంత అబద్దం అని తెలుసుకోవలసిన అవసరం ఎంతైన ఉంది. ఎందుకంటే ఒక బ్రతికున్న వ్యక్తి వచ్చి నేను చనిపోలేదు అని చెప్పుకోవలసి రావడం అనేది చాలా బాధాకరమైన విషయం.

Must Read: అక్కడ బాహుబలి అట్టర్ ఫ్లాప్.

(Visited 7,145 times, 1 visits today)