Home / Latest Alajadi / నెట్ బ్యాంకింగ్ ద్వారా డబ్బులు ట్రాన్స్‌ఫ‌ర్ చేసే అన్ని పద్దతుల గురించి తెలుసుకోండి.

నెట్ బ్యాంకింగ్ ద్వారా డబ్బులు ట్రాన్స్‌ఫ‌ర్ చేసే అన్ని పద్దతుల గురించి తెలుసుకోండి.

Author:

పాతనోట్ల రద్దుతో అందరూ తమ దగ్గర ఉన్న పాత నోట్లను తమ బ్యాంకు అకౌంట్లలో జమ చేసారు.. కాని బ్యాంకులలో, ATM లలో తగినంత కొత్త కరెన్సీ లేకపోవడంతో ఎవరికైనా డబ్బులు ఇవ్వాలంటే ఆన్‌లైన్‌ బ్యాంకింగే దిక్కు అయ్యింది. ఏనాడు నెట్ బ్యాంకింగ్ వాడని వారు కూడా ఇప్పుడు డబ్బులు ఆన్‌లైన్‌లో పంపించుకుంటున్నారు. కాని డబ్బులు ట్రాన్స్‌ఫ‌ర్ చేసే పద్దతుల మీదా సరైనా అవగాహన లేకపొవడం వలన తికమక పడుతున్నరు. అలాంటి వారి సందేహాలను నివృతి చేయడానికే ఆ ఆర్టికిల్ వ్రాసాము. నెట్ బ్యాంకింగ్ ద్వారా డబ్బులు ట్రాన్స్‌ఫ‌ర్ చేయడానికి చాలా విధానాలు ఉన్నాయి కాని అందరికి కామన్ గా ఉండే NEFT, RTGS, IMPS, Quick Transfer వంటి వారి గురించి మరియు వాటి మధ్య తేడాలు క్రింద చదవండి.

online-banking-methods

NEFT (నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్స్ ట్రాన్స్‌ఫ‌ర్):
నేష‌న‌ల్ ఎల‌క్ట్రానిక్ ఫండ్స్ ట్రాన్స్‌ఫ‌ర్ అని పిలిచే ఈ ప‌ద్ధ‌తి ద్వారా రోజుకు ఎంత డబ్బునైన ఇతరుల అకౌంట్ కు ట్రాన్స్‌ఫ‌ర్ చేసుకోవ‌చ్చు. ఈ సదుపాయాన్ని వాడుకోవాలంటే డబ్బు పంపాలనుకున్న వారి అకౌంట్ నంబర్, IFSC కోడ్ వంటి వివరాలు కావాలి. ఈ సర్వీసును పని దినాల్లో ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 7 గంటల మధ్య ఉపయోగించుకోవచ్చు. ఈ సమయం దాటిన తర్వతా డబ్బు ట్రాన్స్ఫర్ చేస్తే ఆ ట్రాంజాక్షన్ మరుసటి రోజు ప్రాసెస్ చేస్తారు. NEFT ద్వారా డబ్బులు ట్రాన్స్‌ఫ‌ర్ చేస్తే అ డబ్బులు పంపిన అకౌంట్ లో రెండు గంటలలోగా జమ అవుతాయి. ప్రతి ట్రాంజాక్షన్ కి ట్రాన్స్‌ఫ‌ర్ చేసిన డబ్బులకు అనుగుణంగా రుసుము చెల్లించాలి. ఉదహరణకు NEFT ద్వార 1 లక్ష కన్న తక్కువ రూపాయలు పంపితే 5 రూపాయల రుసుము చెల్లించాలి. దీనిపై మరింత సమాచారం కొరకు RBI వెబ్సైట్ లింక్ చూడండి.

RTGS (రియ‌ల్ టైం గ్రోస్ సెటిల్‌మెంట్‌):
రియ‌ల్ టైం గ్రోస్ సెటిల్‌మెంట్‌ అని పిలిచే ఈ పద్దతి ప్రకారం రెండు లక్షలకు తగ్గకుండా ఎంత డబ్బునైనా ఇతరుల అకౌంట్ కి పంపవచ్చు. డబ్బుల జమ కూడా ట్రాన్స్‌ఫ‌ర్ చేసిన 30 నిముషాలలోగా జరుగుతుంది. కాని ఈ సర్వీస్ ను ఉపయోగించాలంటే తక్కువలో తక్కువ 2 లక్షలు పంపించాల్సి ఉంటుంది మరియు అన్ని బ్యాంకు బ్రాంచిలకు ఈ సదుపాయం లేదు. ఈ సర్వీసు ఉపయోగించి రూ.2 ల‌క్ష‌ల నుంచి రూ.5 ల‌క్ష‌ల వ‌రకు డ‌బ్బు పంపితే రూ.30, రూ.5 ల‌క్ష‌ల‌కు పైన డబ్బుపంపితే రూ.55 చార్జి వసూలు చేస్తారు. ఈ సర్వీసు అన్ని పని దినాల్లో బ్యాంకు పని వేళల్లో మాత్రమే వాడుకోవచ్చు. దీనిపై మరింత సమాచారం కోసం RBI వెబ్సైట్ లింక్ చూడండి.

IMPS (ఇమ్మిడియ‌ట్ పేమెంట్ స‌ర్వీస్‌):
ఇమ్మిడియ‌ట్ పేమెంట్ స‌ర్వీస్‌ పద్దతి ద్వారా దాని పేరుకు తగ్గట్లే వెంటనే ఇతరుల అకౌంట్ కి డబ్బులు పంపవచ్చు. ఈ పద్దతిలో డబ్బులు పంపడానికి అవ‌త‌లి వ్య‌క్తి అకౌంట్ నంబ‌ర్, ఐఎఫ్ఎస్‌సీ కోడ్ లేదా ఎంఎంఐడీ తెలిసి ఉందాలి. ఈ సర్వీసు ఉపయోగించి రోజుకు రూ.2 ల‌క్ష‌ల వ‌ర‌కు మాత్ర‌మే పంపుకునే వీలుంది మరియు ఈ సర్వీసు వాడి ఒక లక్షలోపు డబ్బు పంపితే 5 రూపాయల చార్జీ, 1-2 లక్షలు పంపితే 15 రూపాయల చార్జీ వసూలు చేస్తారు. ఈ సర్వీసు రాత్రి పగలు, సెలవు రోజులనే తేడా లేకుండా అన్ని వేళల్లో వాడుకోవచ్చు.

Quick Transfer ( క్విక్ ట్రాన్సఫర్):

క్విక్ ట్రాన్సఫర్ పద్దతి అన్ని బ్యాంకులకు వర్తించదు.ఈ పద్దతి ఒకే బ్యాంకులో అకౌంట్ ఉన్న ఇతరులకు డబ్బును వెంటనే పంపడానికి ఉపయోగించవచ్చు. ఉదహరణకు SBI నెట్ బ్యాంకింగ్ నుండి ఈ పద్దతి ద్వారా కేవలం ఇంకో SBI బ్యాంకు అకౌంట్ కి మాత్రమే డబ్బు పంపిచవచ్చు. ఈ పద్దతిని ఒక్కో బ్యాంకు ఒక్కో పేరుతో పిలుస్తాయి. ఒకే బ్యాంకు మధ్య జరుగుతున్న ఈ ట్రాన్స్‌ఫ‌ర్ కి ఎటువంటి చార్జీలు ఉండవు. ట్రాన్స్‌ఫ‌ర్ లిమిట్ కూడా ప్రతి బ్యాంకుకు వేరేవిధంగా ఉంటుంది.

ఇవన్ని కాకుండా అసలు ఇంటర్నెట్ బ్యాంకింగ్ లేకపోయినా, మీ ఫోన్ లో ఇంటర్నెట్ లేకున్నా, మామూలు ఫోన్ నుండే డబ్బులు ఖర్చు కాకుండా డబ్బులు ట్రాన్స్‌ఫ‌ర్ చేసుకోవచ్చు మరియు అకౌంట్ బ్యాలెన్స్ చూసుకోవచ్చు. ఆ పద్దతి కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

(Visited 3,099 times, 1 visits today)