Home / Inspiring Stories / మహాత్మా నిన్నెందుకు చంపుకున్నాం..?

మహాత్మా నిన్నెందుకు చంపుకున్నాం..?

Author:

Mahathma Gandhi

ఒక దేశం…రెండు వందల సంవత్సరాల బానిసత్వం. ఒకే మనిషి.. లక్ష్యం కొసం తనలా పోరాడే ఒక్కొక్క మనిషీ తమ దారుల్లో నేలకొరుగుతూంటే చివరి వరకూ పోరాడినవాడు. తన కలసిద్దించాక స్వతంత్ర భారతావని లోనే తన తుదుది శ్వాస విడవాలని ఆశించిన వాడు… మహాత్మా…మహర్షీ… అనిపించుకున్న ఒక మహా ప్రజా పోరాట యోధుడు గాంధీ… అనుకున్నట్టుగానే స్వతంత్ర దేశంలోనే కన్ను మూసాడు ఐతే అది అత్యంత ధారుణంగా హత్య చేయబడి….. ఈ దేశాన్ని మేల్కొలిపి ఒకే లక్ష్యం వైపు నడిపించిన మనిషి ఒక్కడే ఒంటరిగానే వెళ్ళిపోయాడు..కాదు కాదు వెళ్ళగొట్టాం… మనలో ఒకడైన భారతీయుడే ఆయనని వెళ్ళ గొట్టాడు… అసలు ఆ హత్య కు అసలు కారణం ఏమిటి?

మహాత్మా మమ్మల్ని క్షమించు… దేశ విభజన అనంతర పరిణామాల నేపథ్యంలో గాంధీ తీరు రుచించని అతివాదులు ఆయన్ను కాల్చి చంపారు. ఆయన హత్య ఒక్క ఇండియానే కాదు యావత్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. 1948, జనవరి 30న ఆయన హత్యకు గురయ్యారు. వరుస ఉద్యమాలతో రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యానికి కొరకరాని కొయ్యగా మారిన గాంధీ శరీరం మూడంటే మూడు తూటాలకు కుప్పకూలింది. ప్రపంచ విజేత అయిన ఇంగ్లండ్ నే గడగడ లాడించిన ఒక మహా దేహం దేశపు మట్టి మీద ఒరిగి పోయింది…

Gandhi Vardanthi 1

భారత దేశ విముక్తి సంబరం ఇంకా మొదలవనే లేదు ఒక ముసలం పుట్టింది దాని పేరే మత ప్రాతిపదికన జరిగే విభజన. అఖండ బారతావని రెండుగా చీలాల్సిందేననీ విభజన జరగకపోతే దేశంలో అంతర్యుద్ధం తప్పదని ముస్లింలీగ్ నాయకుడు మహమ్మద్ అలీ జిన్నా హెచ్చరించాడు. దీంతో ఇష్టం లేకున్నా గాంధీ విభజనకు అంగీకరించారు. అంతే కాదు పాక్ కి ఇవ్వాల్సిన నష్టపరిహారం కూడా 30 కోట్లవరకూ అందజేసారు కూడా అయితే ఇదే విషయం మనలోనే కొందరికి నచ్చలేదు. వారికి నచ్చని విషయం గాంధీ చేతుల్లో కూడా లేదన్న విషయం వారికి కూడా అర్థం కాలేదు అంతే గాంధీ హత్య కు కుట్ర మొదలయింది…

గాంధీ హత్యలో నాధూరం గాడ్సే, నారాయణ్ ఆప్టేతోపాటు మిత్రులు సావర్కర్, విష్ణు కర్కరే, శంకర్ కిష్టయ్య, గోపాల్ గాడ్సే, మదన్‌లాల్ బహ్వా, దిగంబర్ బడ్గే చేతులు కలిపారు. అంతా కలిసి ఎలాగైనా గాంధీని అంతమొందించాలని సిద్ధమయ్యారు. హత్య జరిగిన తరువాత పారిపోకూడదని, తమ ఉద్దేశం అందరికీ తెలియపరిచేలా లొంగిపోవాలని నిర్ణయించుకున్నారు. జనవరి 20న ఢిల్లీలోని బిర్లాహౌస్‌లో గాంధీని హత్య చేయాలనుకున్నారు. ముందస్తు పథకం ప్రకారం.. గాంధీ ప్రసంగిస్తున్న వేదిక వెనక వైపు ఉన్న సర్వెంట్ క్వార్టర్స్ నుంచి కాల్పులు జరపాలనుకున్నాడు దిగంబర్ బడ్గే. కానీ, కుదరలేదు. అక్కడ ఉన్న కిటికీ నుంచి గాడ్సే తమ్ముడు గోపాల్ గాడ్సే బాంబు విసురుదామనుకున్నాడు….అయితే అనుకోని కారణాల వల్ల ఆ కుట్ర విఫలం అవటమే కాదు కుట్ర దారులు దొరికి పోయారు కూడా. అయితే అప్పటికి గాంధీ అతి మంచితనమే వారికి వరమయింది. వారిని విడిచి పెట్టవలసిందిగా కోరింది స్వయంగా మహ్జాత్ముడే….అయితే వారు తమ నిర్ణయాన్ని మార్చుకోలేదు. మరో సారి కుట్రకు తెగబడ్డారు.

Nathuram Godse

పోలీసుల నిఘా పెరగడంతో ఈసారి పథకం విఫలం కాకూడదని నాధూరం గాడ్సే కాల్పులు జరపాలని నిర్ణయించుకున్నాడు. సరిగ్గా పదిరోజుల అనంతరం 1948, జనవరి 30 సాయంత్రం 5.17 నిమిషాలకు బిర్లా నివాసంలోని ప్రార్థనా సమావేశ మందిరానికి వెళుతుండగా.. ఆయనకు నాధూరాం గాడ్సే ఎదురుపడ్డాడు. గాంధీకి నమస్కరించాడు. ఇప్పటికే ఆలస్యమైందంటూ గాడ్సేను పక్కకు నెట్టేసే ప్రయత్నం చేయబోయింది గాంధీ అనుచరురాలు అభా ఛటోపాధ్యాయ. కానీ ఆమెను పక్కకు నెట్టిన గాడ్సే తన వెంట తెచ్చుకున్న తుపాకీతో మూడుసార్లు పాయింట్‌బ్లాంక్ రేంజ్‌లో కాల్పులు జరిపాడు. దేశ స్వాతంత్య్రోద్యమానికి నేతృత్వం వహించిన మహానుభావుడు అక్కడికక్కడే కుప్పకూలాడు. వెంటనే పోలీస్.. పోలీస్! అని అరుస్తూ నాధూరాం గాడ్సే లొంగిపోయాడు.

గాంధీ హత్యలో కొన్ని ముఖ్య ఘట్టాలు:

  • మహాత్మా గాంధీ హత్య కు సంబందించిన ఎఫ్‌ఐఆర్ ఢిల్లీలోని తుగ్లక్ రోడ్ పోలీస్‌స్టేషన్‌లో నమోదైంది.
  • హంతకులు నాధూరాం గాడ్సే, నారాయణ్ ఆప్టే గాంధీని హత్య చేసేందుకు బొంబాయి నుంచి ఢిల్లీకి విమానంలో వచ్చారు.,
  • మొదటి సారి హత్యప్రయత్నంలో జనవరి 20న బాంబు పేల్చిన మదన్‌లాల్ ధైర్యవంతుడైన కుర్రాడు అని గాంధీ అభివర్ణించాడు.
  • గాడ్సే కాల్చిన తూటాల్లో ఒకటి ఛాతిలోకి దూసుకెళ్లింది. మిగిలిన రెండు పొట్టలోకి చొచ్చుకెళ్లాయి.
  • ఈ కుట్రలో పాల్గొన్న వారంతా ముంబై రాష్ట్రానికి చెందినవారే, నాధూరాం గాడ్సే, నారాయణ్ ఆప్టేలను 1949, నవంబరు 15న ఉరితీశారు.

Gandhi

అలా ఒక దేశం తమను విముక్తి దిశగా నడిపించిన తమ నాయకుని మరణాన్ని చూసి అదీ తమలో ఒకడే అన్న నిజం తెలిసి కుమిలిపోయింది. మాలో ఇప్పటికీ క్షమించలేని తప్పుని నువ్వు భరించక తప్పదు… నీ పిల్లలమే కదా… ఓ మహాత్మా…ఓ మహర్షీ….

Must Read: మరుగున పడ్డ మహా వీరుడు లాల్ బహదూర్.

(Visited 3,874 times, 188 visits today)