Home / Entertainment / హమారా హైదరాబాద్

హమారా హైదరాబాద్

Author:

హైదరాబాద్ కొందరి కలలతీరం,మరికొందరి ఆత్మ గౌరవం, ఇంకొందరికి జీవితం అన్నీ అయ్యింది హైదరాబాద్.

పత్తర్గట్టీ చాయ్, ఓల్డ్ సిటీ పాన్, మదీనా బిర్యానీ, ఐటీ హంగులూ సామాన్య జీవితపు నిట్టూర్పులూ అన్నిఉంటాయ్… ఔను హైదరాబాద్ లో అన్నీ ఉంటాయ్… హైదరాబాద్ గురించి వారానికో నాలుగు మాటలు ఇక నుంచీ ప్రతి శనివారం హమారా హైదరాబాద్ లో

హైదరాబాద్ దేనికి ప్రత్యేకం..!? బిర్యానీ..!? చార్మినార్?? గోల్కొండ!!? ఐటీ..?? ఇంతేనా ఇదేనా హైదరాబాద్..! నవాబ్ దగ్గర్నుంచీ పఖీర్ దాకా “హమారా హైద్రావాద్” అనుకోనీకి ఇంకేదొ ఉంది. పురాణా శహర్ డబల్ రోటీ కాన్నుంచి గ్రాండ్ కాకతీయ లో బర్గర్ దాకా హైదరాబాద్ మనల్ని చుట్టుకుంటది. షేర్ ఆటో దగ్గర్నుంచీ ఒలా క్యాబ్ దాకా హైద్రాబాద్ అన్నిటినీ తనలో దాచుకుంటది.. చలో ఏక్ రౌండ్ మారింగే.

1.ఇరానీ కేఫ్:

హైదరాబాద్ hyderabad irani cafe

హైదరాబాద్ ఇరానీ చాయ్ కి పెట్టింది పేరు. ఈ ముక్క అమెరికా లో ఉన్నోన్ని అడిగినా చెప్తాడు కానీ..మామూలుగా ఎక్కడ పడితే అక్కడ తాగేస్తే హైద్రవాద్ ఫ్లేవర్ రాదు మరి. ఆ చాయ్.., కేఫ్ లోనే తాగాలి.   ” పత్తర్ గట్టీ, చాదర్ ఘాట్, బహ్దూర్ పురా ఏడికన్న వో చిచ్చా ఒక కేఫ్ ఉంటది, సమోసా, డబల్ రోటీ, ఉస్మానియా బిస్కెట్… ఒక్క మాటల చెప్పాలంటే ” కేఫ్ లలో అసలైన ఐద్రవాద్ ఉంటది

2.సిటీ బస్:

హైదరాబాద్ hyderabad city bus

చింతల కుంటా టు హైటెక్ సిటీ లేదా శాలి బండా టు బోరబండా బస్సుంటుంది కానీ సీట్ ఉండదు.నీ సీటు కి సీటు యోగం ఉండదు.. ఐనా..!

“హైదరాబాద్లో సిటీ బస్ లో కూసునుడేంది..! ఇజ్జత్ ఉండాల్నా వద్దా…!?

3. హైద్రబాదీ స్లాంగ్:

హైదరాబాద్ hyderabad slang

తెలంగాణాలో భాగమే ఐనా హైదరాబాద్ భాష ప్రత్యేకం, ఉర్దూ, తెలుగూ, అరబీ అన్నీ కలిసిపోయి ప్రత్యేక యాస ఉన్న భాష, అందులో ఓల్డ్ సిటీ భాష మరీ ప్రత్యేకం.

క్యా తో భీ యై యారో …..! కైకూ పర్షాన్ కర్రా”

4.హైదరాబాద్ ప్రేమిస్తుంది:

హైదరాబాద్ hyderabad lovers

ప్రేమ కథ లేకుండా హయ్దరాబాద్ లేదు పురానా ఫూల్ సాక్షిగా భాగమతి ప్రేమ కథ మనకు తెలుసు. ఇప్పటికీ హైదరా బాద్ ప్రేమికుల నగరమే… ఎన్ని పార్కులున్నా బస్టాప్ లు కూడా ప్రేమికులతోనే ఎప్పుడూ ఫుల్ గా ఉంటాయ్…ప్రేమికుల నగరం హైదరాబాద్.

5. ఫుట్ పాత్ షాపింగ్:

హైదరాబాద్ footpath shopping

ప్రశాంతత కోసం గుడికి వెళ్ళే వాళ్ళే కాదు ఫుట్ పాత్ మీద షాపింగ్ చేయటం కూడా హైదరబాదీయుల ముఖ్యమైన అలవాటే, బట్టలూ, పుస్తకాలూ, ఎలక్ట్రానిక్ పరికరాలూ ఏదైనా సరే హైదరాబాద్ సంస్కృతిలో ఫుట్ పాత్ మార్కెట్ ఒక భాగం.

6.షేర్ ఆటో..!:

హైదరాబాద్ hyderabad traffic

మీరు లగ్జరీ జర్నీలెన్నో చేసుండొచ్చు,ఏడారుల్లో ఒంటెల మీదా,ఏ అమేజాన్ లోనో పడవల మీదా.. ఊహూ…! సరిపోదమ్మా..!! హైదర బాద్ ఏల్ బీ నగర్ తాన 7 సీటరెక్కి ఉప్పల్ రింగ్ రోడ్ దాక పోలేదంటే.

సారీ డూడ్..! ఎన్ని జర్నీలు చేసినా వేస్ట్ వేస్ట్ అంతే..”

7.”హైదరబాదే” ఒక మతం:

హైదరాబాద్ hyderabad sadar festival

మతాల గోడవలుంటాయనే హైదరాబాద్ లో గుడీ మజీద్ పక్క పక్కనే ఉంటాయ్. మొహరం కి ధూలాటా,సదర్ కి దున్న పోతులాటా రెండిటికీ ఇద్దరూ కలిసే ఆడి పాడతారు. జాతీయ పందగలప్పుదు జేబుకి జెండా లేకుండా వెళ్ళి జెండా లేకుండా ఖాలీగా తిరిగి రాము అన్న సంగతి కొందరికే తెలుసు..

న హిందూ..! న ముసల్మాన్..! హైదరబాదీ హై హం

 

8.హమారా షాన్:

హైదరాబాద్ hyderabad charminar

పెద్ద పెద్ద కట్టడాలే ఉండొచ్చు ఇంకా గొప్ప విశేశాలే ఉండొచ్చు కానీ…! అవన్నీ అందరికీ తెలిసేవే.. ఎలాగూ చూసేవే. గుంతలు పడ్డ రోడ్లూ, ట్రాఫిక్ జాం లూ, ఇలా ఎన్నైనా ఉండనీ.. హైదరాబాద్ అన్నిటినీ దాచుకుంటుంది.

Must Read: సినిమాల ప్రభావం జనాల మీద ఎంతుందో గానీ వినాయకుడి మీద బానే ఉంది.

ఏంటీ..! పైన చెప్పినవన్నీ ఎక్కడైనా ఉండేవే గా అని ఇంకో సిటీ తో పోల్చబోతున్నారా..!?? ఇంకో చాన్సే లేదు పైన చెప్పినవన్నీ అన్ని సిటీల్లోనూ ఉండొచ్చు కానీ అవి హైదరాబాద్ లో ఉండటమే వాటి ప్రత్యేకత.. అదెలా…? అనిపిస్తే వారం వారం ఇదే లింక్ ఫాలో ఐపోండి.

(Visited 133 times, 1 visits today)