Home / Entertainment / టాలీవుడ్ లో ఏ స్టార్ హీరో చేయని సాహసం చేయబోతున్న రామ్

టాలీవుడ్ లో ఏ స్టార్ హీరో చేయని సాహసం చేయబోతున్న రామ్

Author:

హీరో రామ్ దూకుడైన కుర్రాడికి మారు పేరు లాగా ఉంటాడు. తన దూకుడైన నటన మరియు డాన్సులతో తెలుగు ప్రేక్షకులని మెప్పిస్తాడు. తన మొదటి చిత్రం ‘దేవదాసు’ తోనే అందరిని ఆకట్టుకున్న ఈ యువ హీరో, అంచెలంచెలుగా ఎదిగి స్టార్ డమ్ సంపాదించుకున్నాడు. సినిమా సినిమాకి పాత్రలో కొత్తదనం కోరుకునే హీరోలలో రామ్ ఒకడు. ఇప్పటికే అటు మాస్ ఇటు క్లాస్ ప్రేక్షకుల మనసు దోచేసుకున్న ఈ ఎనర్జిటిక్ స్టార్ రామ్, ఎవరు ఊహించని పాత్ర చేయబోతున్నాడు.

hero ram next film
‘నేను శైలజ’ సినిమా తర్వాత కొంచెం విశ్రాంతి తీసుకున్న రామ్, ప్రస్తుతం గతంలో ‘కందిరీగ’ సినిమాతో తనకి హిట్ ఇచ్చిన దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ తో ఒక చిత్రం చేస్తున్నాడు. అయితే, తాజాగా పటాస్, సుప్రీమ్ లాంటి వరుస విజయాలు అందుకున్న దర్శుకుడు అనిల్ రావిపూడితో రామ్ తన 15వ చిత్రం చేయబోతున్నట్లు ట్విట్టర్లో పోస్ట్ చేసాడు. ఇందులో రామ్ గుడ్డివాడుగా(blind) కనిపించబోతునట్లు దర్శకుడు అనిల్ రావిపూడి తెలిపాడు. ఈ మధ్య కాలంలో టాలీవుడ్ లో ఏ స్టార్ హీరో చేయని సాహసం రామ్ చేయబోతున్నాడు. రామ్ అన్ని రొటీన్ పాత్రలు చేస్తున్నాడన్న విమర్శకులకు ఇది చెంపపెట్టు లాంటిది. ఏదేమైనా ‘నేను శైలజ’ లాంటి ఒక మంచి హిట్ చిత్రం వచ్చినా, ఇంతటి సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్న రామ్ ని అందరూ అభినందించాల్సిందే.

Must Read: ఒక మనసు సినిమా పర్ఫెక్ట్ రివ్యూ & రేటింగ్.

(Visited 2,076 times, 1 visits today)