Home / Inspiring Stories / చాలా మంది ఇలాగే ఛార్జింగ్ పెడుతుంటారు…! అలా చేస్తే బ్యాటరీ పాడవుతుంది..!

చాలా మంది ఇలాగే ఛార్జింగ్ పెడుతుంటారు…! అలా చేస్తే బ్యాటరీ పాడవుతుంది..!

Author:

ఇప్పుడు ప్రతి ఒక్కరి దగ్గర స్మార్ట్ ఫోన్ ఖచ్చితంగా ఉంటుంది, కానీ స్మార్ట్ ఫోన్ ని ఎంత ఎక్కువసేపు వాడితే అంత త్వరగా ఛార్జింగ్ అయిపోతుంది, సామ్రాట్ ఫోన్ వాడే అందరిని వేధించే ప్రధాన సమస్య బ్యాటరీ ఛార్జింగ్ అయిపోవడమే, బ్యాటరీ ఫుల్ అయ్యేలా ఛార్జింగ్ పెట్టిన కూడా కొన్నిసార్లు ఒక్కగంట కూడా కాకుండానే బ్యాటరీ స్విచ్ ఆఫ్ అయిపోతుంది, ఇంకొన్ని సార్లు ఫోన్ బ్యాటరీ ఫుల్ గా ఉన్నట్లు చూపించిన ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోతుంది, కొన్ని సార్లు ఫోన్ కొన్న నెల రోజులకే బ్యాటరీ సరిగ్గా పనిచేయదు, ఇలా అయినప్పుడు మనం బ్యాటరీ ప్రాబ్లమ్ అనుకోని కొత్త బ్యాటరీ తీసుకుంటాం కానీ ఈ ఛార్జింగ్ సమస్యకి అసలు కారణం మనం ఛార్జింగ్ పెట్టే విధానామే…!

How-To-Increase-Battery-Life

మనం ఫోన్ ఎప్పుడు ఛార్జింగ్ కి పెట్టిన రెండు, మూడు గంటలు పెడతాము, కొన్నిసార్లు రాత్రి పడుకునే సమయంలో ఛార్జింగ్ పెట్టడం పొద్దున్నే లేచేంతవరకు అలానే బ్యాటరీ ఛార్జింగ్ అవుతూనే ఉంటుంది,ఇలా ఎక్కువసేపు ఛార్జింగ్ పెట్టినప్పుడు బ్యాటరీలోని లిథియం అయాన్స్ ప్రవాహశక్తిని కోల్పోతాయట. రుణావేశం గల ఎలక్ట్రోడ్ నుంచి ధనావేశం గల ఎలక్ట్రోడ్‌కు లిథియం అయాన్స్ ప్రవహించే స్థాయిని బట్టి బ్యాటరీ పని విధానం ఉంటుంది. రాత్రంతా ఛార్జింగ్ పెట్టడం వల్ల లిథియం అయాన్స్ బలహీనమై బ్యాటరీ సామర్థ్యం దెబ్బతింటుంది. కొన్నిసార్లు బ్యాటరీ 100% అయ్యే వరకు ఛార్జింగ్ పెడతాము ఇలా పెట్టడం కూడా బ్యాటరీకి మంచిది కాదు, 95% ఛార్జింగ్ కాగానే తీసేస్తే మంచిదని నిపుణులు అంటున్నారు.

మీ బ్యాటరీ కెపాసిటీని బట్టి, మీ ఛార్జర్ వోల్టేజీని బట్టి ఎంతసేపు ఛార్జింగ్ పెట్టాలనేది ఈ కింది టేబుల్‌లో గమనించగలరు:

mobile-battery-charging-tab

ఒకేసారి ఛార్జింగ్ పెట్టకుండా అప్పుడప్పుడు ఛార్జింగ్ పెట్టడం వల్ల బ్యాటరీ పనితీరు మెరుగుపడే అవకాశం ఉందని నిపుణులు తెలిపారు, అలాగే అన్ని స్మార్ట్‌ఫోన్ బ్యాటరీలూ లిథియం- అయాన్‌తోనే తయారవుతాయి. లిథియం-అయాన్‌ను వేడి ప్రదేశంలో ఉంచితే దాని నుండి అగ్ని పుట్టే అవకాశం ఉంది, ఒక్కువసేపు ఛార్జింగ్ పెట్టడం వల్ల బ్యాటరీ బాగా వేడిక్కి పేలిపోయే ప్రమాదం కూడా ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి.

Must Read: ట్విట్టర్, ఫేస్‌బుక్‌ అకౌంట్లతో కోట్లు సంపాదించాడు.

(Visited 20,426 times, 1 visits today)