Home / health / శరీరంలో వేడి తగ్గాలంటే ఈ చిట్కాలు పాటించండి…!

శరీరంలో వేడి తగ్గాలంటే ఈ చిట్కాలు పాటించండి…!

Author:

శరీరంలో వేడి ఉండటం అనేది చాల మందికి ఉండే ఆరోగ్య సమస్య. శరీరంలో వేడి చేయటం వలన చాలా రకాల ఇబ్బందులు పడాల్సి వస్తుంది. వేడి వలన అంతర్గత అవయవాలకు నష్టం, వేడి తిమ్మిర్లు, వేడి దద్దుర్లు, మొటిమలు, కురుపులు, మూత్రం మంటతో రావటం, ముక్కులోంచి రక్తం కారటం, మైకం మరియు వికారం వంటి అనేక ఆరోగ్య సమస్యలు వస్తుంటాయి. మితిమీరిన వేడి వాతావరణం, వేడిలో పనిచేయడం, వేడి కలిగించే ఆహారాలను తీసుకోవడం, నీరు అతి తక్కువగా త్రాగడం ఇవన్నీవేడి చేయటానికి కారణాలు. కింద తెలిపిన సులభమైన పద్ధతుల ద్వారా వేడి తగ్గించుకోవచ్చు.

Reduce Body Temperature

  • ఒక టీస్పూన్ కరక్కాయ పొడిని తీసుకొని, అందులో ఒక అరచెంచాడు పంచదారను కలిపి ఉదయం పూట ఖాళీ కడుపుతో తీసుకుంటే శరీరంలో వేడి తగ్గుతుంది.
  • విటమిన్-సి అధికంగా ఉండే పండ్లను ఎక్కువగా తీసుకోవాలి.
  • వెన్న తీసిన మజ్జిగను తీసుకోవడం మంచిది.
  • ఎప్పటికప్పడు చల్లటి నీరు త్రాగడం వల్ల శరీరం వేడి నుండి ఉపశమనం పొందుతుంది.
  • రోజులో రెండు లేదా మూడు సార్లు కొబ్బరి నీళ్లు తాగడం వల్ల బాడీ హీట్, హీట్ స్ట్రెస్ తగ్గించుకోవచ్చు.
  • పల్చటి మజ్జిగలో నిమ్మరసం, ఉప్పు వేసుకొని తాగితే శరీరంలోని వేడి తగ్గుతుంది.
  • పుచ్చకాయ తినటం వలన చాలా త్వరగా శరీరంలోని వేడి తగ్గుతుంది.
  • స్పూన్ మెంతులను ఏదో ఒక రూపంలో ప్రతిరోజు తీసుకోవాలి.
  • పాలలో తేనే కలిపి తాగాలి.
  • వంటకాలలో కొబ్బరి నూనె, ఆలివ్ ఆయిల్ వాడితే మంచిది.
  • నాన్ వెజ్, స్పైసీ, జంక్ ఫుడ్ మరియు ఆల్కహాల్ కి దూరంగా ఉండటం మంచిది.
  • రోజు ఉదయాన్నే దానిమ్మ జ్యూస్ తాగాలి.
  • గసగసాలు శరీరాన్ని చల్ల పరచడానికి బాగా పని చేస్తాయి.

Also Read: గురకతో ఇబ్బంది పడుతున్నారా..? అయితే ఇలా చేయండి..!

(Visited 20,256 times, 1 visits today)