Home / Latest Alajadi / మీదగ్గర ఉన్న పాత 1000,500 నోట్ల స్థానంలో కొత్త నోట్లు పొందాలంటే ఇలా చేయండి.

మీదగ్గర ఉన్న పాత 1000,500 నోట్ల స్థానంలో కొత్త నోట్లు పొందాలంటే ఇలా చేయండి.

Author:

మోడీ ప్రకటించిన నిర్ణయంతో ఒక్కసారిగా దేశంలో అలజడి చెలరేగింది, ఇప్పటివరకు జేబులో ఉన్న 1000, 500 నోట్లు చెల్లవు అని తెలిసేసరికి సామాన్య జనాలులో ఆందోళన మొదలైంది, ఇప్పుడు ఏ షాప్ లో ఇచ్చిన, ఎవరికీ ఇచ్చిన 500, 1000 నోట్లు తీసుకోవట్లేరు, ఏదైనా కొనుక్కోవాలంటే 100 నోట్లు ఉండాల్సిందే, మోడీ ప్రకటించిన ఈ సంచలన నిర్ణయంతో ఎక్కువ ఇబ్బంది పడేది సామాన్య ప్రజలే, ఈ నిర్ణయం వల్ల కొన్ని రోజులు ఇబ్బంది ఉన్న దీర్ఘకాలంలో ఎక్కువ ప్రయోజనాలు కలుగుతాయి.

ఈ నిర్ణయం వల్ల నల్లధనాన్ని దాచిపెట్టుకున్న వారు బయటపడే అవకాశం ఉంది, నల్లధనం ఎక్కువగా 1000,500 నోట్ల రూపంలోనే దాచిపెట్టుకుంటారు, ఆ నోట్లు ఈరోజు నుండి చెల్లవు, వాటిని మార్చుకోవాలంటే ఖచ్చితంగా బయటకి తీయాల్సిందే, వారు అలాగే దాచిపెట్టుకుంటే అవి చిత్తు కాగితాల లాగ మిగిలిపోతాయి.

1000, 500 నోట్లని ఎలా మార్చుకోవాలి.

1000, 500 నోట్లని మార్చుకోవాలంటే ఇలా చేయండి:

  • నల్లధనం లేనివారు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, నవంబర్ 11 నుండి బ్యాంకులలో, పోస్ట్ ఆఫీస్ లలో పాత నోట్ల స్థానములో కొత్త నోట్లని పొందవచ్చు.
  •  మీ దగ్గర ప్రస్తుతం ఉన్న పాత 500, 1000 నోట్లని బ్యాంకు లేదా పోస్ట్ ఆఫీస్ అకౌంట్ లలో జమ చెయ్యాలి.
  • అలా డిపాజిట్ చేసిన డబ్బును.. నవంబర్ 11 వ తేదీ నుండి బ్యాంకుల, పోస్ట్ ఆఫీస్ ల ద్వారా, అన్ని ఏటీఎంల ద్వారా కొత్త 500, 2000 ల నోట్లని తీసుకోవచ్చు.
  • నవంబర్ 11 నుండి బ్యాంకు, ఏటీఎం ల ద్వారా రోజుకి 10,000 , వారానికి 20,000 మాత్రమే విత్ డ్రా చేసుకునే అవకాశం ఉంది,
  • కొన్నిరోజుల తరువాత విత్ డ్రా పరిమితులని పెంచుతారు.
  • ఇలా డిసెంబర్ 30 వ తేదీలోపు మీ దగ్గర ఉన్న 1000, 500 నోట్లని మార్చుకోవాలి.
  • గ్రామాలలో చాలా మందికి బ్యాంకులలో అకౌంట్లు ఉండవు కాబట్టి ప్రస్తుతానికి అలాంటి వారు బంధువుల లేదా తెలిసిన వారి అకౌంట్ లలో పాత 1000, 500 నోట్లని జమచేసి వారి దగ్గరి నుండి కొత్త నోట్లని తీసుకోవాలి.
  • పాత నోట్ల స్థానంలో అప్పటికప్పుడు మార్చుకోవాలనుంటే ఐడి కార్డు ఉండాలి, ఇలా 4000 రూపాయలు మాత్రమే మార్చుకోవచ్చు.
  • బస్టాప్ కౌంటర్ లలో, రైల్వే స్టేషన్, ఎయిర్ పోర్ట్ లలో, పాల కేంద్రాలలో , ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే పెట్రోల్ బంక్ లలో 11 వ తేదీ అర్థరాత్రి వరకు ఈ నోట్లని తీసుకుంటారు.

నవంబర్ 11 వ తేదీ నుండి కొత్త నోట్లు చలామణి లోకి వస్తాయి కాబట్టి, అప్పటివరకు మీ దగ్గర ఉన్న 100 నోట్లతో సర్దుకుపోవాలి, కార్డుల ద్వారా ఆన్ లైన్ బ్యాంకింగ్ ద్వారా లావాదేవీలు చేసేవారికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. నల్లధనంతో పాటు మార్కెట్ లో ఉన్న నకిలీ నోట్లు కూడా ఇప్పటినుండి దేనికి పనికిరావు.

Also Read: 500, 1000 రూపాయల నోట్ల రద్దుపై హల్ చల్ చేస్తున్న కామెడి వీడీయో, పోస్టులు

(Visited 14,170 times, 1 visits today)