Home / health / బల్లులు, బొద్దింకల వల్ల ఇబ్బంది పడుతున్నారా..? ఇలా చేయండి..!

బల్లులు, బొద్దింకల వల్ల ఇబ్బంది పడుతున్నారా..? ఇలా చేయండి..!

Author:

how-to-control-lizards-and-cockroaches

చాలా మంది ఇళ్లల్లో మనము బొద్దింకల వలన కలిగే ఇబ్బందులను తరచూ మనం చుస్తే ఉంటాం. బొద్దింకల నివారణ కోసం చాలా ఇళ్లల్లో ఖరీదైన హిట్ లు వాడుతుంటారు. . పల్లెలలో అయితే ఎక్కువగా డాంబర్ గోళీలు వాడుతుంటారు. కానీ వాటి వలన మన ఆరోగ్యానికి చాలా ప్రమాదం అలాగే డబ్బులు కూడా ఖర్చు. అందుకే మీ కోసం సహజ పద్దతిలో మీ కోసం ఈ చిన్న చిట్కా.

  • ముందుగా ఒక కోడి గుడ్డును తీసుకోని అందులో పచ్చగా ఉండే సొనను మాత్రమే ఒక గిన్నెలో వేయాలి
  • ఆ తర్వాత బోరిక్ యాసిడ్ అనే పౌడర్ 50 గ్రా ( మనకు దుకాణాలలో దొరుకుతుంది) ను ఆ గిన్నెలో వేసి బాగా కలపాలి.
  • కోడి గుడ్డు సొనను, బోరిక్ యాసిడ్ పౌడర్ ని ఒక ముద్దలా ఏర్పడే వరకు కలపాలి
  • ఇలా బాగా కలపడం వలన అది ఒక పేస్టులా తయారు అవుతుంది
  • ఈ పేస్టును బొద్దింకలు తిరిగే ప్రాంతాలలో ఉంచడం వలన బొద్దింకలు చనిపోతాయి.
  • ఇక మీకు బొద్దింకల నుండి ఎలాంటి ఇబ్బంది ఉండదు.

ఇంట్లో బొద్దింకల తరువాత ఎక్కువగా ఉండేవి బల్లులు, బల్లాలని చూస్తేనే చాలా మంది భయపడుతుంటారు, బల్లుల కలుషితం చేసిన ఆహారాన్ని తినడం వల్ల మనుషుల ప్రాణాలకే ప్రమాదం ఉంటుంది, ఇంకొంత మంది బల్లులు శరీరం మీద పడటం వల్ల కూడా వివిధ రకాల సమస్యలు వస్తాయని భావిస్తారు. ఇంత ప్రమాదకరమైన బల్లులని నిరారించడానికి ఎటువంటి మందులు లేవు, కానీ కొన్ని చిట్కాల ద్వారా బల్లులని నియంత్రించవచ్చు, ఆ చిట్కాలు మీకోసం..!

  • కోడిగుడ్డు: బల్లులు కోడిగుడ్డులని చూసి భయపడుతాయి, పగులగొట్టిన కోడిగుడ్డు షెల్ ని బల్లులు తిరిగే ప్రాంతంలో పెట్టాలి, అవి వాటిని చూసి భయపడుతాయి.
  • వెల్లుల్లి: మన వంటిట్లో ఉండే వెల్లుల్లితో కూడా బల్లులని నియంత్రించవచ్చు, వెల్లుల్లిలో ఉండే ఘాటైన వాసన వాటిని రాకుండా చేస్తుంది. వెల్లుల్లి రసాన్ని బాటిల్లో వేసి ఇట్లో అప్పుడప్పుడ స్ప్రే చేస్తుండాలి, ఇలా చేస్తే బల్లులు ఇంట్లోకి రావు.
  • అమ్మోనియా: అమ్మోనియం వాటర్ తో తరచూ ఇల్లు శుభ్రం చేస్తుంటే బొద్దింకలు, మరియు బల్లుల బెడదను నివారించుకోవచ్చు . రెండు కప్పులు అమ్మోనియంను ఒక బకెట్ వాటర్ లో మిక్స్ చేసి ఇల్లు శుభ్రం చేయాలి. ఇలా వారంలో రెండు సార్లు చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది.

Must Read: బల్లి మన శరీరంపై ఏ చోట పడితే ఏమైతుందంటే?

(Visited 9,534 times, 1 visits today)