Home / సాహిత్యం / విఙ్ఞానం,వికాసం,సాహిత్యం,పుస్తకం ప్రారంభమైన హైదరాబాద్ పుస్తక ప్రదర్శన.

విఙ్ఞానం,వికాసం,సాహిత్యం,పుస్తకం ప్రారంభమైన హైదరాబాద్ పుస్తక ప్రదర్శన.

Author:

Hyderabad Book Fair 2015

పది రోజులు,371స్టాళ్ళు లక్షలాది పుస్తకాలు..అప్పుడే ఏడాది గడచి పోయింది మళ్ళీ పుస్తక మహోత్సవం మొదలవనుంది. ఈ రోజు నుంచీ  18 నుండి 27 వరకు పది రోజుల పాటు తెలంగాణ కళాభారతి (ఎన్‌టీఆర్‌ స్టేడియం)లో  జరగనుంది. భిన్న సంస్కృతులు, విభిన్న భాషలకు సంబంధించిన అనేక విలువైన పుస్తకాలు ఒకే చోట లభించనున్నాయి. పుస్తకాలు అమ్ముకోవడానికే ఫెయిర్‌ను పరిమితం చేయకుండా తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా కార్యక్రమాలు నిర్వహించేందుకు నిర్వాహకులు సకల ఏర్పాట్లు చేశారు పుస్తకపఠనంపై విద్యార్థుల్లో ఆసక్తి పెంచేలా పలు కార్యక్రమాలు నిర్వహించనుంది. ఈ పుస్తక ప్రదర్శనలో తెలుగు రాష్ట్రాలకు చెందిన 178 పబ్లిషర్స్‌ తమ స్టాల్స్‌ను ఏర్పాటు చేస్తున్నారు. ఈ పుస్తక ప్రదర్శనను రాష్ట్ర ప్రభుత్వం, సాంస్కృతిక శాఖ సౌజన్యంతో నిర్వహిస్తోంది.

Hyderabad Book Fair 2015

తోపుడు బండి సాధిక్ అలి “తోపుడు బండి పబ్లికేషన్స్” పేరుతో మొదటిసారి తమస్టాల్ ని ఏర్పాటు చేయబోతున్నారు. కవి యాకూబ్ ఫేస్ బుక్ లో నిర్వహించే కవి సంగమం గ్రూపు వారి పుస్తకాలతో కలిసి ఏర్పాటు చేస్తున్న ఈ స్టాల్ నంబర్ 10 పూర్తి స్థాయి తెలుగు కవిత్వ పుస్తకాలతో ప్రత్యేకాకర్షణగా నిలవనుంది. అంతే కాకుండా స్టాల్ ప్రముఖ కవి,సామాజిక ఉధ్యమకారుడూ స్కై బాబా నిర్వహించే స్టాల్ నంబర్ 119 అభ్యుదయ రచనలతో కూడిన దళిత బహుజన వాద రచనలకు వేదికగా నిలవనుంది… ఇవే కాకుండా ప్రతీ ఏటా ఉండే వాసిరెడ్డీ పబ్లికేషన్స్, నవోదయా,ఎమ్మెస్కో లాంటి పబ్లికేషన్స్ వారు తమ తమ స్టాల్లను ఏర్పాటు చేయనున్నారు.

Hyderabad Book Fair 2015

కేవలం పుస్తకాలను అమ్మటం మాత్రమే కాదు పుస్తక ప్రదర్శనపై అవగాహన కల్పించేందుకు వివిధ రూపాల్లో నెలరోజుల పాటు ప్రచార కార్యక్రమాలు జరగనున్నాయి. ఈ పుస్తక ప్రదర్శనలో తెలుగు మాట్లాడే రెండు రాష్ట్రాలకూ రాష్ట్రాలకు చెందిన 178 పబ్లిషర్స్‌  ఏపాటు చేసే స్టాల్లు సాహితీ,విజ్ఞాన  భాండాగారాలై నిలవనున్నాయి. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటాన్ని తన చిత్రాల ద్వారా విశ్వ వ్యాపితం చేసిన బెంగాల్‌ చిత్రకారుడు చిత్త ప్రసాద్‌ శత జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని 25న కవి సమ్మేళనం జరగనుంది . తెలంగాణ సాంస్కృతిక రథసారథి, టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌, ప్రముఖ కవులు గద్దర్‌, గోరటి వెంకన్న, అందెశ్రీ, గూడ అంజన్న ఇలా ప్రజా కవులూ,కళాకారులూ.. ఒక్కొక్కరూ ఒక్కో రోజున ఒక్కోతీరున పోయిన సంవత్సరం పుస్తక ప్రదర్శనకు వచ్చిన పుస్తక ప్రియుల సంఖ్య ఆరు లక్షలు కాగా, ఈసారి పది లక్షల మంది వస్తారని భావిస్తున్నారు. బుక్‌ ఫెయిర్‌ సాధారణ సమయం మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 8.30 వరకు, సెలవు దినాల్లో ఉదయం 12 గంటల నుంచి రాత్రి 9 వరకు కొనసాగుతుంది…

(Visited 267 times, 1 visits today)