Home / Entertainment / గణేశ్‌ నిమజ్జనం కోసం ట్రాఫిక్‌ ఆంక్షలు

గణేశ్‌ నిమజ్జనం కోసం ట్రాఫిక్‌ ఆంక్షలు

Author:

హైదరాబాద్ మహానగరంలో అతి పెద్ద పండుగలు రెండే రెండు ఒకటి బోనాలు, రెండవది గణేశ్ నిమజ్జనం. మొదటి పండుగా చాలా ప్రశాంతగా ఎలాంటి ఘటనలు జరుగకుండా ముగిశాయి. ఇప్పుడు రెండవ పండగా అయినా గణేశ్ నిమజ్జనానికి సర్వత్రా సిద్ధం చేస్తూ నగర వ్యాప్తంగా అనేక ప్రాంతాలలో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తు నగర పోలీస్ కమిషనర్ ఎం. మహేందర్ మంగళవారం ఆదేశాలు జారీ చేశాడు.
మన నగరంలో మొత్తం 66 ప్రాంతాలలో ట్రాఫిక్ ఆంకాశాలు విధించారు. ఈ విధానం గురువారం ఉదయం నుండి అమలులోకి రానుంది. ఈ విధానం అవసరాన్ని బట్టి పొడిగించే అవకాశం ఉంది. ఈ విధానంలో నిమజ్జనానికి వచ్చే ప్రజలు వ్యక్తిగత వాహనాలలో వస్తే చాలా ఇబ్బందులు అవుతాయని అందువలన ఆర్టీసీ బస్సులు, ఎంఎంటిసిలను ఆశ్రయించడం చాలా మేలు అని పోలీసులు తెలిపారు.
ప్రాధాన ఊరేగింపు మార్గం:
ముఖ్యమైన ప్రధాన ఊరేగింపు మార్గాలు కేశవగిరి,నాగుల్‌చింత,ఫలక్‌నుమ,చార్మినార్మ,దీనా,అఫ్జల్‌గంజ్, ఎంజే మార్కెట్ అబిడ్స్,బషీర్‌బాగ్, లిబర్టీ,అప్పర్ ట్యాంక్/ఎన్టీఆర్ మార్గాలలో నిమజ్జనం జరుగుతుంది.
సికింద్రాబాద్ వైపు నుంచి వచ్చేవి :
ఆర్పీ రోడ్,ఎంజీ రోడ్,కర్బాలామైదాన్,ముషీరాబాద్ చౌరస్తా,ఆర్టీసీ క్రాస్‌ రోడ్, నారాయణగూడ ఎక్స్ రోడ్,హిమాయత్‌నగర్ వై జంక్షన్ నుండి వచ్చి లిబర్టీ దగ్గర జరిగే ప్రధాన ఊరేగింపులో చేరుతుంది.
ఇక ఈస్టజోన్ ఊరేగింపు నుండి వచ్చేవి :
ఉప్పల్, రామంతాపూర్, అంబర్ పేట్, ఓయూ ఎన్ సీసీ,ఢీఢీ హాస్పిటల్ నుండి ఆర్టీసీ క్రాస్ రోడ్ దగ్గర సికిందరాబాద్ నుండి వచ్చే ఊరేగింపులో కలుస్తుంది.

ముక్యమైన సూచనలు :
నిమజ్జనం మాకోసం వచ్చే ఊరేగింపు జరిగే మార్గాలలో సొంత వాహనాలకు అనుమతి లేదు, కేవలం ఆ ప్రాంతాల్లో ఉన్నవారు ప్రయాణించటానికి కేవలం బషీర్ బాగ్ చౌరస్తా వరకు మాత్రమే అనుమతి ఇచ్చారు.
. వెస్ట్ జోన్ నుంచి వచ్చే ఊరేగింపు ఎంజే మార్కెట్ లేదా సెక్రటేరియట్ వద్ద ప్రధాన మార్గంలో కలుస్తాయి.
. వెస్ట్, ఈస్ట్ జోన్ల రాకపోకలు ఒక్క బషీర్ బాగ్ వద్ద మాత్రమే కలుసుకునే అవకాశం ఉంది.
. వాహన దారులు ఓటర్ రింగ్ రోడ్, బేగంపేట్ మార్గాల నుండి రావడం చాలా మంచిదండి పోలీసులు తెలిపారు.

ట్రాఫిక్ మళ్లింపు ఇలా..

ఈస్ట్ జోన్:

చంచల్‌గూడ జైల్ చౌరస్తా, ముసారాంబాగ్, చాదర్‌ఘాట్ బ్రిడ్జ్, సాలార్జంగ్ బ్రిడ్జ్, అఫ్జల్‌గంజ్, పుత్లిబౌలి చౌరస్తా, ట్రూప్‌బజార్, జాంబాగ్ చౌరస్తా, కోఠి ఆంధ్రాబ్యాంక్
వెస్ట్ జోన్: టోపి ఖానా మాస్క్, అలాస్కా హోటల్ చౌరస్తా, ఉస్మాన్ జంగ్, శంకర్‌బాగ్, శీనా హోటల్, అజంతాగేట్, ఆబ్కారీ లైన్, తాజ్ ఐలాండ్, బర్తన్ బజార్, ఏఆర్ పెట్రోల్ పంప్.

సౌత్ జోన్:

కేశవగిరి, మొహబూబ్‌నగర్ ఎక్స్‌ రోడ్స్, ఇంజన్ బౌలి, నాగుల్‌చింత, హిమ్మత్‌పుర, హరిబౌలి, ఆశ్రా హాస్పిటల్, మొఘల్‌పుర, లక్కడ్ కోటి, మదీనా చౌరస్తా, ఎంజే బ్రిడ్జ్, దారుల్‌షిఫా చౌరస్తా, సిటీ కాలేజ్.

నార్త్‌జోన్:

కర్బాలామైదాన్, బుద్ధభవన్, సెయిలింగ్ క్లబ్, సెయిలింగ్ క్లబ్, నల్లగుట్ట చౌరస్తా వైపు నుంచి అప్పర్ ట్యాంక్‌బండ్, నెక్లెస్‌రోడ్‌ల్లోకి ఎలాంటి ట్రాఫిక్‌ను అనుమతించరు. గురువారం ఉదయం నుంచి సీటీఓ, వైఎంసీఏ, ప్యారడైజ్ చౌరస్తా, ప్యాట్నీ జంక్షన్, బాటా ఎక్స్ రోడ్, ఆదివాసీ చౌరస్తా, ఘాన్స్‌మండీ చౌరస్తాల మధ్య ఆంక్షలు అమలులో ఉంటాయి.

సెంట్రల్ జోన్:

ఛాపెల్ రోడ్ ఎంట్రీ, జీపీఓ దగ్గరి గద్వాల్ సెంటర్, శాలిమార్ థియేటర్, గన్ ఫౌండ్రీ, స్కౌలైన్ రోడ్ ఎంట్రీ, హిమాయత్‌నగర్ ‘వై’ జంక్షన్, దోమల్‌గూడలోని భారత్ స్కౌట్స్ అండ్ గౌడ్స్ చౌరస్తా, కంట్రోల్‌రూమ్ దగ్గరి కళాంజలి, లిబర్టీ చౌరస్తా, ఎంసీహెచ్ ఆఫీస్ ‘వై’ జంక్షన్, బీఆర్‌కే భవన్, ఇక్బాల్ మీనార్, రవీంద్రభారతి, ద్వారకా హోటల్ చౌరస్తా, వీవీ స్టాట్యూ చౌరస్తా, చిల్డ్రన్స్ పార్క్, వైశ్రాయ్ హోటల్ చౌరస్తా, కవాడీగూడ జంక్షన్, కట్టమైసమ్మ టెంపుల్, ఇందిరాపార్క్.

సందర్శకుల పార్కింగ్‌ కేంద్రాలు :

హుస్సేన్‌సాగర్‌లో జరగనున్న నిమజ్జనం చూడ్డానికి ఎక్కడి ఎక్కడి నుండో వచ్చే సందర్శకుల కోసం పార్కింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు మన నగర పోలీస్ లు. ఎందుకంటే వాహనాలను, హుస్సేన్ సాగర్ వరకు అనుమతించడం లేదు అందువలన ఈ పార్కింగ్‌ కేంద్రాల్లో వాహనాలను పెట్టి అక్కడి నుంచి నడిచే వెళ్లాలి.
ఖైరతాబాద్‌లోని ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఇంజనీర్స్‌, ఖైరతాబాద్‌లోని ఎంఎంటిఎస ్‌స్టేషన్‌, ఆనందర్‌నగర్‌ కాలనీ, బుద్ధభవన్‌ వెనుక, గోసేవా సదన్‌, లోయర్‌ ట్యాంక్‌బాండ్‌, కట్టమైసమ్మ దేవాలయం, ఎన్‌టిఆర్‌స్టేడియం, నిజాంకాలేజ్‌, పబ్లిక్‌గ్రౌండ్స్‌లో పార్కింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు.

హెల్ప్‌ లైన్ కోసం సంప్రదించవలసిన నంబర్స్ ;
నిమజ్జనం సందర్భంగా అంక్షలు, ట్రాఫిక్‌ మళ్లింపు, ఇతర అవసరాల కోసం మూడు హెల్ప్‌లైన్‌ నెంబర్లను ఏర్పాటు చేశారు. 040-27852482, 949059 8985, 9010203626 ఫోన్‌నెంబర్లను సంప్రదించాలని పోలీసులు కోరారు.

Read Also :వినాయకుడి విగ్రహాలను ఎందుకు నిమజ్జనం చేస్తారో తెలుసా?

(Visited 229 times, 1 visits today)