Home / Political / పతకం కోసం పరిగెడితే, మన అధికారులు చావుని పరిచయం చేశారు.

పతకం కోసం పరిగెడితే, మన అధికారులు చావుని పరిచయం చేశారు.

Author:

గెలిచినవారిని ఈ ప్రపంచం ఆకాశానికి ఎత్తుతుంది, ఓడినవారిని మరిచిపోతుంది. గెలిచే ప్రతివాడి విజయం వెనుక ఎంత శ్రమ ఉంటుందో, ఓడిన వారి వెనుక అంతే ఉంటుంది. ఇంతకు ఓడిన వారు ఇతరుల తప్పిదం వల్ల ఓడిపోతే ఆ సంఘటనలు చాలా భాద కలిగిస్తాయి. అలాంటి అనుభవమే రియో ఒలింపిక్స్ లో మారథాన్ విభాగంలో పాల్గొన్న భారత అథ్లెట్ ఓపీ జైషాకు ఎదురైంది. 42 కి.మీ రన్నింగ్ అంటే ఎన్ని సంవత్సరాల నుండి కఠినమైన శిక్షణ పొంది ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. ఎన్నో అడ్డంకులను దాటుకొని రియో ఒలింపిక్స్ లో పాల్గొన్న జైషా మన అధికారుల నిర్లక్షం కారణంగా పతకం గెలవడం అటుంచి ప్రాణాల మీదకు తెచ్చుకుంది.

Indian Officials Not Provided Water For Marathon Runner Jaisha

42 కి.మీ మరాథాన్ విభాగంలో పాలుపంచుకొనే ప్రతి అభ్యర్థికి సంభందించిన దేశం వారు ప్రతి 2.5 కి.మీ లకు ఒక బూత్ ఎర్పాటు చెసుకొని తమ అభ్యర్థికి వాటర్, గ్లూకోజ్ అందిస్తారు. కానీ మన దేశ అధికారులు ఎవరు ఆ బూత్ లలొ ఉండి జైషాకు కావల్సిన మంచి నీరు, గ్లుకోజ్ అందివ్వలేదు.. మిగతా దేశాల వారు మాత్రం వారి అథ్లెట్లకు అన్ని సౌకర్యాలు అందించారు. దిక్కులేక జైషా ప్రతి 8 కిలోమీటర్లకు రియో ఒలింపిక్స్ వారు ఎర్పాటు చేసిన మంచి నీరు త్రాగి తన పరుగును ముందుకు సాగించి ఎండ్ లైన్ దాటగానే కళ్లు తిరిగి పడిపోయింది. సుమారు మూడు గంటలు స్పృహలోకి రాలేదు. డాక్టర్స్ 7 గ్లూకోజ్ బాటిళ్లు ఎక్కించిన తరవాత కానీ కళ్ళు తెరవలేదు. పతకం కోసం మారథాన్ లో పాలుపంచుకుంటె మన అధికారులు ఆమే ప్రాణాలకే ముప్పు తెచ్చారు. ఈ విషయంలో భారత ప్రభుత్వం తక్షణమే భాద్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి అని కోరుకుందాం.

Must Read: తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ గా సానియాని తొలగించి సింధుని చేయాలనే డిమాండ్ తో మీరు ఏకీభవిస్తారా..?

(Visited 114 times, 1 visits today)