Home / Inspiring Stories / చదివింది ఇంటరే కానీ స్వయంకృషితో నెలకు 2 లక్షలకు పైగా సంపాదిస్తుంది.

చదివింది ఇంటరే కానీ స్వయంకృషితో నెలకు 2 లక్షలకు పైగా సంపాదిస్తుంది.

Author:

ఆకలితో ఉన్న కడుపు, ఖాళీగా ఉన్న జేబు జీవితంలో ఎన్నో పాఠాలను నేర్పుతుంది అంటారు. ఒకప్పుడు తినడానికే ఇబ్బంది పడిన తాను నేడు నెలకు రెండు లక్షలు సంపాదిస్తోంది అంటే నమ్మగలరా! కానీ నిజం. ఇంతకు ఎవరు తను? ఎలా సంపాదిస్తోంది?

Nandini Uber Dost

ఆ అమ్మాయి పేరు నందిని చదువంటే చాలా ఇష్టం ఆ ఇష్టంతోనే చాలా బాగా చదివేది ఎలాగైనా డాక్టర్ కావాలి అనుకునేది కానీ పేదరికం ఆమె అశయాలకు అడ్డువచ్చింది. నందిని వాళ్ళ నాన్న ఒక చిన్న గుడిలో పూజారి. తినడానికే సరిగా తిండి దొరకని పరిస్థితి అంటే ఇక చదువు ఎలా కొనసాగుతుంది దానితో నందిని చదువుకు ఫుల్ స్టాప్ పడింది. ఇక ఆ తరువాత ఉన్నదాంట్లో వారికి తెలిసిన బందువుకు ఇచ్చి నందిని పెళ్లి చేశారు. అతను కూడా ఒక గుళ్లో పూజారి. పుట్టినింట్లో ఎలా ఉందొ మెట్టినింట్లో అలాగే ఉంది ఆమె పరిస్థితి. అదే సమయంలో తన తండ్రి చనిపోవడం, తన చెల్లి బాధ్యత కూడా తనపై పడటంతో తినడానికి కూడా కష్టంగా గడుస్తున్నా రోజులలో…. తను కూడా ఏదైనా పని చేసి ఇంటికి ఎంతో కొంత ఆసరా కావాలి అనుకొని తనకు తెలిసిన స్నేహితురాలికి తన భాదలు చెప్పుకుంది నందిని. ఆ సమయంలో తన స్నేహితురాలి సలహాతో  ఒక్కసారిగా తన జీవితం మారిపోయింది.

ఇంతకు నందినికి తన స్నేహితురాలు ఎలాంటి సలహా ఇచ్చిందో తెలుసా! మనం సిటీలో చూస్తుంటాం కదా! ఉబర్ క్యాబ్స్ … ఆ ఉబర్ కి డ్రైవర్లను రికమెండ్ చేసే పని. అంటే ఉబర్ కి కావలసిన డ్రైవర్ ని మనం అందిస్తే వారు నడిపే ట్రిప్పుల ద్వారా మనకు దాదాపు ఒక నెలకు 2500-3000 వరకు వస్తాయన్న సలహాతో వెంటనే డ్రైవర్స్  కావాలని ఊరిలో పోస్టర్స్ వేయించింది నందిని. అంతే  దెబ్బకు నందిని దశ తిరిగిపోయింది. ఒక్కక్కొరు గా మొదలైన డ్రైవర్స్ ఇప్పుడు నందిని దగ్గర దాదాపు 600ల  మంది పైగా ఉన్నారు. దానితో నందినికి దాదాపు వీరిపై నెలకు రెండు లక్షలకు పైగా ఆదాయం వస్తుంది. ఒక్కపుడు తినడానికే కష్టంగా బ్రతికిన నందిని కుటుంబం ఈ రోజు సొంత ఆఫీసు, అందులో 5 మంది స్టాఫ్. తన పాప ను ఒక ఇంటర్నేషనల్ స్కూల్లో చదివిస్తూ బెంగుళూరులో సొంత ఇల్లుని కట్టుకుంది.

Must Read: పవన్ కళ్యాణ్ ని కలిసిన కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి.

(Visited 4,276 times, 1 visits today)