Home / Entertainment / కంచె కాంబినేషన్ మరో సారి.

కంచె కాంబినేషన్ మరో సారి.

Author:

Varun Tej and Krish

కంచె తో అటు ప్రేక్షకులతోనూ ఇటు సినీ పండితులతోనూ ప్రశంసలతో ఉక్కిరిబిక్కిరయ్యాడు వరుణ్ తేజ్ ఈ సక్సెస్ ని తన కెరీర్ కి కీలకంగా చేసుకొని రాబోయే పాత్రలను జాగ్రత్తగా ఎంచుకుంటున్నాడట. ఈ సినిమా తర్వాత రాబోతున్న లోఫర్ తర్వాత వచ్చే తన సినిమాలు తనని మళ్ళీ ఇంకొక స్టార్ గా నిలబెట్టేలా ఉండటమే కాదు. నటుడిగా కూడా తనకో గుర్తింపు తేవాలని కోరుకుంటున్నాడట. పూరీ తో వచ్చే సినిమా లో వరుణ్ పాత్ర పూర్తిగా పూరి జగన్నాథ్ మార్క్ తోనే ఉండబోతోందని ఇండస్ట్రీ టాక్. తన ప్రతి సినిమా టైటిల్ కూడా నెగెటివ్ షెడ్ లో పెడుతున్నాడు. సినిమా హీరోను అలాగే చూపిస్తూ.. చివరికి వచ్చే సరికి హీరో క్యారెక్టర్ ను మార్చేసి.. అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నాడు పూరి.

పూరి జగన్నాథ్ సినిమాలో హీరో అంటే ఎవరికీ భయపడడు. ఎంతమంది ఉన్నా సరే లెక్కచేయడు. పదునెక్కిన సంభాషణలతో చురకత్తిలా దూసుకెళ్తుంటాడు. ముందు అల్లరి చిల్లరిగా తిరుగుతూ ఇంటర్వెల్ లో ఒక పెద్ద మలుపుతో అతని వెనక పెద్ద స్టోరీ ఉందటమో లేదా అందరికీ నచ్చని పనులు చెసే హీరో సడెన్ గా మంచి వాడైపోవటమో చేసి ప్రేక్షకులని ఆశ్చర్య పరుస్తాడు ఐతే ఈ ఫార్ములా ఇప్పుడు బోర్ కొట్టేలా తయారయిందంటున్నారు ప్రేక్షకులు. పూరీ రోటీన్ ఫార్ములా పోకిరినుంచి పూరి అదే స్టైల్ లో నడుస్తోంది. దేశముదురు, నేను నా రాక్షసి.. రీసెంట్ గా టెంపర్ ఇవన్ని కూడా నెగిటివ్ షెడ్ టైటిల్స్. ఈ టైటిల్స్ తోనే పూరి మాస్ ప్రేక్షకులను ఇన్నాళ్ళూ ఆకట్టుకున్నాడు.ఐతే ఈ సారి ఆ ఫారులా వర్కౌట్ ఔతుందా..,కంచెతో వచ్చిన పేరుని లోఫర్ అలాగే కొనసాగిస్తుందా అన్న డైలమాలో పడ్డాడట ఈ కొత్త స్టార్. అదే అనుమానమో ఏమో గానీ తన హిట్ దర్శకుడు “క్రిష్” తోనే మరో సినిమా చేయబోతున్నాడని సమాచారం. “కంచె” సినిమాతో వరుణ్‌తేజ్‌లోని కొత్త యాంగిల్‌ని చూపిన దర్శకుడు క్రిష్‌, తక్కువ బడ్జెట్‌లో తక్కువ టైమ్‌లో అద్భుతమైన సినిమా ఎలా తియ్యొచ్చో కూడా తెలుగు సినీ పరిశ్రమకు నేర్పించాడనడం నిస్సందేహం.

ఇప్పుడీ విలక్షణ దర్శకుడు వరుణ్‌తోనే ఇంకో మూవీ చేయాలనుకుంటున్నాడట. వరుణ్‌ తేజకి పెరిగిన మార్కెట్‌తో బడ్జెట్‌ పరిమితుల్ని దాటి, అద్భుతమైన సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడని ఇండస్ట్రీలో టాక్‌ నడుస్తోంది. వరుణ్‌తేజ తండ్రి, నటుడు, నిర్మాత నాగబాబు ‘అంజనా ప్రొడక్షన్స్‌’ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మించనున్నాడని చెప్పుకుంటున్నారు. లోఫర్ కూడా హిట్ ఇచ్చి,మళ్ళీ వెంటనే మరో సారి క్రిష్ తో సినిమా గనక చేస్తే అనుమానమే లేకుండా వరుణ్ తేజ్ ఈ తరం స్టార్ లలో ఒకడిగా నిలవటమే కాదు తెలుగు సినిమా మెచ్చే నటుడు గా కూడా పేరు తెచ్చుకుంటాడంటున్నారు సినీ విశ్లేషకులు..

Also Read:అఖిల్ సినిమా పర్ఫెక్ట్ రివ్యూ & రేటింగ్.

(Visited 75 times, 1 visits today)