Home / సాహిత్యం / కవితా-కవీ-కవిత్వమూ…..

కవితా-కవీ-కవిత్వమూ…..

Author:

Sahithyam1

కవిత్వం ఒక భాష,ఒక దేహాంతర భాష మార్మికపు మాటల తో ఒకే పదంతో వందల ఆలోచనలని పుట్టించ గలశక్తి. కవి ఒక మాట చెప్పాలనుకుంటడు కవిత్వం ఆ మాటకి వందల ముఖాలను చేరుస్తుంది… రాసినప్పుదు తప్ప చదివేటప్పుడు కవి అస్తిత్వం కనిపించదు కవిత్వం తప్ప…. పదచిత్రాలా…!? చిత్రమైన పదలా..!? అన్న సందేహం తీరకుందానే పాటకుడుడు కవితలో లీనమై పోతాడు… ఇక కవీ.., కవితా.. తమ తమ పాత్రలను పోషిస్తూ కవిత్వం గా పరిణామం చెందిన క్షణాలు అలా పక్కకు తప్పుకుంటాయి. భావం పాటకుని మనసులో ముద్రించుకు పోతుంది…

చిగురాకు చివర్న ముత్యపుతునకలా మంచుబిందువు వానలో తడిసిన ఓ బంతిపూల తోట“…… నవీన్ అనే ఈ యువకవి కళ్ళకి ఎప్పుదు చిక్కాయో తెలియదు కానీ… “ఆ మంచుబిందువును ముద్దాడు.. బంతిపూలతోటలో తిరుగాడు.. తంగేడు చెట్టుని గట్టిగా హత్తుకో.. పున్నమి వెన్నెల్లో కరిగిపో.. రంగులన్నిటినీ కలిపి రేపటి బతుకుపుస్తకానికి అందమైన ముఖచిత్రాన్ని చిత్రించు.. అందులోని ఆత్మనై నేను తిరిగొస్తాను” ఈ పదాలు చదివినపుడు తననకు తాను కవిత్వం గా మరి మనలోకి ప్రవేశిస్తాడు తాను లీనమవ్వాలను కున్న ఆ విశ్వప్రేమ గాఢాలింగన సౌఖ్యాన్ని మనకూ ఇస్తాడు… ఒక్క సారి ఈ కవితని చదవండి. ఒకా క్ల్షణం ఎవరికోసమో పెదవులు ఒక చిరునవ్వుగా విచ్చుకుంటాయి..ఒక్క క్షణమే కళ్ళముందు కొన్ని వందల మంది మనుషులు అలా కదిలి వెళ్ళిపోతారు… మనమూ,నవీనూ, కవితా అలా నిశ్శబ్దంగా మిగిలిపోతాం…..

ఇంకా చదవాలనిపిస్తే… http://www.maronenu.blogspot.in  లింక్ చూడండి..

!! తిరిగొస్తాను !!

నీకు తెలుసో లేదో
అనేకానేక యుద్ధాలు అవతరిస్తున్న చోట
ఆకాశమంత హృదయం చినుకులుగా రాలుతున్నచోట
ఇక్కడ..
ఒక ఆత్మ నిన్నుచేరడానికి విశ్వప్రయత్నం చేస్తోంది
నిన్ను చేరేవరకు నీలో లీనమయ్యేవరకు నిరీక్షించలేవా!

ఇటుచూడు
చిగురాకు చివర్న ముత్యపుతునకలా మంచుబిందువు
వానలో తడిసిన ఓ బంతిపూల తోట
విరగబూసిన తంగేడు చెట్టూ
నిండుపున్నమినాటి పండువెన్నెలా
నీకోసమే వేచిఉన్నాయి..నీ స్పర్శకై తహతహలాడుతున్నాయి

లేలేత రావి ఆకు ఎరుపు
దారిపక్కగా మొలిచిన తుమ్మిపూల తెలుపు
పైరుపాపల ఆకుపచ్చా
సముద్రాకాశాలు కలిసినప్పటి నీలం
నీ రాకకై చూస్తున్నాయి.. నీ బతుకులో కలిసిపోవాలని కలలు కంటున్నాయి

దిగులెందుకు నేస్తం!
ఆ మంచుబిందువును ముద్దాడు.. బంతిపూలతోటలో తిరుగాడు.. తంగేడు చెట్టుని గట్టిగా హత్తుకో.. పున్నమి వెన్నెల్లో కరిగిపో.. రంగులన్నిటినీ కలిపి రేపటి బతుకుపుస్తకానికి అందమైన ముఖచిత్రాన్ని చిత్రించు.. అందులోని ఆత్మనై నేను తిరిగొస్తాను.
—-నవీన్ కుమార్

(Visited 265 times, 1 visits today)