Home / health / తలుపులు ఉన్నవైపు కాళ్ళు పెట్టి నిద్రపోతున్నారా..?

తలుపులు ఉన్నవైపు కాళ్ళు పెట్టి నిద్రపోతున్నారా..?

Author:

మన పెద్దలు మనకు ఏది చెప్పిన అనుభవపూర్వకంగా చెప్పుతారు. ఎందుకంటే వారు  మనకు చెప్పే విషయాలు వారు ఇదివరకే అనుభవించి ఉంటారు కనుక వారు ఏది చెప్పిన మన మంచికే… అందుకే వాళ్లకు జరిగిన చెడు మనకు జరుగకూడదు అని మనకు మరి మరి చెబుతుంటారు.   ‘పెద్దల మాట చద్దన్నం మూట’ అంటారు కదా! ఎందుకంటే  మన పెద్దవారు చెప్పే కొన్ని విషయాలలో సైన్స్ దాగి ఉంటుంది. అది మనకు తెలియకా మన పెద్దవారు ఎదో ఒక విషయం చెప్పి విసిగిస్తున్నారు అనుకుంటూ వారిని చిన్న చూపు చూస్తుంటాం ఎందుకంటే మనం కొద్దిగా చదువుకున్నాం కదా! అనే తలబిరుసు ఉంటుంది. కానీ నువ్వు ఎంత చదివిన ” కొత్త డాక్టర్ కంటే పాత రోగికి  ఎక్కువ మందులు తెలుసు అన్నట్టు” వారి అనుభవం ముందు మనం తక్కువే.

keeping-legs-towards-the-door-while-sleeping

సాధారణంగా మనం ఇంట్లో నిదురపోయే సమయంలో తలను ఎటువైపు పెట్టాలో మన పెద్దవారు చెపుతుంటారు, అలాగే ఎటువైపు కాళ్ళు పేట్టకూడదో కూడా చెపుతుంటారు. మరి ఇలా ఎందుకు చెపుతారు అంటే మనకు తెలియదు కానీ ఒకసారి అడిగి చూడండి దానికి కచ్చితమైన కారణం చెబుతారు పెద్దవారు. అలాగే మనం పడుకునే సమయంలో ఏ సమయంలోనైనా తలుపులు ఉన్నవైపు మాత్రం కాళ్ళు పెట్టకూడదు అంటున్నారు, దానికి ఒక కారణం ఉంది. దీనిని సైన్స్ భాషలో చెప్పాలంటే మాత్రం తలుపులు ఉన్నవైపు(గోడలు లేని చోటు వైపు ) కాళ్ళు పెట్టి నిదురించడం వలన మ‌న ఒంట్లోకి నెగెటివ్ ఎన‌ర్జీ ప్ర‌సార‌మ‌వుతుంది. దానితో మన ఒంట్లో శరీరం మనకు అంతగా అనుకూలించదు. అలాగే ఆ రోజంతా తీవ్ర‌మైన అసంతృప్తి, ఒత్తిడి, ఆందోళ‌న కలుగుతాయట దానితో ఆ రోజు మనం ఎలాంటి పని చేసిన అది బూడిదలో పోసిన పన్నీరు అవుతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితులలో తలుపులువై ఉన్నవైపు కాళ్ళు పెట్టి నిద్రపోకూడదు అంటారు.

Must Read: Video: పడుకున్న ఒక నిమిషంలోనే నిద్రలోకి జారుకునే ట్రిక్..!

(Visited 21,275 times, 1 visits today)