Home / Inspiring Stories / “భారత దేశం నా మాతృభూమి” ప్రతిఙ్ఞని రాసింది తెలుగు వాడే అన్న సంగతి తెలుసా..?

“భారత దేశం నా మాతృభూమి” ప్రతిఙ్ఞని రాసింది తెలుగు వాడే అన్న సంగతి తెలుసా..?

Author:
Paidimarri venkata subba rao

Image Source: bananaburp.com

మీకు “వందే మాతరం గీతాన్ని రాసిందెవరో తెలుసా? పోనీ..! జనగణమణ రాసిందీ..!? సారే జహాసే అచ్చా గీతాన్ని రాసిందీ…!? ఏంటలా చూస్తున్నారూ…! వీటికి సమాధానం తెలియని భారతీయుడెవరైనా ఉంటారా అంటారు కదా…! మరి మన “ప్రతిఙ్ఞ” రాసిందెవరూ..? చెప్పండీ…. ఆయన ఏ రాష్ట్రం వాడూ…???? తప్పు మీది కాదు ఎందుకంటే…! మీకే కాదు దేశం లోని 85%మందికీ సమాధానం తెలియదు…. పైడిమర్రి వెంకట సుబ్బారావు, ఈయన స్వస్థలం తెలంగాణలోని నల్గొండ సమీపంలోని అన్నెపర్తి., మీకు ఆశ్చర్యంగా అనిపించినా ఇది నిజం ప్రతిఙ్ఞని రాసింది మన తెలుగు వాడు..ఒకప్పటి ఆంధ్రప్రదేశ్..,ఇప్పటి తెలంగాణా బిడ్డడు…

భారతదేశం నా మాతృభూమి.
భారతీయులందరూ నా సహోదరులు.
నేను నా దేశాన్ని ప్రేమిస్తున్నాను.
సుసంపన్నమైన, బహువిధమైన నాదేశ వారసత్వసంపద నాకు గర్వకారణం.
దీనికి అర్హత పొందడానికి సర్వదా నేను కృషి చేస్తాను.
నా తల్లిదండ్రుల్ని, ఉపాధ్యాయుల్ని, పెద్దలందర్ని గౌరవిస్తాను.
ప్రతివారితోను మర్యాదగా నడచుకొంటాను.
నా దేశం పట్ల, నా ప్రజల పట్ల సేవానిరతితో ఉంటానని ప్రతిజ్ఞ చేస్తున్నాను.
వారి శ్రేయోభివృద్ధులే నా ఆనందానికి మూలం.” అన్న ప్రతిజ్ఞ ప్రతిరోజు కోట్లాది మంది విద్యార్థుల గొంతుల్లో ప్రతిధ్వనిస్తుంటుంది. అలాంటి జాతీయ భావం ప్రేరేపించే ప్రతిజ్ఞ యాభై ఏళ్ల నుండి పాఠ్య పుస్తకాల్లో ముద్రితమై కనిపిస్తున్నా అది రాసిన రచయిత పేరు మాత్రం ఎక్కడా కనిపించదు. ఏ ఒక్క విధ్యార్థికీ మనలో స్ఫూర్తినింపే ఈ వాక్యాలను రాసిన రచయిత పేరు తెలియదు….

పిల్లల దాకా ఎందుకూ..,రోజూ … చదివే ప్రతిజ్ఞ రాసింది ఎవరు సార్‌ ? అని ప్రశ్నిస్తే … సమాధానం ఉపాధ్యాయులకూ కూడా తెలియదు. ఎందుకంటే ఎక్కడా ఆ ప్రతిఙ్ఞను రాసిన రచయిత పేరుగానీ..,జాతీయతా భావాన్ని పెంచే విధంగా ఆ వాఖ్యాలు ఎప్పుడు రాయబడ్డాయనే విషయం గానీ ఏ పుస్తకం లోనూ ఉండదు. కారణం ఆయన తెలుగువాడనా..? లేక తెలంగాణా వాడనా??

ఈ ప్రతిజ్ఞ రాసింది ఎవరంటే తెలిసింది పట్టుమని పదిమంది లేరంటే నమ్మశక్యం కాదేమో! కానీ నిజంగా నమ్మి తీరాల్సిందే. వందేమాతరం రాసింది బంకించంద్రఛటర్జీ అని, జనగణమన రాసింది రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ అని ఎవర్ని అడిగినా ఇట్టే ఠక్కున సమాధానం చెప్పేస్తారు. కానీ ప్రతిజ్ఞ రాసిన మహానుభావుడేవరంటే మాత్రం లభించే సమాధానం శూన్యం. ప్రభుత్వ పాఠ్య పుస్తకాల్లో ఈ గీతం ప్రచురించినప్పటికీ, దీన్ని రాసిన వారి పేరు చేర్చకుండా కుట్ర జరిగింది. దీనికి కారణం ఏమిటి ? ఎందు కింత దౌర్భాగ్యం.? దీని వెనుక ఏమైన సీమాంధ్ర పాలకుల కుట్ర జరిగిందా ? ప్రతిఙ్ఞ రాసిన రచయిత తెలంగాణలోని నల్గొండ సమీపంలోని అన్నెపర్తిలో పుట్టడమే ఆయన చేసుకున్న పాపమా ? లేక ఈ తెలంగాణ గడ్డకు కలిగిన శాపమా? అదే సీమాంధ్రలో పుట్టి ఉంటే అపర గురజాడో, బంకించంద్రుడో, విశ్వకవి రవీంద్రుడో లేదంటే పింగళివెంకయ్యలా కీర్తించబడే వారేమో! ఇలాంటి వివక్ష నాటి తెలుగు రాష్ట్రానికీ,ముఖ్యంగా తెలంగాణకు కొత్తెం కాదనుకోండి…

జూన్‌ 10,1916 లో అన్నెపర్తిలో పుట్టిన పైడిమర్రి వెంకట సుబ్బారావు పూర్వీకులు నల్గొండ వాసులే. ఈయన తండ్రి వెంకట్రామయ్య నల్గొండలోనే నివసించేవారు. ఆయన ఇద్దరు భార్యలు చనిపోయాక, ప్రకాశం జిల్లాలోని దోర్నాల మండలం చింతల అగ్రహారానికి చెందిన రాంబాయమ్మతో మూడో వివాహం జరిగింది. వారికి పుట్టిన బిడ్డే ఈ వెంకట సుబ్బారావు. నల్గొండలో విద్యాభ్యాసం తర్వాత నాటి హైదరాబాద్‌ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగంలో చేరారు. ఆంధ్రప్రదేశ్‌ ఏర్పడ్డాక బదిలీపై రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో పని చేశారు. అలా విశాఖ పట్నంలో 1962-63 ప్రాంతంలో పనిచేసే సందర్భంలో చైనా యుద్ధం జరిగింది. యుద్ధం అనంతరం దేశభక్తిని పెంపొందింపజేసేందుకు నాటి చైనా ప్రభుత్వం దేశభక్తి గేయాలను పాఠశాల విద్యార్థులతో రాయించి, పాడించే విధంగా కార్యక్రమం చేపట్టింది. అ అంశమే మన పైడిమర్రికి ప్రేరణ కల్గించింది. తానూ ఏదో ఒకటి దేశభక్తి గీతం రాయాలన్న ఆలోచనతోనే ప్రతిజ్ఞకు రూపకల్పన చేశారు. ఈ గీతంలో జాతీయ భావం ఉంది. దేశం పట్ల, అభిమానాన్ని, భక్తిని ఆరాధన భావాన్ని తెలియజేస్తుంది. ఈ దేశం నా మాతృభూమి అని ఇక్కడ నివసించే వాళ్లందరూ నా సహోదరులని, దేశ సంపద సంస్కృతి ప్రతి ఒక్కరి బాధ్యతని ఇలాంటి భావాన్ని బాల్యం నుండే విద్యార్థులలో నూరిపోసే విధంగా ఉంది ఇంకా పోస్తుంది కూడా…..

Must Read: కొత్త వాహనం కొంటున్నారా? కార్, బైక్ షో రూంల డీలర్ల చేతిలో మోసపోకండి.

(Visited 1,989 times, 1 visits today)