Home / Inspiring Stories / మీడియా వల్లే చచ్చిపోయేలా ఉన్నాను…!

మీడియా వల్లే చచ్చిపోయేలా ఉన్నాను…!

Author:

నాలుగు రోజుల క్రితం మీడియాలో హోరెత్తిపోయిన కిషన్ కుమార్ అనే వృద్దుడు గుర్తున్నాడు కదా..! రోడ్డు పక్కన టైప్ రైటర్ పెట్టుకుని జీవితం సాగించే ఆయన ను ఫుట్ పాత్ నుంచి ఖాళీ చేయాలని చెప్పిన పోలీసులు. దౌర్జన్యంగా ఆయన టైప్ రైటర్ని పగల గొట్టి ఆయన పై చేయి చేసుకున్న దృశ్యాలను ఎవరో రికార్డ్ చేసి సోషల్ మీడియాలొ పెట్టటం తో దేశవ్యాప్తంగా ఆయన పై సానుభూతీ పోలీసులపై వ్యతిరేకతా వెల్లువెత్తాయి. దాంతో  ఆయన పై దాడి చేసిన ఎస్సైని సస్పెండ్ చేశారు. అంతే కాకుండా తనకు ఒక కొత్త టైప్ రైటర్ తో పాటు ఒక లక్ష రూపాయలు నష్ట పరిహారం చెల్లిస్తామని హామీ ఇచ్చారు పోలీసులు. అయితే ఈ మధ్య ఆయనకు బెదిరింపు కాల్స్ వస్తుండడంతో పోలీసులే కిషన్ ఇంటికి తీసుకువెళ్ళడం మళ్ళీ పనిచేసుకునే ప్రదేశానికి తీసుకురావడం కూడా పోలీసులే చేస్తున్నారు.

ఐతే ఇప్పుడు ఆయనకి కొత్త సమస్య మొదలైంది. దేశవ్యాప్తంగా మీడియా కవరేజ్ తో జనం లో కి వచ్చిన కిషన్ పై కథనాలు తయారు చేయటానికీ, ఆయన ఇంటర్వ్యూలు తీసుకోవటానికీ రిపోర్టర్లు ఎగబడుతూండటంతో ఆయన పని సాగటం లేదట. గత రెండు రోజులుగా పనిలేక ఒక్క రూపాయి కూడా సంపాదించలేకపోయారు. ఇలాగైతే నా కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలని ఆయన వాపోతున్నారు. నేను ఇక్కడకు
పని చేసుకోవడానికి వస్తున్నానుకానీ, మీడియాకు ఇంటర్వ్యూలు ఇచ్చేందుకు కాదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కిషన్. ఇదిలా ఉండగా ఒక వైపు బెదిరింపు కాల్స్… మరో పక్క సహాయం చేస్తామని మీ బ్యాంకు ఖాతా వివరాలు చెప్పండంటూ మరికొన్నిఫోన్ కాల్స్ వస్తున్నాయని… కానీ నాకు ఇప్పటి వరకు ఒక్కరూపాయి కూడా అందలేదని కిషన్ కుమార్ వాపోయారు.  రోజుకి సంపాదించేదే తక్కువ మీరు ఇలా వేదిస్తే నేను పస్తులు పడుకోవాలి ఐనా ఇక్కడికి నేను నా పనికోసం వస్తున్నా మీకు ఇంటర్వ్యూలివ్వటానికి కాదు అంటూ వాపోయాడు. ఒక్కోసారి అతి సానుభూతి కూడా చెడు చేస్తుంది అంటే ఇదేనేమో…

Also Read: గ్యాంగ్ రేప్ భయంతో కదిలే ట్రైన్ లోంచి దూకేసిన యువతి.

(Visited 91 times, 1 visits today)