Home / health / నెలలో ఒక్కసారైనా కుంకుడుకాయలతో తలస్నానం చెయ్యాలి, చాలా ప్రయోజనాలు ఉంటాయి.

నెలలో ఒక్కసారైనా కుంకుడుకాయలతో తలస్నానం చెయ్యాలి, చాలా ప్రయోజనాలు ఉంటాయి.

Author:

ఆడవారికైనా, మగవారికైనా జుట్టు ఉంటేనే అందం. వెనుకటి రోజులలో మనుషుల వెంట్రుకలు చాలా అందంగా, ఒత్తుగా, నల్లగా ఉండేది. ఆ రోజులలో జుట్టు వేసుకోవటానికి చాలా టైం పట్టేది ఆడవారికి. అప్పట్లో మనకు షాంపులు లేవు కాబట్టి తప్పని సరిగా కుంకుడు కాయలనే తలంటుకు వాడే వారు. కానీ ఇప్పుడు షాంపు లేనిదే స్నానం చేయడం లేదు. మామూలు షాంపులలో రసాయానిక పదార్థాలు ఉంటాయి కనుక వాటి వలన మనకు చాలా ప్రమాదం. మరి కుంకుడుకాయ పకృతి పరంగా లభిస్తుంది కాబట్టి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు.

kumkudukaya-gives-healthy-hair

కుంకుడుకాయలతో కలిగే  ప్రయోజనాలు:

  • కుంకుడుకాయ నురుగుతో తలంటుకోవటం వలన చుండ్రు తగ్గి, తల వెంట్రుకలు వత్తుగా, నల్లగా పెరుగుతాయి. షాంపు, సబ్బులు మొదలైన వాటికన్నా తలంటుకు కుంకుడు నురుగు శ్రేష్టమైనది.
  • కుంకుడు కాయ శిరోజాలను కాపాడటమే కాదు గర్భనిరోధక సాధకంగానూ ఉపయోగపడుతుంది.
  • తేలు కుట్టిన చోట కుంకుడుకాయ గింజను అరగదీసి రాస్తే నొప్పి తగ్గుతుంది.
  • వారంలో కనీసం రెండుసార్లైన నూనె పెట్టి మర్దన చేసి ఒక గంట తరువాత మనకు న్యాచురల్ గా దొరికే కుంకుడుకాయ రసంతో తల స్నానం చేయడం వల్ల హెయిర్ ఫాల్ సమస్య నుంచి బయటపడొచ్చు.
  • కొద్దిగా కుంకుడుకాయ రసం, కొద్దిగా వెనిగర్‌ కలిపి దానిలో కొంచెం నీరు పోయాలి. దీన్ని ఒక స్ర్పే బాటిల్‌లో పోసి భద్రపరచాలి. ఈ ద్రావణంతో కిటికీలు, తలుపులు  గాజు వస్తువులను శుభ్రపరచుకోవచ్చు.
  • ఉసిరికాయ, కుంకుడుకాయ, శీకాయపొడి మిశ్రమాన్ని నీటిలో నానబెట్టాలి. దీనికి ఉదయాన్నే గోరింటాకు కలిపి మరల రెండు-మూడు గంటలు నానబెట్టాలి. తరవాత  మన జుట్టుకు పట్టించాలి. ఇలా వారానికి రెండు నుండి మూడు సార్లు చేస్తే తెల్ల జుట్టు నల్లగా మారుతుంది.
  • కుంకుడుకాయ రసం(నురుగు) వెచ్చచేసి రెండు ముక్కుల్లోనూ వేస్తే పార్శ్వనొప్పి పోతుంది.
  • రెండు టీ స్పూన్‌ల కుంకుడుకాయ పొడిని రెండు స్పూన్‌ల ఉసిరి పొడిని మరో రెండు స్పూన్‌ల తేనెతో కలిపి ఆ పేస్ట్‌ని తల మొత్తానికి పట్టించాలి. అరగంట తర్వాత  మైల్డ్ షాంపుతో స్నానం చేయండి.
  • 1 స్పూన్ మెంతి పిండి, 1 స్పూన్ కుంకుడుకాయ పొడి, 1 స్పూన్ వీటిని పుల్లటి పెరుగులో కలిపి గంటసేపు నానబెట్టి తలకు ప్యాక్ ల వేసి 45 నిమిషాల తర్వాత నీళ్ళతో కడగాలి. ఇది జుట్టులో ఉండే చుండ్రుని షాంపూల కంటే మెరుగ్గా నిర్ములిస్తుంది.

ఈ కాలంలో కుంకుడుకాయలతో స్నానం చేయటం చాలా తక్కువ అయింది, అందరు ఆ కెమికల్స్ కలిపిన షాంపూలతోనే స్నానం చేస్తున్నారు, కుంకుడుకాయలతో నెలలో కనీసం ఒక్కసారైనా స్నానం చేస్తే జుట్టు ఆరోగ్యంగా ఉండే అవకాశం ఉంది.

Must Read: తెల్ల వెంట్రుకలు రాకుండా ఉండేందుకు ఇవి చేయండి.

(Visited 2,195 times, 1 visits today)