Home / Inspiring Stories / మాకు గిఫ్టులొద్దు అంటున్న డిల్లీ మంత్రులు.

మాకు గిఫ్టులొద్దు అంటున్న డిల్లీ మంత్రులు.

Author:

Delhi CM Aravind Kejriwal

మరింత గా అవినీతిని తగ్గించాలన్న పట్టుదలతో పని చేస్తున్నారు డిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్. తన ప్రభుత్వ శాఖల్లో ఉన్న మంత్రులందరి కీ ఆయన ఈ మేరకు సూచనలిచ్చారు ముందుగా తమనుంచే మార్పు మొదలవ్వాలన్న ఉద్దేశం తో “ప్లీజ్! దీపావళి పండుగ సందర్భంగా మాకు బహుమతులు ఇచ్చి ఇబ్బందిపెట్టకండి. గిఫ్టులు, దేవతా విగ్రహాలు ఏవీ మేం తీసుకోం” అంటూ తమ చేతి రాతతో రాసిన స్లిప్పులని. డిల్లీ రాష్ట్ర మంత్రులందరూ తమ కార్యాలయాల ముందు అతికించారు.

కేజ్రివాల్ అవినీతి, అక్రమాలకు చెక్ పెట్టేలా మంత్రులు సొంతంగా కార్యాచరణ రూపొందించుకోవాలని సూచించారు. ఈ నేపథ్యంలో మంత్రులు దీపావళి పండుగ గిఫ్టులకు దూరమని ప్రకటించారు.అంతేకాదు ప్రభుత్వ శాఖల్లోని ఏ కార్యాలయంలోనూ అవినీతి అనే పదం కూడా వినిపించకూడదనీ ఆయన అన్నారు. అవినీతిలో మొదటి స్థానం లో ఉండే లంచాలని పూర్తిగా నివారించాలనే దిసగా ఉన్న కేజ్రి వాల్ లంచం అంటే డబ్బు అనే కాకుండా విలువైన వస్తువులను బహుమతి గా ఇవ్వటం కూడా అని అభిప్రాయ పడ్డారు.

లోక్ సభ ఎన్నికలకు ముందు విదేశాల్లో ఉన్న నల్లధనం మొత్తాన్ని తిరిగి భారత్ కు  తెప్పిస్తామన్న మోదీ.. అధికారంలోకి వచ్చాక మాత్రం యోగా చేయమంటున్నారని ఆరోపించారు. ఎలాంటి ఫలితం ఇవ్వని స్వచ్ఛ భారత్ కార్యక్రమం ప్రచారం కోసం కోట్ల రూపాయలు వృధాగా వెచ్చించారని, ప్రస్తుతం రెండు మోడల్ ప్రభుత్వాలు ఉన్నాయని అందులో ఒకటి ఢిల్లీ ప్రభుత్వం కాగా మరొకటి కేంద్ర ప్రభుత్వం అని ఇందులో ఎలాంటి తరహా ప్రభుత్వాన్ని కోరుకుంటారో ఢిల్లీ ప్రజలే నిర్ణయించుకోవాలని ఇటీవల కొన్ని వ్యాక్యలు చేసిన డిల్లీ సీ.యం. తన దైన మార్కు పాలనతో డిల్లీని పూర్తిగా మార్చాలని అనుకుంటున్నారు. ప్రస్తుతం డిల్లీ రాష్ట్ర ప్రభుత్వ సర్వీసుల్లో అవినీతి తగ్గుముఖం పట్టిందని 45శాతం ఢిల్లీ వాసులు అభిప్రాయ పడుతున్నట్టు సీఎంఎస్-ఐసీఎస్ సర్వే పేర్కొంది.ఇదే తరహాలో మిగిలిన అన్ని రాష్ట్రాలూ పని చేయగలిగితే. భారత దేశం లో గణనీయ స్థాయిలో అవినీతి తగ్గు ముఖం పట్టొచ్చంటున్నారు రాజకీయ విశ్లేషకులూ,సామాజిక కార్య కర్తలూ.

Must Read:సారిక కేసులో వీడుతున్న మిస్టరీ సిరిసిల్ల రాజయ్యకు బిగుస్తున్న ఉచ్చు.

(Visited 153 times, 1 visits today)