Home / Entertainment / మహేష్ బాబుకు ఒక న్యాయం..? నాకో న్యాయమా..?

మహేష్ బాబుకు ఒక న్యాయం..? నాకో న్యాయమా..?

Author:

 

Ali comments on Anushka and Mahesh babu

“ఆ పిక్కలు చూసావ భయ్యా…! ఎన్ని కొడలెక్కితే మాత్రం మనకలాగొస్తాయ్” అనుష్క గురించి “ఖలేజాలో మహేష్ డైలాగ్ గుర్తుంది కదా..! ఇప్పుడు అదే మాట మళ్ళీ ఎత్తాడు కమేడియన్ అలి. సినిమాల్లో స్టార్ కమేడియన్ ల లో ఒకడైన ఈ సొట్ట బుగ్గల నటుడు ఈ మద్య టీవీ పోగ్రామ్స్, ఆడియో రిలీజ్ ఫంక్షన్స్ కి యాంకరింగ్ చేస్తున్నాడు. ఆడియో ఫంక్షన్లో చాలా మంది ప్రేక్షకులు వస్తారు వారిని ఉత్తేజ పరచడానికి యాంకరింగ్ చేసేవాళ్లు కొన్ని జోకులు కూడా పేలుస్తుంటారు. కానీ అలి వేసే జోకులు మరీ అసభ్యంగా ఉంటూ కొన్ని సార్లు వివాదాస్పదం అయ్యాయి కూడా.

ఇటీవల సైజ్ జీరో ఆడియో ఫంక్షన్ లో అనుష్క గురించి అసభ్య కరమైన కామెంట్లు చేసిన ఆలీ మీద కొందరు సినీ జనాలే మండిపడుతున్నారు. అంతే కాదు ఆశా అనే అమ్మాయి ఐతే యూట్యూబ్ ద్వారా వార్నింగే ఇచ్చింది. మాట్లాడేటప్పుడు అది ఒక లైవ్ ప్రోగ్రాం అనీ దాన్ని ఇంట్లో అందరూ కలిసి చూస్తారనీ అలీ కి అర్థం కాదా? ఇలాంటి పద్దతి మారక పోతే బుద్ది చెప్పాల్సొస్తుంది అటూ మాటలతో ఏకి పారేసింది. ఆమధ్య సుమ పై చేసిన కామెంట్లకి బయట బాగానే చీవాట్లు తిన్నాడని టాక్ వచ్చింది. అది ముగియక ముందే సమంతా పై చేసిన కామెంట్లు వివాదాస్పదం అయ్యాయి. ఇక నైనా కాస్త తగ్గిస్తాడనుకుంటే మళ్ళీ రీసెంట్ గా “సైజ్ జీరో” ఆడియో ఫంక్షన్ లో బిల్లా టైం నుండి తాను అనుష్క తొడలకు అభిమానినని చెప్పి మరోసారి దుమారం లేపాడు. ఆలి చేసిన ఈ కామెంట్స్ కి ఫంక్షన్ కి వచ్చిన అతిధులతో పాటు అనుష్క పైకి నవ్వుకున్నా లోపల బాధ పడిందట.

ఈ సారి మాత్రం అలి ని ఎవరూ క్షమించలేదు. ఇదే వ్యవహారం లో యువ హీరో ఒకరు అలి పై గట్టిగానే మాట్లాడట. దీంతో కాస్త తేరుకున్నట్టున్నాడు నవ్వుల కాట్రవల్లి. ఇప్పుదు కవర్ చేసుకునే పనిలో పడ్డాడు. ఖలేజా లో మహేష్ బాబు ఇదే అనుష్క గురించి “పిక్క లు ఎలా ఉన్నయో చూడూ” అంటూ చేసిన వ్యాఖ్యలని గుర్తు చేసి మరీ. “మహేష్ కి ఒక న్యాయమూ అలి కి ఒక న్యాయమూ?” అంటూ సన్నిహితుల దగ్గర వాపోతున్నాడట. ఇదే మాటలు వేరే హీరో అని ఉంటే వేరే లా ఉండేది అయినా నేను మాట్లాడిన మాటలకు అనుష్క నే నవ్వి ఊర్కుంటే మిగిలిన వాళ్ళు మాత్రం సీన్ చేస్తున్నారేంటీ అంటూ చిరాకు పడ్డాడట కూదా. అయినా సినిమాలో ఉన్న క్యారెక్టర్ అనటం వేరూ డైరెక్తు గా మనిషినే అనటం వేరూ అని అర్థం కాలేదా ఇంత తెలిసిన ఈ సారుకి అనే వాళ్ళే తప్పా ఒక్కరు కూడా అలిని సప్పోర్ట్ చేసే లాగైతే కనిపించటం లేదు.

(Visited 433 times, 1 visits today)