Home / Inspiring Stories / మంచి చాన్స్ చూసి మంచోన్ని పట్టండి.

మంచి చాన్స్ చూసి మంచోన్ని పట్టండి.

Author:


మల్కాజ్ గిరి ఎంపీ,మల్లా రెడ్డి ఇంజినీరింగ్ కాలేజీ ల అధిపతీ అయిన శ్రీ శ్రీ మల్లా రెడ్డి గారు తనకాలేజ్ లో చదువుకునే విధ్యార్థులకు తమ జీవితాల్లో ఎలా సక్సెస్ ని సాధించాలో చక్కటి సందేశమే ఇచ్చారు. జీవితంలో చిన్న వయసులోనే ప్రేమ మంచిది కాదు అనే విషయాన్ని తమదైన పద్దతిలో ఆయన సెలవిచ్చారు అదేంటో తెలుసా…!?

“ఐశ్వర్యా రాయ్ ప్రపంచం లోనే అంద గత్తే అయినా,ఎంతమంది హీరో లు తన వెంట తిరుగుతున్నా పెళ్ళి విషయం లో తొందర పడకుండా,ఎవ్వరికీ చాన్స్ ఇవ్వకుండా  తన ముప్పై మూడో ఏట అమితాబ్ కొడుకు లాంటి పెద్దింటి అబ్బాయిని పట్టింది, చిల్లర గాల్లకూ..రోడ్డు మీద పోయె వాళ్ళకి చాన్స్ ఇవ్వలెదు. సోనియా గాంది రాజీవ్ ని అలానే పట్టింది ఈ కాలం ఆడపిల్లలు మంచి షార్ప్ ఉన్నారు ,మంచి పొజిషన్ చూస్కొని క్యాచ్ చేయండి పెద్దోన్ని చూస్కోని పట్టుకోండి” అంటూ అమ్మాయిలకి సందేశమిచ్చారు…అంతే కాదు అంతే కాదు “చిరంజీవి కొడుకైన రాం చరణ్ కూడా పెద్దింటి అమ్మాయిని “పట్టాడు” వాడికేం తక్కువా అయినా వాడు వెయిట్ చేసి మంచి చాన్స్ దక్కిచ్చుకున్నడు” అంటూంటే అబ్బాయిల కేరింతలు దద్దరిల్లాయి…. చిన్న వయసులో ప్రేమ భవిశ్యత్తుని పాడు చేస్తుంది అన్న మాట చెప్పటానికి మల్లారెడ్డి గారు చెప్పిన విషయాలు ఇవి… భాష రాక పోవటం కాదు ఇది సంస్కారం లేక పోవటం అనే విమర్శలు సోషల్ మీడియాలోను బయటా వినపడుతున్నాయి..

Must Read: కాబోయే భార్య ని వదిలేసి ఫ్రీ వై ఫై వెంట పడితే ఇలానే జరుగుద్ది

(Visited 58 times, 1 visits today)