Home / Inspiring Stories / మరణం లోనూ వీడని విశ్వాసం.

మరణం లోనూ వీడని విశ్వాసం.

Author:

మరణం లోనూ వీడని విశ్వాసం japan story 1

మనిషి పుట్టుక నుంచీ ఇప్పటివరకూ మానవుడికి జాతిభేదం లేకుండా కేవలం పెంపుడు జంతువుగా కాకుండా స్నేహితునిగా మారిన ఒకే ఒక జంతువు కుక్క. తొలి మానవుడు బట్ట కట్టుకోవటం నేర్చుకోక ముందే స్నేహం చేయటం నేర్చుకున్నాడు మొదటగా అతన్ని చేరిన జంతువు కుక్క తరువాత మనిషి పెంపుడు జంతువుల జాబితాలోకి చాలా జంతువులే వచ్చి చేరాయ్ గానీ కుక్కలా యజమాని తో సమానం గా అతని స్నేహితుని గా గుర్తింపు పొందలేక పోయాయి.కొన్ని పాడి కోసమూ, మరి కొన్ని మాంసం కోసమూ,ఇంకొన్ని రవాణా ఇతర అవసరాల కోసమో పెంచబడ్డాయి కానీ అన్ని స్థాయిలనూ దాటి రక్షణ, మానసిక ప్రశాంతత నిచ్చే ఏఅకైక జంతువు అయిన కుక్క మనిషికి మంచి మిత్రునిగా మారింది …జాక్ లండన్ కథ “బక్” లాంటి కథలు అద్బుతంగా మనిషికీ శునకానికీ ఉన్న అనుబంధాన్ని చూపించాయి…. ఐతే యజమాని కోసం, అతని కుటుంబం కోసమూ  ప్రాణాలకు తెగించిన కుక్కలు చరిత్రలో కోకొల్లలు…

అలాంటిదే “హచికో” కథ. జపాన్ లో జరిగిన ఒక నిజ జీవిత గాథ ఒక మనిషికీ జంతువుకీ మధ్య ఉన్న అనుబందాన్ని నిరూపించిన సంఘటన. జపాన్ లోని  టోకియో యూనివెర్సిటీ లో ఫ్రొఫెసర్  యూయెనో ఒక కుక్కని పెంచుకున్నాడు. అకితా జాతికి చెందిక ఈ కుక్క పిల్లకీ ఫ్రొఫెసర్ కీ మధ్య ఎంతో అనుబందం పెరిగిపోయింది. రోజూ ఆయన యూనివర్సిటీ కి వెళ్ళేటప్పుడు ఆయనతో షిబుయా  రైల్వే స్టేషన్ వరకూ వెళ్ళేది మళ్ళీ సాయంత్రం ఆయన వచ్చే సమయానికి స్టేషన్ ముందు నిలబడి ఆయన కోసం ఎదురు చూస్తూ ఉండేది. నిజానికి అకిథా జాతి కుక్కల లక్షణమే అది తమ యజమానులని విపరీతం గా ప్రేమిస్తాయవి. ఇలా కొన్నేళ్ళు గడిచాయి. ఒక రోజు యూనివర్సిటీకి వెళ్ళిన ఫ్రొఫెసర్ తిరిగి రాలేదు. యూనివర్సిటీ లోనె గుండె పోటుతో మరణించారు. దాంతో ఆయన మృతదేహం రోడ్డు మార్గం లో ఇంటికి చేరుకుంది. హచి కో  తన యజమాని కోసం ఎదురు చూస్తూనే ఉంది. యుయేనో రాలేదు హచికో అక్కడి నుంచి కదల్లేదు. ఇంటి దగ్గర యుయేనో అంత్యక్రియలు పూర్తయ్యాయి, హచికోకి తన యజమాని ఇక రాడనీ ఆయన మరణించాడనీ తెలియదు అది ఇంకా ఎదురు చూస్తూనే ఉంది… ఒకటీ, రెండూ, మూడూ రోజులూ, వారాలూ సంవత్సరాలూ గడుస్తున్నాయి…. హచికో ఎదురు చూస్తూనే ఉంది… కొన్నాళ్ళ మిత్రుడినో, బందువులనో, ఆఖరికి అమ్మానాన్నలనీ వదిలి పెట్టే సే ఈ మనుషుల మధ్య ఒక కుక్క తన మిత్రుని కోసం ఎదురుచూసింది తొమ్మిదేళ్ళు గా అక్కడే అదే షిబుయాస్టేషన్ ముందు ద్వారం వైపే చూస్తూ కూచుంది… వేసవిలో ఎండ మాడ్చేసినా..,చలికాలం మంచు ఎముకలని కొరికేస్తున్నా అక్కడి నుంచి కదల్లేదు, బహుషా మనిషి లక్షణాలు లేక పోవటం వల్లేమొ నమ్మిన మనిషిని మరవకుండా హచికో అలా తన జీవిత కాలం పాటు ఎదురు చూసింది….

మరణం లోనూ వీడని విశ్వాసం japan dog

కొన్ని సారు యుయేనో కుటుంబ సభ్యులు వచ్చి హచికో ని ఇంటికి తీసుకువెళ్ళే ప్రయత్నం చేసినా తన హచికో తన యజమాని రాకుండా తిరిగి వెళ్లలేదు. చివరికి ఒక చలికాలం లో హచికో అదే స్టేషన్ ముందు ప్రాణాలొదిలేసింది. అక్కడి స్టేషన్ అధికారులనూ, రోజూ వెళ్ళే ప్రయాణీకులనూ హచికో కథ కదిలించింది. వారి గుండెలను తాకింది అత్యంత విషాదంగా ముగిసిన హచికో ఎందరికో జీవిత సూత్రాన్ని నేర్పింది. అంతా కలిసి హచికో
అంత్యక్రియలని నిర్వహించారు, యుయేనో సమాధి పక్కనే హచికో సమాధినీ నిర్మించారు. స్టేషన్ ముందూ రోజూ హచికో కూచుని ఎదురు చూసిన స్థలం లోనే ఒక కాస్య విగ్రహాన్ని నిర్మించారు.హచికో శరీరపు మోడల్ ని టోకియో సైన్స్ మ్యూజియం లో ప్రదర్శణకు ఉంచారు. జపాన్ కి వచ్చినప్పుడు ఈ కథని విన్న హాలీవుడ్ నటుడు రిచర్డ్ గెరె అక్కడే ఏడ్చేసాడు తనని కదిలించిన ఆ ఇద్దరు మిత్రుల కథని “హచి-ఎ డాగ్స్ టేల్” పేరుతో సినిమాగా తీసాడు. ఇదే స్పూర్తితో తెలుగులోనూ టామీ అనే ఒక సినిమా వచ్చింది. ఎవరి కోసమైనా ఎదురు చూడటం అంటే… హచికో లా ఎదురు చూసాడు అని చెప్పటం జపాన్ లో ఒక నానుడి గా స్థిరపడి పోయింది..

japan dog story  hachiko

ప్రతి ఏటా మార్చి 8 న హచికో మరణించిన రోజు అక్కడ ఉత్సవాలు జరుగుతాయి. వేలాది మంది తమ కుక్కలతో అక్కడికి చేరుకుంటారు. తమ నేస్తాలకు హచికో కథని చెబుతారు. కొన్ని కన్నీళ్ళని యూయెన్, హచికోలకి నివాళి గా వదిలి వెళతారు.. హచికో ని తలుచుకుంటూ తమ నేస్తాలైన కుక్కలని హత్తుకుంటారు….

Must Read: ఒక్క గుద్దుతో పేషెంట్ ని చంపేసిన డాక్టర్.

(Visited 1,846 times, 1 visits today)