Home / Inspiring Stories / 11 ఏళ్ళ వయసుకే తాను మంటల్లో కాలుతూ 8 మందిని కాపాడాడు..

11 ఏళ్ళ వయసుకే తాను మంటల్లో కాలుతూ 8 మందిని కాపాడాడు..

Author:

ఐదేళ్ళ క్రితం సంఘటన ఇది. నవ్వుతూ తుళ్ళుతూ ఉన్న ఆ పసివాళ్ళకు తెలియదు తమ జీవితంలోనే మరిచిపోలేని ఘటన ఆ రోజు జరగనుందని. జోక్స్..నవ్వులు..అల్లరి…అల్లరిగా ఉంది ఆ స్కూల్ వ్యాన్. ఇంకో పదినిమిషాల్లో స్కూల్ కి చేరిపోతారనగా. ఊహించని ప్రమాదం చుట్టూ ముట్టింది ఆ చిన్నారులని. వేగంగా స్కూల్ వైపు ప్రయాణిస్తున్న మారుతీ వ్యాన్ గ్యాస్ కిట్ లో షాట్ సర్య్కూట్ కావడంతో ఆ వ్యాన్ లో మంటలు చెలరేగాయి. . అప్పటి వరకు అల్లరి అల్లరి గా గడిపిన పిల్లలు ఒక్క సారిగా భయకంపితులయ్యారు. భయంతో ఏడుస్తూ మమ్మల్ని రక్షించండీ..రక్షించండీ..!! అంటూ…. ఏడవటం మొదలు పెట్టాడు. అప్పటికే డ్రైవర్ భయంతో వ్యాన్ దిగి దూరంగా పరుగు తీసాడు…

Hero2

అదే వ్యాన్ లో ఉన్న ఓం ప్రకాష్ కీ భయం వేసింది కానీ తన కోసం కాదు తన స్నేహితులేమైపోతారో అని. ఏడుస్తూనే అద్దాలు పగలగొట్టాడు. వెంటనే తనతో ఉన్న పిల్లలను ఒక్కొక్కరినే ఆ దారి గుండా బయటకు పోవటానికి సహాయం చేసాడు. అందరూ సురక్షితంగా బయటపడ్డ తరవాతే తానూ అదే మార్గం గుండా బయట పడ్డాడు అయితే.. అందరూ బయట పడకముండే లోపల మంటల వల్ల ఓం ప్రకాష్ కు కాలిన గాయాలు అయ్యాయి అయినా అందరూ సురక్షితం అనుకున్నాకే తాను వ్యాన్ లోంచి బయట పడి అందరినీ తీసుకొని దూరంగా పరుగుతీసాడు.అంతే కొద్దిసేపట్లోనే వ్యాన్ పేలిపోయింది. కాలిన గాయాలతో ఉన్న ప్రకాష్ ని హాస్పిటల్ కి తరలించారు. ప్రాణాపాయ స్థితి నుండి బయటపడ్డ ఆనాటి గాయం తాలుకు మచ్చలు ప్రకాష్ మొఖం పై అతని సాహసానికి గుర్తుగా మిగిలిపోయాయి.

hero-1

సాహస బాలలకిచ్చే అవార్డు అందుకున్నప్పుడు. విలేకరులు “అద్దం పగలగొట్టిన వాడివి నువ్వు బయటకి వచ్చి వాళ్ళని లాగవచ్చు కదా ? లోపలెందుకు ఉండిపోయావ్? అని అడిగినప్పుడు. ” ఏమో ముందు వారిని కాపాడాలి అంటే నన్ను నేను రక్షించుకున్న తరవాత అయితే దానిలో దైర్యం,సాహసం,ఏముందీ” అని ఎదురు ప్రశ్న వేశాడు…

Must Read: సీతమ్మ అందాలూ రామయ్య సిత్రాలు సినిమా పర్ఫెక్ట్ రివ్యూ & రేటింగ్.

(Visited 257 times, 1 visits today)