Home / Inspiring Stories / ఒకప్పుడు మెకానిక్… ఇప్పుడు దుబాయ్‌లోని బుర్జ్‌ ఖలీఫాలో 22 ఫ్లాట్లకు ఓనర్.

ఒకప్పుడు మెకానిక్… ఇప్పుడు దుబాయ్‌లోని బుర్జ్‌ ఖలీఫాలో 22 ఫ్లాట్లకు ఓనర్.

Author:

దుబాయ్‌లోని బుర్జ్‌ ఖలీఫా ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవంతి. ఈ భవంతిలో ఉండాలంటే కనీసం కోటీశ్వరుడు కావలి. అంటువంటి భవంతిలో ఒక మామూలు మెకానిక్ గా తన ప్రస్తానం మొదలు పెట్టి ఇప్పుడు బుర్జ్‌ ఖలీఫాలో 22 ఫాట్లకు ఓనర్ గా ఎదిగి అవకాశం ఉంటే మరిన్ని ఫాట్లను కొనడానికి నేను సిద్దమే అంటున్నాడు కేరళకు చెందిన జార్జ్ వి నేరీపరంబిల్ .

kerala-man-owner-at-burj-khalifa-2

పట్టుదలకు మారు పేరు జార్జ్ వి నేరీపరంబిల్. ఎందుకంటే తాను ఏదైనా అనుకుంటే సాధించే వరకు వదిలి పెట్టాడు. ఆ పట్టుదలనే మామూలు మెకానిక్ నుండి ఇంత పెద్ద స్థాయికి తీసుకెల్లింది. ఇతను బుర్జ్‌ ఖలీఫాలోనే ఫాట్లు ఎందుకు కొంటూన్నాడో తెలుసా!… ” ఒకసారి మా బంధువు బుర్జ్‌ ఖలీఫాను చూపించి ఇందులోకి ఒక్కసారైనా ప్రవేశించగలవా అని అడిగాడు” . ఆ తర్వాతా ఒక రోజు పేపర్ లో బుర్జ్‌ ఖలీఫాలో ఒక ఫ్లాట్ ఖాళీగా ఉందని ప్రకటన చూసి అదే రోజు అందులోకి షిఫ్ట్ అయ్యాను.

kerala-man-owner-at-burj-khalifa-2

ఇంతకు జార్జ్ వి నేరీపరంబిల్ కేరళలో ఉన్నప్పుడు ఒక మామూలు మెకానిక్ కానీ 1976 దుబాయ్ వెళ్లిన తరవాత అక్కడ ఉండే వేడిని చూసి అక్కడ ఎయిర్ కండిషనింగ్ వ్యాపారం అయితే బాగుంటుందని భావించి మొదలు పెట్టాడు. ఇప్పుడు జీఈఓ గ్రూప్ ఆఫ్ కంపెనీలకు అధినేతగా మారాడు.

kerala-man-owner-at-burj-khalifa-2

తాను కొన్న 22 ఫాట్లలో ఇప్పటివరకు 5 ఫాట్లను అద్దెకు ఇచ్చాడు. మిగిలిన వాటిని మంచి వ్యక్తులు దొరికితే అద్దెకివ్వడానికి నేను సిద్దమే అంటున్నాడు. జార్జ్ వి నేరీపరంబిల్ మాట్లాడుతూ … నేను కలలు కంటాను. ఆ కలలను సాఫల్యం చేసుకోవడంలో ఏమాత్రం వెనుకడుగు వెయ్యను అంటున్నాడు.

Must Read: ఆధార్ కార్డుతో 7 రోజుల్లో పాస్ పోర్ట్ పొందొచ్చు.

(Visited 2,286 times, 1 visits today)