Home / Latest Alajadi / న్యాచురల్ గా బరువుని తగ్గించే ఎఫెక్టివ్ డ్రింక్స్‌..!

న్యాచురల్ గా బరువుని తగ్గించే ఎఫెక్టివ్ డ్రింక్స్‌..!

Author:

బరువు సమస్య ఇప్పుడు చిన్నవారి నుండి పెద్దవారి వరకు అందరిని పట్టి పీడిస్తున్న అతిపెద్ద సమస్య . బరువు తగ్గించికోవాడానికి చాలా ప్రయత్నాలు చేసి విసిగిపోయిన వారు చాలా మంది ఉన్నారు బరువు అనేది పెరిగినంత తేలిక కాదు..తగ్గడం అంటున్నారు నిపుణులు. ఎక్కువగా జంక్ ఫుడ్, ఆయిల్ ఫుడ్ మీద మోజు ఎక్కువ అలాగే లేట్ నైట్ పార్టీలు, సమయానికి తినకపోవడం శారీరక శ్రమ తగ్గడం, వాళ్లు టీవీ, కంప్యూటర్లకు ఎక్కువగా అతుక్కుపోవడం వంటి మార్పుల వల్ల అధిక బరువు అనే సమస్య పెరుగుతోంది.

అయితే కింద ఇచ్చిన మూడు ర‌కాల డ్రింక్స్‌లో దేన్న‌యినా ఓసారి ప్ర‌య‌త్నించి చూడండి. ఎందుకంటే ఇవి అధిక శాతం మందిలో స‌త్ఫ‌లితాల‌నిచ్చాయ‌ట‌. కాబ‌ట్టి మీరు అధిక బ‌రువు ఉంటే ఈ డ్రింక్స్‌ను తాగి చూడండి. ఫ‌లితం క‌నిపించేందుకు అవ‌కాశం ఉంటుంది.

దాల్చిన చెక్క డ్రింక్‌:

Fit body

  • 1 క‌ప్పు గోరు వెచ్చ‌ని నీరు,
  • 1 టీస్పూన్ దాల్చిన చెక్క పొడి,
  • 1 టేబుల్ స్పూన్ తేనెల‌ను తీసుకోవాలి.

గోరు వెచ్చని నీటిలో దాల్చిన చెక్క పొడి, తేనెని వేసి బాగా క‌ల‌పాలి. అనంత‌రం వ‌చ్చే మిశ్ర‌మంలో స‌గం క‌ప్పును ఉదయం నిద్ర లేచిన వెంటనే ప‌ర‌గ‌డుపున తాగాలి. మిగిలిన స‌గం క‌ప్పును రాత్రి పూట భోజనం చేసిన ముప్పావుగంట తర్వాత తాగాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల శ‌రీరంలో అధికంగా పేరుకుపోయిన కొవ్వు త‌గ్గుతుంది. అంతేకాదు ర‌క్తంలో చ‌క్కెర స్థాయిలు కూడా అదుపులోకి వ‌స్తాయి. కొద్దిగా ఆహారం తీసుకున్నా క‌డుపు నిండిన భావ‌న క‌లుగుతుంది. ఇది బ‌రువు తగ్గించుకునేందుకు ఉప‌యోగ‌ప‌డుతుంది.

తేనె డ్రింక్‌:

Honey Drink

  • 1 క‌ప్పు గోరు వెచ్చ‌ని నీరు,
  • 1 టేబుల్ స్పూన్ తేనె,
  • 1 టేబుల్ స్పూన్ నిమ్మ‌ర‌సం,
  • 1 టేబుల్ స్పూన్ దాల్చిన చెక్క పొడి

పైన చెప్పిన పదార్థాలను ఒక గిన్నెలో తీసుకుని బాగా క‌ల‌పాలి. అనంత‌రం ఈ మిశ్ర‌మాన్ని రోజుకు ఒక‌సారి తాగితే జీర్ణ ప్ర‌క్రియ మెరుగు ప‌డుతుంది. జీర్ణాశ‌య సంబంధ స‌మ‌స్య‌లు కూడా త‌గ్గుతాయి.అధిక బ‌రువు స‌మ‌స్య దూర‌మ‌వుతుంది.

నిమ్మ ర‌సం:

Honey-Lemon

  • 1 గ్లాస్ నీరు,
  • 2 టీస్పూన్ల నిమ్మ‌ర‌సం
  • 1 టీస్పూన్ తేనె

పైన చెప్పిన పదార్ధాలని తీసుకుని బాగా మిక్స్ చేయాలి. ఈ రసాన్ని ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపుతో తాగాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల బ‌రువు త్వ‌ర‌గా త‌గ్గుతారు. మెట‌బాలిజం ప్ర‌క్రియ మెరుగుప‌డుతుంది.

కీరదోసకాయ డ్రింక్:

ginger-infused-lemon-water

  • కీర దోసకాయ ముక్కలు-5
  • 2 టీస్పూన్ల నిమ్మ‌ర‌సం
  • 1 టేబుల్ స్పూన్ పూదీన పేస్ట్
  • 1 టేబుల్ స్పూన్ అల్లం తురుము
  • 2 క‌ప్పుల గోరు వెచ్చ‌ని నీరు

కీర దోసకాయ ముక్కలలో నిమ్మరసం, పూదీన పేస్ట్, అల్లం తురుముని కలిపి 6 గంటల పాటు నానా బెట్టాలి, ఆ తరువాత ఆ మిశ్రమాన్ని గోరు వెచ్చని నీటిలో కలుపుకొని రోజుకి 5 సార్లు తాగాలి, అలా కొన్ని రోజుల పాటు తాగితే శరీరంలో పేరుకుపోయిన కొవ్వు తగ్గిపోతుంది.

Must Read: పసుపు పచ్చగా ఉన్న దంతాలను నిమిషాల్లో తెల్లగా మార్చుకోవచ్చు.

(Visited 8,798 times, 1 visits today)