Home / Inspiring Stories / మన దేశంలో న్యాయం అంటే ఏమిటి..?

మన దేశంలో న్యాయం అంటే ఏమిటి..?

Author:

no justice in india for common people

“ఎప్పటికైనా న్యాయం గెలిచి తీరుతుంది” భారత దేశం లో ఈ మాట సినిమాల్లో తప్ప బయట మాత్రం అపహాస్యమయ్యే తీరుతోంది. భారత దేశానికి స్వతంత్రం వచ్చిన దగ్గరి నుంచీ కోర్టులని నమ్మిన సామాన్యుడు మోసపోతూనే ఉన్నాడు. డబ్బూ లేదంటే అధికారం ఇంత పెద్ద ప్రజాస్వామ్య దేశాన్ని,దేశ న్యాయవ్యవస్తనీ అనధికారికంగా శాసిస్తూనే ఉన్నాయి.బోఫోర్స్ దగ్గర్నుంచీ ఇప్పటి వరకూ కొన్ని వందల కోట్ల కుంబకోణాలు, లాల్బహదూర్ శాస్త్రి మరణం నుంచీ ఇప్పటి వరకూ ఎన్నో మిస్టరీ హత్యలు… నిజం ఏమిటో అందరికీ తెలిసినా కోర్టు మాత్రం కొన్ని సార్లు మౌనాన్ని పాటిస్తూనే ఉంది ఏదొ ఒక కారణం తో పౌరుల నమ్మకాన్ని దెబ్బతీస్తూనే ఉంది.

సల్మాన్ హిట్ అండ్ రన్ కేసు దేశవ్యాప్తంగా సల్మాన్ అభిమానులు కూడా అతన్ని అసహ్యించుకున్న ఈ కేసులో నిజానికి సల్మాన్ ఖాన్ కారు చక్రాల కిందపడి మరణించింది ఫుట్ పాత్ మీద పడుకున్న అమాయకులే  మాత్రమే కాదు,అతని బాడీ గార్డ్ పాటిల్ కూడా మరణించాడు. . 2002 సెప్టెంబర్ 28న సల్మాన్ బేకరీలోకి కారు తోలినప్పుడు పాటిల్ నేరుగా బాంధ్రా స్టేషన్ కు వెళ్లి జరిగింది జరిగినట్టు ఫిర్యాదు చేశాడు. దానిని ఎఫ్ఐఆర్ లో పేర్కొన్నారు. తరువాత న్యాయస్థానంలో కూడా జరిగినది జరిగినట్టు చెప్పాడు. అంతే, చూస్తుండగానే అతని జీవితం తల్లకిందులైపోయింది. హై ప్రొఫైల్ కేసులో ప్రత్యక్ష సాక్షిగా ఉన్నందుకు పాటిల్ ను ఉద్యోగం నుంచి తప్పించారు.

సల్మాన్ సన్నిహితులు, అతని మద్దతుదారుల నుంచి ఒత్తిడి ఎలాగూ ఉండేదే. పోలీస్ శాఖ నుంచి కూడా పాటిల్ ఒత్తిళ్లు ఎదుర్కొన్నాడు. దీంతో కమాండో శిక్షణ పొందిన పాటిల్ శారీరకంగా, మానసికంగా కుంగిపోయాడు. మహాబలేశ్వరంలో 2006 మార్చిలో అతనిని అరెస్టు చేశారు. తరువాత ఆర్థర్ రోడ్ జైలుకు పంపారు. విడుదలయ్యాక 2007లో ముంబైలోని శివిడీ రోడ్డుపై బిచ్చమెత్తుకుంటూ 50 రూపాయలు సంపాదించుకుని సెవ్రీలోని టీబీ ఆసుపత్రిలో చికిత్స చేయించుకునేవాడు. నడవలేని, మాట్లాడలేని స్థితిలో పాటిల్ 2007 అక్టోబర్ 4న కన్నుమూశాడు. మరణానికి కొద్ది రోజుల ముందు మీడియా ప్రతినిధులతో ఆ ప్రమాదం తన జీవితాన్ని నాశనం చేసిందని వాపోయాడు.హిట్‌ అండ్‌ రన్‌ కేసులో విచారణ జరిపిన ముంబాయి హైకోర్టు సల్మాన్ ని దోషిగా ప్రకటించలేమంటూ తేల్చి చెప్పింది.కింది కోర్టు విధించిన శిక్షను కూడా రద్దు చేసింది. ఆ కేసులో గతంలో సల్మాన్‌ వ్యక్తిగత సహాయకుడు రవీంధ్ర పాటిల్‌ సాక్ష్యాన్ని నమ్మలేమని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఏఆర్‌ జోషి పేర్కోన్నారు. సల్మాన్ నిర్దోషిగా బయటకు వచ్చారు.

2012 లో నిర్భయ ఘటన దేశమే కాదు దాదాపు ప్రపంచమే ఈ సంఘటన పట్ల తీవ్ర వేదన పడింది. ఆ నిందితులని అప్పటికప్పుడు చంపేయాలంటూ మండిపడ్డారు ప్రజలు,యువతరం అంతా ఒక్కతాటి మీదకొచ్చి రోడ్లమీద నిరసన ప్రదర్శనలతో ప్రభుత్వాన్నే వణికిపోయేలా చేసారు. ప్రభుత్వం వేగంగా స్పందించింది నిందుతులు తామే దోషులమని ఒప్పుకున్నాక కూడా కొన్ని నెలల “స్వల్ప”కాలం లోనే విచారణ పూర్తి చేసి తీర్పునిచ్చింది న్యాయస్థానం ఈ పాపానికి పాల్పడ్డ ఆరుగురిలో నలుగురికి కోర్టు ఉరి శిక్ష విధించింది. మరొకరు పోలీస్ కస్టడీలోనే మృతి చెందాడు. ఆరో వ్యక్తికి మైనార్టీ తీరకపోవడంతో అతనికి జూవనైల్ యాక్ట్ ప్రకారం మూడు సంవత్సరాల జైలు శిక్ష విధించి జూవనైల్ హోం కు తరలించారు. ప్రభుత్వం కంటితుడుపు చర్యగా నిర్భయ చట్టం తెచ్చింది.పరిస్థితి ఎప్పటి లాగే ఉంది ఈ రెండేళ్ళలో కొన్ని వందల మంది ఆడపిల్లలూ,చిన్న పిల్లలూ అత్యా చారానికీ,హత్యలకూ గురయ్యారు…ౠజువర్తన కలిగి ఉండటం అంటే రోజుకి ఐదుసార్లు నమాజు చేయటం,రంజాన్ మాసం లో ఉపవాసం ఉండటం,లేదా రోజూ బొట్టు పెట్టుకొని సంద్య వార్చటం అనుకునే దేశం లో అతని మత విధానాన్ని ఆచరించటం చాలా మందికి సత్ప్రవర్తన కింద కనిపించింది. ఈ డిసెంబర్ 20న అతన్ని విడుదల చేయనున్నారు. అంతే కాదు ఎంతో సహృదయత కలిగిన ఈ దేశ ప్రజా ప్రభుత్వం విడుదల అనంతరం ఆ బాలనేరస్థుడికి ఆర్ధికంగా నిలదొక్కుకునేందుకు పదివేల రూపాయల ఆర్ధిక సాయం, ఒక కుట్టు మిషనూ పెట్టుకునేందుకు ఢిల్లీ మహిళా శిశు సంక్షేమ శాఖ అతనికి పునరావాసం కల్పించనుంది. నిర్భయ అసలు పేరు జ్యోతీ సింగ్ గా వెళ్ళ డించిన ఆమె తల్లితండ్రులు కుమిలి పోతూనే ఉన్నారు…

కాలేజ్ హాస్టల్ లోనే ఒక యువతి ధారుణంగా చంపబడింది. బ్లేడ్ లతో గాట్లూ,మరణించాక నగ్న శరీరం పై రాతలతో కౄరత్వాన్ని ప్రదర్శించారు హంతకులు. మొదట్లో హంతకుడు ఒకడుకాదు అని చెప్పిన పోలీసులు మళ్ళీ ఆ మాట ఎత్తలేదు. కొందరు రాజకీయ నాయకుల కొడుకుల పేర్లు వినిపించాయి కానీ హఠాత్తుగా సత్యం బాబు అనే వ్యక్తి సీన్లోకి వచ్చాడు. విచారణలోనూ అతను దోషి కాదనీ ఎవరినో కాపాడటానికి తాను నేరాన్ని ఒప్పుకున్నాడనీ మేడియా,ఆయేషా తల్లి తండ్రులూ గగ్గోలు పెట్టారు.అప్పటి ముఖ్య మంత్రిని కలిసేందుకు వెళ్ళిన ఆయేషా మీరా తల్లితండ్రులకు ఏటువంటి పరిస్థితులెదురయ్యాయో అందరికీ తెలిసిందే.ఇవన్నీ జరుగుతూండ గానే కోర్టు మాత్రం సత్యం బాబు నే దోషిగా నిర్ణయించి తీర్పు కూడా ఇచ్చేసింది. తీర్పు వెలువడిన వెంటనే ఆయేషా మీరా తల్లిదండ్రులు, సత్యం బాబు అసలు దోషి కాదని, అసలు దోషులు కోనేరు వారి బంధు వర్గమని స్పష్టంగా ప్రకటించారు. బాధితులు నేరారోపణ చేసిన వారిని ఏమాత్రం విచారించకుండా సత్యం బాబుతో మమ అనిపించడం చూస్తుంటే న్యాయ వ్యవస్థ పైనే నమ్మకం సన్నగిల్లుతుంది. ఆయేశా నిర్భయలను మరిచిపోక ముందే ర్యాగింగ్ పేరుతో మరో విద్యార్థిని మరణించింది. పైకి ఇది ఆత్మహత్యే అయినా. అందుకు ప్రేరేపించిన పరిస్థితులూ,వ్యక్తులూ హంతకులే ఔతారు అన్న విషయం పదో తరగతి పిల్ల వాడికి కూడా తెలుసు కానీ ఇక్కడ కులం,అధికారం ఒక్కటయ్యాయి. డబ్బూ,భూమీ,అధికారం ప్రయోగించి ఆ కేసునూ నీరు గార్చారు. నిందితులు మాత్రం ఇప్పుడు బయటే తిరుగుతున్నారు.

కోమలవల్లి.. అలియాస్ జయ లలిత.. ఈ పేరు మూడున్నర దశాబ్దాలుగా వర్తమాన భారత రాజకీయాల్లో ఓ సంచలనం. తమిళనాట ఆమె పురచ్చితలైవి.ఈమె మీద ఆరోపించబడిన 13 కేసులు దూదిపింజెల్లా తేలిపోయి ఆమె నిర్దోషిత్వాన్ని నిరూపించాయి.అన్నిటినీ మించి పందొమ్మిదేళ్లపాటు ఆమెను ఎంతగానో వేధించిన ‘ఆదాయానికి మించిన ఆస్తుల కేసు’ రాజకీయ ప్రేరేపితమైనదిగా తేలిపోయింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పు జయలలితకు ఎక్కడలేని ఊరట నిచ్చి ఉంటుంది. అన్నా డీఎంకే మద్దతుదార్ల, ‘అమ్మ’ అభిమానుల ఆనందానికి అవధులే లేవు.అయితే కర్ణాటక హైకోర్టు తీర్పుపై రకరకాల వ్యాఖ్యానాలు వినిపించాయి. న్యాయస్థానం ఇచ్చిన తీర్పునకు విరుద్ధంగా వ్యాఖ్యానించినా, వ్యవహరించినా న్యాయస్థానాన్ని ధిక్కరించిన అభియోగానికి అర్హులవుతారు కాబట్టి అంతా నోళ్ళు కట్టుకున్నారు. అభియోగాలలో పేర్కొన్న కాలం లో జయలలిత సంపాదన రూ.34.76 కోట్లుగా మదింపు వేసి వ్యత్యాసం రూ.2.82 కోట్లు మాత్రమేనని న్యాయ స్థానం నిర్ధారించింది. రెండుకోట్ల అవినీతి పెద్ద నేరం కాబోదంటూ “అమ్మ”ను వదిలేసింది…

ఓ ఫిర్యాదు నేపథ్యంలో.. పోలీసుల చర్యలతో కాల్ మనీ దందా వెలుగు చూసింది.రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘కాల్ మనీ’ కేసులో దోషులను తప్పించేందుకు పలువురు ప్రముఖులు రంగంలోకి దిగి చాప కింద నీరులా పావులు కదుపుతున్నారంటూ.ప్రముఖ దిన పత్రికలో వచ్చిన కథనం ఈ ఆరోపణలకు ఊతమిస్తోంది. ఈ కేసులో కీలక వ్యక్తుల్లో ఒకరైన విద్యుత్ శాఖ డీఈ సత్యానందంను తప్పించేందుకు పెద్ద ఎత్తున లాబీయింగ్ మొదలైంది. సత్యానందాన్ని తప్పించేందుకు ఇప్పటికే ఓ ఎన్నారై ప్రముఖుడు రంగంలోకి దిగినట్లు సమాచారం. సదరు ఎన్నారై తానాలో కీలక పదవిలో ఉన్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడితో కూడా ఆ ఎన్నారైకి మంచి సన్నిహిత సంబంధాలున్నాయని చెబుతున్నారంటూ ఒక పత్రిక కొన్ని నిజాలను వెల్లడించింది. ఇప్పుడు ఇంకా కొన్ని నిజాలు బయటికి వస్తూన్నా ఈ విషయంలో ఎంతమంది కి న్యాయం జరుగుంతుందో,ఎందరికి శిక్షలు పడతాయో తాజా పరిణామాలను బట్టి ఇప్పుడే చెప్పొచ్చు…

ఇవే కాదు ఎన్నో మరెన్నో ప్రతీ రోజూ తనదేశ న్యాయ వ్యవస్త మీద ఉన్న నమ్మకాన్ని పై ఉన్న నమ్మ కాన్ని వమ్ము చేస్తూనే ఉన్నాయి.రాజకీయ నాయకుడి ఇసుక మాఫియా ని ఎదుర్కున్న ఎమ్మార్వో చంపబడతాడు జనం పేపర్లో చదివి వదిలేస్తారు,ఒక సినీ నటుడి ఇంట్లో కాల్పుల విషయంలో మతలబేంటని పక్క రాష్ట్రంలో ఉన్న చాయ్ వాలా కి తెలుస్తుంది కానీ అది ఒక ప్రమాదం అంటూ కోర్టు తీర్పు చెబుతుంది.లలిత్‌ మోది- విచారణ సాగుతూనే ఉంటుంది, శశిథరూర్ కేసు విచారణ సాగుతూనే ఉంటుంది.ఇంకా కొందరి విషయంలో బహుశా కేసు విచారణకు కూడా రాదు సిమెంటు ఫ్యాక్టరీలూ,ల్యాండ్ మాఫియాలూ, రాజధానుల పేరుతో భూదందాలూ యథేచ్చగా జరుగుతూనే ఉన్నాయి. నిజాలు అందరికీ తెలుసు కోర్టులకు తప్ప. ఆఖరికి ఇన్ని హత్యలూ,దందాల వార్తలని కూడా టీవీల్లో టైం పాస్ కార్యక్రమాలుగా చూసే స్థాయికి పౌరులు వచ్చేసారు. ఇక ఈ పరిస్థితి నుంచి ఈ దేశాన్ని ఎవరు కాపాడాలి?

Must Read: 1971 అమరజవాన్లకు మన బహుమానం ఏమిటి?

(Visited 261 times, 1 visits today)