Home / Inspiring Stories / అరటిపండ్లు, కోడి గుడ్లను మెక్కల పెంపకానికి ఉపయోగించండి.

అరటిపండ్లు, కోడి గుడ్లను మెక్కల పెంపకానికి ఉపయోగించండి.

Author:

Banana and Egg for plants

అరటిపండులో ఎన్నోపోషకాలున్నాయి అలాగే సెమీనాన్వెజ్ గా పీలవబడే కోడి గుడ్డులోనూ పుష్కలంగా పోషక విలువలున్నాయి. అయితే బాగా పండిన అరటి పండునో,పాడైన కోడిగుడ్డునో ఏం చేస్తారు?? ఏం చేస్తాం పడేస్తాం అంటారా..! సరే పడేయండి అయితే బయట కాదు మొక్కల దగ్గర పడేయండి. మొక్కలకీ పోషకాలౌ అందాలి కదా…! అదెంటలా చూస్తారు, నమ్మకం లేదా? నిజమండీ బాబూ గులాబీ మొక్కలు పెంచే వాళ్ళు కోడిగుడ్డు పెంకులని వేయటం ఎప్పుడూ చూడలేదా ఏమిటీ? ఇదీ అలాగే నట. గుంతలు తవ్వడం, నీరు పోయడం ఎవరైనా శ్రద్ధతో చేస్తారు. కాకపోతే ఎరువుల విషయానికి వస్తేనే ఎటూ తేల్చుకోలేరు.ఓ వ్యక్తి అర టిపండ్లు, కోడిగుడ్లను మొక్కల పెంపకం కోసం ఉపయోగించి అద్భుతం చేశాడు. సేంద్రీయ ఎరువులా వాటిని వాడడంతో ఆ మొక్కలు ఏపుగా పెరిగాయి. ఇందు కోసం అతను ఏం చేశాడో ఇప్పుడు చూద్దాం. మొక్కలను పెంచాలంటే మూడు అంశాలను ప్రధానంగా గుర్తు పెట్టుకోవాలి. అవి చక్కని మట్టిలో గుంతలు తవ్వడం, సరైన ఎరువులు వాడడం, తగిన సమయానికి నీరు పోయడం తదితర అంశాలకు ప్రాధాన్యతను ఇవ్వాల్సి ఉంటుంది. లేదంటే మొక్కలు కాస్తా ఎండుపుల్లలైపోతాయ్ మరి…

Banana and Egg for plants 2

అయితే డబ్బులు వెచ్చించి కృత్రిమ ఎరువులను వాడేందుకు ప్రస్తుతం ఎవరూ ఆసక్తిని చూపడం లేదు. ఈ క్రమంలో మొక్కల పెంపకం కోసం సేంద్రీయ ఎరువుల వాడాల్సిన అవసరం వచ్చింది. అయితే మిగతా సేంద్రీయ ఎరువుల కన్నా అరటి పండ్లు, కోడిగుడ్లు తక్కువ ధరకే వస్తాయి కాబట్టి వాటిని నిరభ్యంతరంగా ఎరువులా వాడుకోవచ్చు.అంతే కాకుండా మిగిలి పోయిన పాడైన అరటిపండ్లను కూడా వాడొచ్చుట.. సాధారణంగా మొక్కలకు సల్ఫర్, నైట్రోజన్, పొటాషియం వంటి వాటి అవసరం ఎక్కువగా ఉంటుంది. ఈ క్రమంలో అరటిపండ్లు, కోడిగుడ్లు కూడా అదే తరహా పోషకాలను మొక్కలకు అందిస్తాయి.అయితే వాటిని వాడాలంటే గుంతను కనీసం 10 నుంచి 12 ఇంచుల లోతుకు తవ్వాల్సి ఉంటుంది. బాగా పండిన అరటిపండ్లు, గడువు ముగిసిన కోడిగుడ్లను కూడా ఈ పద్ధతి కోసం ఉపయోగించవచ్చు.ఒక మొక్కకు ఒక కోడిగుడ్డు, ఒక అరటిపండు చొప్పున ఉంచాల్సి ఉంటుంది. అయితే వీటిని గుంతలో పక్క పక్కనే యథాతథంగా ఉంచాలి కోడిగుడ్డుని పగలకొట్టటం గానీ అరటిపండుని గుజ్జుగా చేయటం గానీ చేయాల్సిన అవసరం లేదు.తర్వాత గుంతను సగానికి మట్టితో నింపాలి. మిగిలిన భాగంలో మొక్క వేర్లు వచ్చేలా పెట్టి మొత్తం గుంతను పూడ్చేయాలి. మొక్క ఎదిగే క్రమంలో దాని వేర్లు కూడా పెరుగుతాయి. అయితే మొక్క వేర్లకు, దాని కింద ఉంచిన పదార్థాలకు దాదాపు 4,5 ఇంచుల గ్యాప్ వస్తుంది కాబట్టి మొక్క ఎదిగే క్రమంలో దాని వేర్లు ఆ గ్యాప్‌ను భర్తీ చేసి చివరిగా కింద ఉంచిన పదార్థాలను చేరుకుంటాయి. ఆ సమయంలో ఆ పదార్థాలు అధిక స్థాయిలో పోషకాలను విడుదల చేస్తూ ఉంటాయి. దీంతో వేర్ల ద్వారా ఆ పోషకాలలోని శక్తి మొక్కకు చేరి మొక్క ఏపుగా పెరిగేందుకు ఉపయోగపడుతుంది…. ఇంకేమైనా అనుమానాలు మిగిలుంటే ఈ వీడియో చూసేయండి బాబూ.

Must Read: కటింగ్ చేయడానికి రోల్స్ రాయల్స్ కార్ లో వస్తాడు.

(Visited 8,676 times, 1 visits today)