Home / Entertainment / పవన్ కళ్యాణ్, మహేష్ బాబు కలయికలో మల్టీ స్టారర్ మూవీ!

పవన్ కళ్యాణ్, మహేష్ బాబు కలయికలో మల్టీ స్టారర్ మూవీ!

Author:

టాలీవుడ్ లో మరో సంచలన సినిమా రాబోతుందా అంటే అవుననే అంటున్నారు ఫిలిం నగర్ వాసులు. ఆ సంచలన సినిమాలో టాలీవుడ్ అగ్ర కథానాయకులు అయినా పవన్ కళ్యాణ్, మహేష్ బాబు నటించనున్నారు అని తెలుస్తోంది. ఈ సినిమాకు కేతిరెడ్డి అనే ప్రొడ్యూసర్ నిర్మిచానున్నాడని అతనే వెల్లడించాడు. ఇంతకు ఈ కేతిరెడ్డి ఎవరు … ఇతను చాలా సినిమాలకు అసోసియేట్ డైరెక్టర్ గా పనిచేశాడు. ఆ తర్వాత నిర్మాతగా మారి సినిమాలు తీయాలని భావిస్తున్నాడు. ఇప్పటికే స్టోరీని తయారు చేసి పెట్టిన కేతిరెడ్డి త్వరలోనే ఈ ఇద్దరి కథానాయకులకు వినిపించనున్నాడు. మరి ఇలాంటి అగ్ర కథానాయకులతో అంటే కథ, కథనం.నిర్మాణ వ్యయం అన్ని చూసుకోవాలి. ఒకవేళ కథ కుదిరిన దాని తెరకెక్కించే దమ్మున్న దర్శకుడు కావాలి. ఎందుకంటే ఇలాంటి ఇద్దరు అగ్ర కథానాయకులు అనగానే ఫ్యాన్స్ అంచానాలు ఎక్కడో ఉంటాయి. వాటిని తట్టుకొని సినిమాను తెరకెక్కించాలి అంటే మాములు విషయం కాదు. మరి అలాంటి దర్శకుడు ఎవరాయన ఉన్నాడు అంటే మన తెలుగులో ఒకే ఒక్కడు త్రివిక్రమ్. ఎందుకంటే ఇంతకు ముందు ఇటు పవర్ స్టార్ తో అటు సూపర్ స్టార్ తో సినిమా తీసిన అనుభవం ఉన్నది.వాళ్ళిద్దరితో మంచి స్నేహం కూడా ఉంది కాబట్టి త్రివిక్రమ్ గారే డైరెక్ట్ చేసే అవకాశం ఎక్కువ ఉంది.

పవన్ కళ్యాణ్, మహేష్ బాబులతో మల్టీ స్టారర్ సినిమా..! Pawan-Kalyan-Mahesh-Babu-Multistarrer-Movie

కేతిరెడ్డి ముందుగా రజని కాంత్, మహేష్ బాబు కాంబినేషన్ లో ఒక సినిమా ఫ్లాన్ చేసాడు. ఇదే విషయాన్ని రాజనీకాంత్ కి మరియు మహేష్ బాబు కి కూడా చెప్పేసాడు. కేతిరెడ్డి ఇది వరకు రజనీకాంత్, కృష్ణలా చాలా సినిమాలకు పనిచేశాడు అందువలన ఆ చనువుతో వారిద్దరిని అడిగానని స్వయంగా కేతిరెడ్డి నే చెప్పాడు.కానీ అంతకంటే ముందే మరో సంచలనానికి నాంది పలకాలని పవన్ కళ్యాణ్ , మహేష్ బాబు ఒక సినిమా చేయాలని భావిస్తున్నట్టు అందుకు తగ్గట్టు స్టోరీ కూడా తయారు చేసానని, త్వరలోనే పవన్ కళ్యాణ్, మహేష్ బాబు లకి వినిపించబోతున్నట్లుగా తెలిపాడు.!

ఇప్పటివరకు బానే ఉంది కానీ అసలు ఈ సినిమాకి వాళ్ళు ఒప్పుకుంటారా అన్నదే అసలు ప్రశ్న..? ఒప్పుకుంటే మాత్రం తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలా పెద్ద సంచలనం అవుతుంది.

Must Read: లీకైన చిరంజీవి ‘కత్తిలాంటోడు’ డైలాగ్ ఇదే…!

(Visited 1,946 times, 1 visits today)