Home / Inspiring Stories / ట్రాఫిక్ పోలీసు “కీ” లాక్కొనే అధికారం లేదు.

ట్రాఫిక్ పోలీసు “కీ” లాక్కొనే అధికారం లేదు.

Author:

Bike Key Grabbing

ప్రత్యక్షంగానో,పరోక్షంగానో అనుభవమే. సిగ్నల్స్ వద్ద, చెకింగ్ పాయింట్స్ వద్ద పోలీస్ కానిస్టేబుల్స్ వాహనాలను ఆపిందే తడవుగా ముందు బండి కున్న “కీ” తీసుకుంటారు. నిజానికి లాక్కుంటారు అనాలనుకోండి. అయితే ఇక ముందు అదేం కుదరదు. ఆర్టీఐ చట్టాల ప్రకారం మన బండి కీ తీసుకునే అధికారం ట్రాఫిక్ పోలీసులకు లేదట, అలా బండి కీస్ ను లాక్కునే అధికారం పోలీస్ కానిస్టేబుల్ కే కాదు, ఏ ఇతర పోలీస్ అధికారికి కూడా లేదని రవాణా శాఖ స్పష్టం చేసింది. అలా తీసుకోవటం నేరం కూడానట. ఇన్నాళ్ళూ ఎవరికీ ఈ విషయం తెలియదు. ఐతే ఈ విషయం ఎలా తెలిసిందంటే.. హర్యానాలోని సిర్సా ప్రాంతానికి చెందిన అడ్వకేట్ పవన్ పారిఖ్ ద్వారా తేలింది. ఈయనకు ఎదురైన సమస్యతో కేసు వేసిన ఈయనకు ట్రాఫిక్ కానిస్టేబుల్ కు బండి కీ చెయిన్ లాగేసుకునే హక్కు లేదన్న విషయం బయటకు వచ్చింది.

అయితే ఈ విషయం పోలీసులకు తెలియదు అనుకుంటే మన పొరపాటే ట్రాఫిక్ విభాగంలోకి వచ్చేటప్పుడే ఈ విషయాలన్నిటిమీదా క్లాస్ లు తీసుకొని మరీ చెప్తారు. కానీ అవన్నీ పట్టించుకోరు రోడ్డు మీద బండి ఆపీ ఆపగనే కనీస గౌరవం కూడా లేకుందా “దిగు బండి దిగు సార్ దగ్గరికి నడువ్వు అంటూ వీళ్ళు చేసే ఓవరాక్షన్”మన దగ్గర అన్ని పేపర్లూ ఉన్నా కూడా ఏదో వాళ్ళ బానిసలని చూసినట్టూ నేరస్తులతో ప్రవర్తించినట్టూ ఉంటారు.ఇదంతా ఒక్క సారి అనుభవమైన వారికెవరికైనా అసలు పోలీస్ అనే మాట మీద ఉండే గౌరవమే తగ్గిపోయేలా చేస్తుంది…. ఐతే ఇప్పుడు వచ్చిన ఈ సమాచారాన్ని. అందరితో పంచుకోవటం వల్ల ఇటు పౌరుల్లోనూ,అటు పోలీసుల ప్రవర్తన లోనూ మార్పు వస్తే అంతకన్నా కావాల్సిదేముంది….

Must Read:క్యాబ్ డ్రైవర్లుగా మారుతున్న సాఫ్ట్ వేర్ ఇంజినీర్లు…!

(Visited 4,417 times, 1 visits today)