Home / Latest Alajadi / కొత్త టెక్నిక్: టీవీ రిమోట్ తో కరెంటు మీటర్ ఆన్/ ఆఫ్ చేస్తూ బిల్లు తగ్గించుకుంటున్నారు

కొత్త టెక్నిక్: టీవీ రిమోట్ తో కరెంటు మీటర్ ఆన్/ ఆఫ్ చేస్తూ బిల్లు తగ్గించుకుంటున్నారు

Author:

కరెంట్ వాడకం బట్టి మీటర్ తిరుగుతుంది. మీటర్ రీడింగ్ ను బట్టి కరెంట్ బిల్ వస్తుంది. ఇది కరెంట్ బిల్ ను జమా కట్టే పద్దతి. అక్కడక్కడ కొంత మంది కరెంట్ బిల్ ను కొంత తగ్గించుకునేందుకు అడ్డదారి తొక్కేవారు. తమకు తెలిసిన టెక్నిక్స్ ద్వారా మీటర్ ను తిరగకుండా ఆపుతుంటారు …తద్వారా కరెంట్ బిల్ తక్కువగా వస్తుంది. జనాలు ఇలా తెలివిమీరారు అనే ఉద్దేశ్యంతోనే కరెంట్ సంస్థ పాత మీటర్ల స్థానంలో కొత్త మీటర్లను మంజూరు చేసింది. మీటర్ అంతా సీల్ చేసి మరీ… ఇంట్లో ఫిక్స్ చేసి ఇచ్చింది. ఎలాంటి అవకతవకలకు వీలులేకుండా, దీనిని టాంపరింగ్ చేయడానికి వీలు లేని విధంగా రూపొందించింది.

power meter on off with tv remote

MustRead: వైఫై స్లోగా ఉంటే ఈ టెక్నిక్ ను ట్రై చేసి చూడండి

                                ఇదిలా ఉంటే….ఇప్పుడు ఆ మీటర్లనే, టీవీ రిమోట్ సాయంతో ఆన్/ ఆప్ చేస్తున్నారట వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్, ఖమ్మం, నిజామాబాద్ జిల్లాల్లో పలువురు వినియోగదారులు. నిజానికి పాత మీటర్లతో పోలిస్తే కొత్త మీటర్లు ఉపయోగించటం వాళ్ళ బిల్లు ఎక్కువగా వస్తుందనటం వాస్తవం. కొత్త మీటర్లు….తప్పుడు రీడింగ్స్ వల్ల బిల్ ఎక్కువగా వస్తుందని చాలా మంది వినియోగదారులు కంప్లైట్ చేసినా సదరు విద్యుత్ సంస్థ పట్టించుకోకపోవడంతో విసిగిపోయిన కొందరు వినియోగదారులు టీవీ రిమోట్‌తో మీటర్ల నియంత్రణ మొదలు పెట్టారట! సాఫ్ట్‌వేర్‌లో సాంకేతికలోపం వల్లే అలా జరుగుతోందన్న అధికారులు మీటర్లు మార్చాలని నిర్ణయించారట.

(Visited 2,223 times, 1 visits today)