Home / సాహిత్యం / కొన్ని రాత్రులు – పుస్తక పరిచయం.

కొన్ని రాత్రులు – పుస్తక పరిచయం.

Author:

pusyami sagar

పుస్తకం: కొన్ని రాత్రులు(కవిత్వం)
కవి: పుష్యమీ సాగర్
ప్రతులకు: అన్ని ప్రముఖ పుస్తక షాపులూ

To be or not to be
is not my dilemma.
To break away from both the worlds
is not bravery.
To be unaware of the wonders
that exist in me
that
is real madness!

నా అయోమయమంతా ఉండటం ఉండకపోవటం గురించికాదు, నాలోనే ఉన్న అద్బుతాన్ని తెలుసుకోలేక
ఆ రెండు ప్రపంచాల నుంచి తెగతెంపులు చేసుకోవడం ధైర్యమనిపించుకోదు అది పిచ్చితనమే...”మౌలానా రూమీ.
పుశ్యమీ సాగర్ ఆ రెండు ప్రపంచాలనుంచీ తప్పుకు పోవాలనే ఆలోచన చేయలేదు రెండు విభిన్నాద్భుతాలనీ ఒకటిగా చేర్చి చూసాడు. రాత్రినీ పగలు నీ ఒకటిగా కలిపే సాయంత్రపు గీతమీద నిలబడి తనకు తానుగా విశ్లేషించుకుంటూనే రెండు ప్రపంచాలనీ నిలదీసే ప్రయత్నం చేసడు.తన చుట్టూ ఉండే అద్బుతాల మీద పేరుకున్న మకిలి పొరలని తవ్వి ఒకానొక మార్మిక సత్యాన్ని తెలుసుకునే ప్రయత్నం చేసాడు.

ఆనందం కరిగిన రాత్రులిప్పుడు/విషాదాన్ని పులుముకొని/సమూహం లో బిక్క చచ్చి పోతున్నయి/పసిపాపలా లాలించే చేతుల కోసం/కొన్ని రాత్రులు ఎదురుచూస్తున్నాయి…(కొన్ని రాత్రులు కవిత) ఏవో కొన్ని ధు:ఖాలను తలచుకొని ఏనాటి ఙ్ఞాపకాన్నో తలచుకొనీ ఒక నిట్టుర్పుని మనసులోకి విసిరేసి పోతాడు. కవి పుస్తకం మొత్తం కూడా ఒకే భావన మీద నడవలేదు తనలో ఉన్న అన్ని భావాలనూ ఇక్కడే ఆవిష్కరించే ప్రయత్నం చేసాడు. మన రోజూ వారి జీవితాలనే తానూ అనుభవిస్తూ… అక్షరం నానుండి విడిపోయింది/చెట్టుమీదుగా రవాణా అయ్యే పిట్టల్లా/ఎవరో నా ప్రాణాన్ని తోడేస్తున్నట్టుగా ఉన్నది/కాస్త వాక్యం వాసన చూపించండి” అంటూ దిగులు పడతాడు. తనకు తానుగా ఒంటరి జీవితం లో ఉంటూనే సమూహ సాంగత్యాన్ని విపరీతంగా ప్రేమించిన మనిషి చేసే ప్రయత్నం సాగర్ కవితల్లో అంతర్లీనం గా కనిపిస్తుంది.

బరువెక్కిన పట్టు/వడికిన నూలూ/నీ గొంతు నులిమేస్తుంది (ఉనికి ప్రశ్న) …వంటి కొన్ని పోలికలు మనసుని బరువెక్కించేలా అనిపిస్తూనే ఒక ఉద్వేగానికి గురి చేస్తాయ్. దిక్కుతోచని దోస్తానా/నడీ రోడ్డులో వణూకుతోంది/పడగవిప్పిన స్వార్థం… అంటూ మూడేసి లైన్లతో ఒక కొత్త పద్దతిలో ఉండే కవిత మనలో కొన్ని ప్రశనలను వదిలి పెట్టి ఆలోచనలో పడేస్తుంది….నోస్టాల్జిక్ ఫీలో మనల్ని విసిరేసి”కష్టనష్టాలలో తన చెయ్యి పట్టి నదిపించే లాంతరు చేయి పట్టుకొని రాత్రులని జయించటానికి వెళ్ళిపోతాడు మనలనీ తనవెంట తీసుకుపోయి మన చిన్ననాటి రోజులని మనకు మళ్ళీ గుర్తు చెస్తాడు. మరికొన్ని ప్రేమ ఙ్ఞాపకాలూ,ఒంటరి రాత్రుల రోదనలూ,తన చుట్టూ ఉన్న సమాజం పై ఉన్న ప్రేమా,నిరసనా ఒక్కుమ్మడిగా మనకు కనిపించి ఉక్కిరి బిక్కిరి చేస్తాయ్. పుస్తకం లో ఉన్న ఒకటీ రెండూ ప్రేమ కవితలు అందులోనూ విఫల ప్రేమ కవితలు అప్పటిదాకా సమాజపు విపరీతదోరణుల పై ప్రశ్నించిన కవీ ఈ విరహ గీతాల వేదనలో కొట్టిమిట్టాడుతున్న కవీ ఒకరేనా అనిపిస్తుంది.

యుద్దమే ఎప్పుడూ/సమూహం లో ఒంటరిగా /నీతో నువ్వూ/మరొకరితో నేనూ/సమాంతరంగా సాగే కలవని పట్టాలం (నీకూ…నాకూ మధ్య) ఇలా ఒక్కో కవితలో ఒక్కో విధమైన కొత్త కవిసమయం తో 45రూపాలుగా 45 కవితలుగా తనని తాను ఆవిష్కరించుకున్న పుశ్యమీ సాగర్ కవిత్వం. మనలని కొద్ది సేపు మనలా ఉండనివ్వదు.ఫేస్ బుక్ కవిసంగమం లోనే వేసిన కవితలు అతన్ని అనుసరించే వారికి పరిచయమే అయినా. అన్నీ ఒక చోట సంకలనం గా చూడటం ఒక ఆనందకర విశయమే.

(Visited 326 times, 1 visits today)