Home / సాహిత్యం / రాజూ-అతని కవితా-ఒక అస్తిత్వమూ.

రాజూ-అతని కవితా-ఒక అస్తిత్వమూ.

Author:

Raju Pendyala

పనిని బట్టీ కులం, కులాన్ని బట్టీ ఒక జీవన విధానం,ఒక సంస్కృతీ చరిత్రా నిర్మించ బడతాయ్. మనిషి బతకటం కోసం, బతికించటం కోసం చేసే అతనికి మాత్రమే కేటాయించ బడ్ద పనిలో తన పనిముట్లనే దైవాలు గా భావించి పూజించుకున్నాడు. అలా ఒక సంస్కృతీ వారసత్వ సంపద “వల”. జీవితాన్ని అల్లినంత క్లిష్టంగా ఉండే వల ని అల్లటమే కాదు దాన్ని ఒడుపుగా విసిరి చేపలని బందించటమూ కళే. నదుల వెణ్త జీవనం సాగించే జాలరులది ఒక రకమైతే ఊరి నే అంటిపెట్టుకొని ఉండిపోయే జాలరులది మరో జాతి. భాషా,సంస్కృతీ,ఊరూ ఇలా ఒక్కొక్కటే గ్లోబలైజేషన్ విసిరిన “నెట్” వలయం లో చిక్కుకొని ఊపిరాడక గిలగిల లాడ్ఉతూంటే… తనుమాత్రం చితికిపోయిన తన జాతి చిహ్నాన్ని చూసి రోదిస్తున్నాడితను… కవిసంగమం లో రాస్తూన్న కొత్త కవులలో తనదంటూ ఒక అస్తిత్వ వాద లక్షణాలున్న కవిత్వాన్ని రాసే రాజు తన కోసం తాను చెప్పుకున్న కొన్ని వాక్యాలు….. ఒక జాతి అస్తిత్వ మూలాలని పెళ్ళగిస్తూంటే రాలిన కన్నీటి బొట్లుగా కనిపిస్తాయి….
ఒక్క సారి ఈ కవిత చదవండీ… మరింత యాసా,పచ్చి పల్లే గాలి వాసనా కావాలనుకుంటే కవిసంగమం లో వెతుక్కోండి….

*** వల***
రాజు పెండ్యాల
వల మా కుటుంబంలో ఒక వ్యక్తి
వల విసరడం ఒక కళ
అది మాకు వారసత్వ స్థిరాస్తి
చెరువులో బురుదమట్టి ముద్దుగా మా పాదాలను
ముద్దాడేది
విసిరిన వలలో చిక్కికొట్టుంటున్న చేప
ఆకలితో అలమటించే మా కడుపులకు ఆనంధం
దాని ఊపిరి మాకుపోసేది
మా తరతరాల చరిత్ర అంత చేరువు,వలతోనే సాగింది

పట్టిన చేపలను ఊరంత తిరిగి అమ్మి
పొట్టనింపుకుని
మిగిలిన చేపలను కడిగి,తుత్తి తీసి దండెంకు
వేలాడేస్తే….
చేపల వాసన వాడంత వ్యాపించేది
ఊపిరి ప్రాణవాయువులను నింపుకున్నట్టు…

ఇప్పుడు…! ప్రపంచీకరణ, సామ్రాజ్యవాధ, కాంక్రిట్
సమాజంలో చేరువు ఫ్లాట్లు మారి శోకిస్తుంది
చేరువు లేక బెంగటిల్లిన వల చిక్కీ అటకెక్కీ
శిధిలమై చింతిస్తుంది
చింతిస్తుంది వల మాత్రమే కాదు ఎందరో కడుపుల ఆకలి కూడా….
— రాజు పెండ్యాల

(Visited 215 times, 1 visits today)