Home / సాహిత్యం / రవిందర్ విలాసాగరం కవిత.

రవిందర్ విలాసాగరం కవిత.

Author:

robothanam

రోబోతనం

మనిషి ని మనిషే పలకరించాలి
ఒక్కోసారి మర మనిషి ఆ పని చేస్తుండొచ్చు
ఎంత కృతకంగా ఉంటుంది !

నరుని కోసం నరుడే కంట తడి పెట్టాలి
ఆర్తిగా నిలువెల్లా తడమాలి
మనసు గదిలోనికి వెళ్లి కన్నీరిడవాలి

పై పెచ్చు మిషన్ లాగా
పని చేయడం లేదని విసుక్కుంటయి
కొందరు మనుషులూ అంతే

మరెందుకో నరునికీ నరునికీ మధ్యన
ఇన్ని మూఢ ముండ్లు పేర్చుకోవడం

దేని కోసం మానవుడికీ
మానవుడీకీ నడుమల
ఇన్ని రంగుల జెండాలు పాతుకోవడం

ఏం సాధించాలని మనుజుడు మనుజుడి పైకే
ఇన్ని నల్లసారపు బండల్ని విసురుకోవడం !

తను సృష్టించిన సంస్కృతి
తననే ముక్కలు చేయడం
విషాదం కాక మరేమో ?
రవిందర్ విలాసాగరం

(Visited 144 times, 1 visits today)