Home / health / అసలు మనకి ఎక్కిళ్ళు ఎందుకు వస్తాయి? వచ్చాక తగ్గటానికి చిట్కాలు.

అసలు మనకి ఎక్కిళ్ళు ఎందుకు వస్తాయి? వచ్చాక తగ్గటానికి చిట్కాలు.

Author:

ఎక్కిళ్లను నిత్యజీవితంలో తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ ఎదుర్కొంటారు. ఎక్కిళ్ళు వచ్చినప్పుడు మనం చాల ఇబ్బందికి లోనవుతాం. తినే సమయంలో ఎక్కిళ్ళు వస్తే ఆ బాధ మాటల్లో చెప్పలేం, ఆ సమయం లో తృప్తిగా తినటం కూడా వీలు అవదు. అస్సలు ఎక్కిళ్ళు ఎందుకు వస్తాయి? వాటి బారి నుండి తక్షణమే ఉపశమనం పొందటం ఎలాగో తెలుసుకుందాం.ఎక్కిళ్లు డయాఫ్రం వల్ల వస్తాయి. ఛాతీ కిందుగా కడుపు పై భాగాన ఉండే వర్తులాకార పొరను డయాఫ్రం అంటారు. ఇది శ్వాసక్రియను నిర్వర్తించే సమయంలోనూ, ఆహారం తీసుకునేటప్పుడు అటూ, ఇటూ కదలి శరీరంలోని ఒత్తిడిని సమతూకంగా ఉండేట్లు చేస్తుంది. దీన్ని నియంత్రించడానికి మెదడులో ప్రత్యేక కేంద్రం ఉంటుంది. దీని నుండి బయలు దేరిన ‘ఫ్రెనిక్‌ నాడి డయాఫ్రం వరకు ఉంటుంది. డయాఫ్రం ఊపిరి పీల్చినప్పుడు ముడుచుకుని ఉంటుంది.ఊపిరి వదలగానే మళ్లీ మామూలుగా ఉంటుంది. ఈ ప్రక్రియ ఒక క్రమ పద్ధతిలో జరుగుతుంది. దీనితో శ్వాసక్రియ కూడా సక్రమంగా జరుగుతుంది. ఏ కారణం చేతనైనా ఫ్రెనిక్‌ నాడి గానీ, డయాఫ్రం గానీ ఒక క్రమ పద్ధతిలో అన్వయించుకోకపోవడం వల్ల చర్యాక్రమం తప్పుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో గాలి పీల్చుకుంటే స్వరపేటిక హఠాత్తుగా మూసుకుంటుంది. దీనితో ‘హిక్‌ అనే చప్పుడు వస్తుంది. డయాఫ్రం సక్రమంగా పనిచేసేదాకా ఈ విధంగా శబ్దం వస్తూనే ఉంటుంది. దీనినే ఎక్కిళ్లు అంటారు.

reasons-for-hiccoughs-and-solutions

కారణాలు :

ఒక్కొక్కసారి కొన్ని ప్రత్యేక పరిస్థితులు అంటే మూత్రపిండాలు, గుండె, కాలేయం వ్యాధులు, ఊపిరితిత్తుల వ్యాధుల వల్ల కూడా ఎక్కిళ్లు వస్తాయి.
కొన్ని సందర్భాల్లో మెదడు సంబంధమైన వ్యాధుల వల్ల,
విష పదార్థాల సేవనం వల్ల,
శరీరానికి సరిపడని ఆహార పదార్థాల వల్ల,
కడుపు ఉబ్బరం, గ్యాస్‌ వంటి వాటి వల్ల కూడా ఎక్కిళ్లు వస్తాయి.
భయం, దు:ఖం వంటి మానసిక కారణాల వల్ల కూడా ఎక్కిళ్లు రావచ్చు.
ఎక్కువ మసాలా పదార్ధాలు ఉన్న ఆహారము తినడం వల్ల,
కారము ఎక్కువగా ఉన్న ఆహారము భుజించడం వలన,
సుగరు వ్యాధి ముదినపుడు ,
ఎక్కువగా మందు (సారా) త్రాగడం వలన,
ఎక్కువగా పొగ త్రాగడం వలన,
నోటి పూత తో బాధపదుతున్న,
ఉదరకోశ క్యాన్సర్ ఉన్నపుడు,
కామెర్ల జబ్బు తో బాదపడుతున్నపుడు,
తీవ్రమైన ఎలర్జీ వ్యాధులు లతో బాధపడుతున్నపుడు ,
తీవ్రమైన అజీర్ణవ్యాదులతో బాదపడుతున్నపుడు,
అంటే నిజానికి ఎక్కిళ్లు అనేవి జబ్బు కాదు. ఎక్కిళ్లు దీర్ఘకాలంగా ఉన్నా ప్రమాదం లేదు. అయితే ఇబ్బందిగా, విసుగ్గా ఉంటుంది.

ఆయుర్వేధిక చిట్కాలు :

  • పంచదారను లేదా ఏదైనా స్వీట్‌ను తింటే ఎక్కిళ్లు తగ్గుతాయి.
  • ఒక్కోసారి మంచినీళ్లు తాగినా ఎక్కిళ్లు తగ్గిపోతాయి.
  • పచ్చి తాటాకు నమిలి ఊటను మింగుతే ఎక్కిళ్లు పోతాయి.
  • ఉదయం, సాయంత్రం రెండు పూటలా పల్లేరు కాయలు లేక చెట్టు కాడ రసాన్ని కొద్దిగా తేనెను కలిపి తీసుకుంటే ఎక్కిళ్లు తగ్గిపోతాయి.
  • మామిడి ఆకుల్ని ఎండబెట్టి వాటిని కాల్చి వచ్చే పొగను పీల్చినా ఎక్కిల్లు ఆగుతాయి.
  • తాటికాయను చిన్నగాటు పెట్టగా వచ్చిన నీరు లాంటి ద్రవాన్ని అరకప్పు తాగినా వెక్కిళ్లు తగ్గుతాయి.
  • రాతి ఉసిరికాయలు తింటుంటే ఎక్కిళ్లు తగ్గుతాయి.ప్రతిరోజూ వీటి రసం తాగినా ఎక్కిళ్లు పోతాయి.
  • కొబ్బరి బోండాం నీళ్లు తాగితే ఎక్కిళ్లు తగ్గుతాయి.
  • బఠాణీ గింజంత ఇంగువను గోరువెచ్చని నీళ్లలో వేసుకుని మింగితే ఎక్కిళ్లు తగ్గుతాయి.
  • కొబ్బరిని చితక్కొట్టి ఆ పిప్పిని బాగా పిండితే పాల వంటి పదార్థం వస్తుంది. దీనిని తాగినా, నిమ్మరసం తాగినా ఎక్కిళ్లు తగ్గుతాయి.
  • నాలుకకు తరుచుగా తేనె రాస్తున్నా ఎక్కిళ్లు తగ్గుతాయి.
  • జామకాయను తిన్నా ఎక్కిళ్లు తగ్గుతాయి.
  • శొంఠి లేదా కరక్కాయ పైపెచ్చు చూర్ణం అరచెంచాడు తీసుకుని చెంచాడు తేనెను కలిపి చప్పరిస్తే ఎక్కిళ్లు తగ్గుతాయి.
  • శొంఠి, ఉసిరిక పలుకు, పిప్పళ్లు వీటన్నింటిని సమభాగాలుగా తీసుకుని కలిపి చూర్ణం చేసి పూటకు పావు చెంచాడు వంతున రోజూ రెండు పూటలా తింటే ఎక్కిళ్లు పోతాయి.
  • విటమిన్‌ ఉన్న పండ్లు, కూరగాయలు ఎక్కువగా తినడం వల్ల కూడా ఎక్కిళ్లను నియంత్రించవచ్చు.
  • వేపాకు పొడి, ఉసిరిక పొడిని సమాన మెతాదులో తీసుకుంటే ఎక్కిళ్లు తగ్గుతాయి.
  • ఎక్కిళ్లు వస్తున్న వ్యక్తి దృష్టి మళ్లించడానికి ఏదైనా ఆశ్చర్యకమైన వార్తను చెప్పాలి. దీంతో వెంటనే ఎక్కిళ్లు ఆగిపోతాయి.

 

మేము పైన తెలిపిన చికిత్సా విధానాలు అందరి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే. మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి.

Must Read: తెల్ల వెంట్రుకలు రాకుండా ఉండాలంటే ఈ చిట్కాలని పాటించండి.

(Visited 7,442 times, 1 visits today)