Home / Reviews / ‘సాహసం శ్వాసగా సాగిపో ‘ రివ్యూ & రేటింగ్.

‘సాహసం శ్వాసగా సాగిపో ‘ రివ్యూ & రేటింగ్.

Author:

saahasam-swaasaga-saagipo-movie-review

గత సంవత్సరం విడుదల కావాల్సిన ‘సాహసం శ్వాసగా సాగిపో’ సినిమా కొన్ని అనుకోని కారణాల వలన ఈ రోజు విడుదలయింది. నాగచైతన్య ప్రేమమ్ లాంటి హిట్ తర్వాత వస్తున్న సినిమా కావడం, ఎ.ఆర్‌.రెహమాన్‌ సంగీతం అందించడం మరియు గౌతమ్ మీనన్ దర్శకుడు కావడంతో ఈ సినిమాపై విపరీతమైన అంచనాలు ఉన్నాయి. మరి ఈ సినిమా ఆ అంచనాలను అందుకుందో లేదో ఒక్కసారి చూద్దాం…

కథ :
రజనీకాంత్ మురళీధర్(నాగచైతన్య) ఇంజనీర్ పూర్తీ చేసి సరైన ఉద్యోగం రాకపోవడంతో ఎంబీఏ చేస్తూ ప్రెండ్స్ తో లైఫ్ ని ఎంజాయ్ చేస్తుంటాడు. ఒక రోజు తన చెల్లి కాలేజ్ ఫంక్షన్ లో లీలా సత్యమూర్తి(మంజిమా మోహన్)ని చూసి ఇష్టపడుతాడు. మనోడి అదృష్టం కొద్దీ లీలా కూడా ఒక కోర్స్ చేయడానికి తన చెల్లితో కల్సి తన ఇంట్లోనే ఉండాటానికి వస్తుంది. అలా కొద్దీ రోజుల్లోనే వారి ఇద్దరి మధ్య మంచి పరిచయం ఏర్పడుతుంది. ఒక రోజు సూర్యోదయం చూడటానికి కన్యాకుమారికి బైక్ పై వెలుతున్నట్టు లీలా కు చెబుతాడు. లీలా కూడా మురళీతో కలసి కన్యాకుమారి బయలుదేరుతుంది. ఈ జర్నీలో ఇద్దరు చాలా క్లోజ్ అవుతారు. కన్యాకుమారి నుండి తిరుగు ప్రయాణంలో వస్తుండగా వీరికి యాక్సిడెంట్ జరుగుతుంది. అలాంటి సమయంలో లీలా కు మహారాష్ట్రలో ఉన్న తన ఫ్యామిలీ చాలా ప్రమాదంలో ఉందని తెలుసుకొని అక్కడకు వెల్తుంది. మురళీ, లీలా ఫ్యామిలీని ఎలా కాపాడాడు, చివరికి మురళీ తాను ప్రేమించిన అమ్మాయి ప్రేమను పొందడా? లేదా? అనేది మిగిలిన కథ.

అలజడి విశ్లేషణ :

ముందు నుండి చెబుతున్నట్టు మొదటి భాగం మంచి లవ్ స్టోరీ చూపించాడు దర్శకుడు. ఇక రెండవ భాగం లో యాక్షన్ సన్నీ వేశాలు జోడించడంతో ఈ సినిమా చైతు ని ఒకే సినిమాలో రెండు పాత్రలుగా చూసినట్టు అనిపిస్తుంది. గౌతమ్ మీనన్ సినిమాలు చాలా స్లో గా ఉంటాయి అనే విషయం మనకు తెలిసిందే, మొదటి భాగం చాలా స్లోగా ఉంటుంది. మధ్య ,మధ్యలో కొన్ని మంచి సీన్స్ ఉన్న మొదటి భాగం సాగదీసిన విధంగానే ఉంటుంది. మొదటి భాగంలో హీరో లైఫ్ ఎంజాయ్ చేస్తూ తిరిగినా సెకండాఫ్ లో తాను ప్రేమిస్తున్న అమ్మాయి కోసం దేనికైనా తెగించే అబ్బాయిగా బాగా చూపించాడు దర్శకుడు.

మొదటి భాగంలో క్యూట్ లవ్ నడిస్తే, సెకాండాఫ్ లో మాత్రం యాక్షన్ తో పాటు మంచి సెంటిమెంట్ కూడా ఉంటుంది.సెకండాఫ్ పూర్తిగా క్రైమ్ కథతో నడుస్తుంది. హీరోయిన్ తల్లితండ్రులను కాపాడే క్రమంలో వచ్చె యాక్షన్ ఎపిసోడ్స్ తో రెండవ భాగాన్ని పూర్తిగా సినిమాని గౌతమ్ మీనన్ నింపేసారు. సెకండాఫ్ లో అప్పుడే ఇంట్రస్ట్ పుడుతుంది అనేటప్పుడికే ఆ సీన్ ని అక్కడికే కిల్ చేసేశాడు దర్శకుడు. చివరి వరకు హీరోయిన్ ను చంపడానికి ప్రయత్నిస్తున్నదెవరో సస్పెన్స్ గా ఉంచి చివరికి క్లైమాక్స్ లో ఎవరు ఊహించని విధముగా మాటలతోనె వివరణ ఇచ్చే ప్రయత్నం ప్రేక్షకులకు అసహనాన్ని కలిగిస్తుంది. చైతు తో పాటు తన ప్రెండ్ గా నటించిన సతీష్ కృష్ణ మంచి నటనతో చైతూకి మంచి సపోర్ట్ ఇచ్చాడు. బలమైన ప్రతినాయక పాత్ర లేకపోయినా మంచి యాక్షన్ సీన్స్తో ఆ లోటును కవర్ చేశాడు దర్శకుడు. లవ్ స్టోరీలను తీయడంలో దిట్ట అయిన గౌతమ్ మీనన్ అందులో ఈ సారి బోనస్ గా యాక్షన్ సీన్స్ ని కూడా అందిచడం చెప్పుకోదగిన అంశం. మ్యూజిక్ డైరెక్టర్ ఏ ఆర్ రెహమాన్ అందించిన సంగీతం బాగుంది కాని పాటల ప్లేస్మెంట్ సరిగ్గా లేకపోవడంతో చిరాకు కలిగించేవిగా మారాయి.

నటీనటుల పనితీరు:

నాగచైతన్య: చైతు మరోసారి పక్కంటి అబ్బాయిలా కనపడే పాత్రాలో ఒదిగిపోయాడు. ఇంతకు ముందు యాక్షన్ సినిమాలు చేసి చేతులు కాల్చుకున్నాడు కానీ ఈ సినిమాతో లవర్ బాయ్ గాను మరియు మంచి యాక్షన్ హీరోగా నిరూపించుకున్నాడు.

మంజిమా మోహన్: ఈ సినిమాతో మరో మంచి హీరోయిన్ తెలుగు పరిశ్రమకి పరిచయం అయినట్టే. తన క్యూట్ లుక్స్ తో మంచి నటన కనబరిచింది. ఇక సెకండాఫ్ లో వచ్చే ఎమోషనల్ సీన్స్ లో ఆకట్టుకుంది.

సాంకేతిక వర్గం: గౌతమ్ మీనన్ రొమాంటిక్ ఎంటర్టైనర్లు, యాక్షన్ థ్రిల్లర్లు తెరకెక్కించిన దర్శకుడు. ఈ సారి రెండు ఒకే సినిమాలో చూపించే ప్రయత్నం చేశాడు.యాక్షన్ సినిమాలను ఇష్టపడేవారిని సెంకడ్ హాఫ్ కట్టిపడేస్తుంది.. మ్యూజిక్ డైరెక్టర్ ఏ ఆర్ రెహమాన్ మరోసారి తన మ్యూజిక్ తో మ్యాజిక్ చేశాడు. బ్యక్ గ్రౌండ్ మ్యూజిక్ తో సినిమా స్థాయిని పెంచాడు. సినిమాటోగ్రఫి, ఎడిటింగ్, నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగట్టుగా ఉన్నాయి.

ప్లస్ పాయింట్స్ :

.నాగచైతన్య
.మ్యూజిక్
.ప్రీక్లైమాక్స్
.సినిమాటోగ్రఫీ.

మైనస్ పాయింట్స్ :

.స్లో నేరేషన్
.బాబాసైగల్.
.నవ్వుకునే సంధర్బాలు లేకపోవడం

అలజడి రేటింగ్: 2.5/5

పంచ్ లైన్: దారి తప్పిన సాహసయాత్ర.

Must Read: లెక్కచెప్పని డబ్బు 2.5 లక్షల కన్న ఎక్కువ మీ అక్కౌంట్లో ఉంటే మీరు ఎంత పన్ను కట్టాలో ఇక్కడ చూడండి.

(Visited 2,604 times, 1 visits today)