Home / Inspiring Stories / నిమ్మరసంతో కోట్లు సంపాదిస్తున్న 11 ఏళ్ళ అమ్మాయి.

నిమ్మరసంతో కోట్లు సంపాదిస్తున్న 11 ఏళ్ళ అమ్మాయి.

Author:

ఒక్క ఐడియా జీవితాన్నే మార్చేస్తుంది… ఇది ఒక నెట్ వర్క్ సంస్థ క్యాప్షన్.  నిజమే ఒక్క ఆలోచన మనిషిని ఎక్కడి నుండి ఎక్కడికొ తీసుకెళ్తుంది. మాములుగా అయితే చిన్న పిల్లలు  ఏం చేస్తారు అయితే గియితే అల్లరీ చేస్తారు లేదంటే కార్టూన్ నెట్‌వర్క్‌లో వచ్చే కామిక్‌ సీరియల్స్‌ చూస్తు ఉంటారు. పదకొండేళ్ల మికైలా ఉల్మర్‌ కూడా అలా టీవీ చూడటమంటే చాలా ఇష్టం. అలా ఒకరోజు టీవీలో వస్తున్న ఓ కార్యక్రమం చూస్తున్న మికైలాకు తళుక్కున ఓ ఐడియా వచ్చింది. ఆ ఐడియానే ప్రస్తుతం ఆ చిన్నారిని కోట్ల వ్యాపారానికి అధిపతిని చేసింది. ఆ ఐడియా ఏంటీ? అని అనుకుంటున్నారా!.

ఎప్పటిలాగే మికైలా ఆ రోజు స్కూల్ నుండి తిరిగి వచ్చి రోజు మాదిరిగానే హోం వర్క్ చేసుకుని టీవీ చూడటానికి కూర్చుంది. అలా చూస్తుండగా ఏబీసీ అనే చానెల్‌లో ‘షార్క్‌ట్యాంక్‌’ అనే కార్యక్రమం వస్తుంది. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం సరికొత్త ఆవిష్కరణలను, వ్యాపార ఆలోచలను ప్రోత్సహించడమే, మన ఆలోచన వారికి నచ్చితే వారే మనకు పెట్టుబడి పెడుతారు.ఈ విషయాన్ని గమనించిన మికైలాకు ఇంట్లో అమ్మమ్మ చేసే నిమ్మరసం గుర్తొచ్చింది. కానీ మికైలా అమ్మమ్మ అందరిలా నిమ్మరసం చేయదు  ఎందుకంటే మనం మాములుగా అయితే నిమ్మరసంలో ఉప్పు లేద పంచదార కలుపుతాం కానీ మికైలా అమ్మమ్మ పంచదార బదులు తేనె, అవిసె గింజలను వేసి చేస్తుంది. ఇదే ఆలోచనను  షో నిర్వాహకుల ముందు ఉంచి  రుచి చూపించింది అంతే….. ఈ నిమ్మరసం రుచి విపరితంగా నచ్చడంతో దాదాపు 40 లక్షల రూపాయల్ని పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చారు.

Lemonade Mikaila

పెట్టుబడిదారు అందించిన ప్రోత్సహాంతో మికైలా ‘బీ స్వీట్‌ లెమెనెడ్‌’ అనే కంపెనీ స్థాపించింది. ఈ నిమ్మరసం రుచి భాగా ఉండటంతో తోందరలోనే వ్యాపారం చాలా వృద్ది చెందింది. ప్రస్తుతం ఈ నిమ్మరసం ఐదు రాష్ట్రాలలో విస్తరించిన  మికైలా, మరి కొద్దిరోజుల్లోనే దీనిని మరింత ముందుకు తీసుకువెళ్ళాడనికి ప్రయత్నాలు చేస్తుంది. ఈ కొత్త రకం పానీయంతో దిగ్గజ వ్యాపారులందరినీ ఆశ్చర్యపోయేలా చేసిన మికైలాకు ఈ వ్యాపారాన్ని ప్రారంభించినప్పుడు  వయసు తొమ్మిదేళ్లు. తను ఇప్పుడు ఆరవ తరగతి చదువుతుంది. మికైలా ఒకవైపు చదువుకుంటూనే మరొ వైపు వ్యాపారం చేస్తోంది.

lemon juice

అమెరికా అధ్యక్షుడు బరాక్‌ ఒబామా కూడా ఈ లెమెనెడ్‌ పానీయానికి ఫ్యాన్ అయ్యాడు. గూగుల్‌ సీఈవో సత్య నాదెళ్ల ఈ చిన్నారి వ్యాపారవేత్తను మనస్ఫూర్తిగా అభినందించాడు. దీనికంతటికి కారణం ఒక చిన్న ఆలోచనే, కానీ ఆ ఆలోచనకు రూపం ఇవ్వడం కూడా చాలా అవసరం. మికైలాకు వచ్చిన ఒక ఆలోచనకు షార్క్‌ట్యాంక్‌ అనే కార్యాక్రమం అనే మంచి వేదికా దొరికింది. అమెరికాలో బాగా పాపులర్‌ అయినా ఈ షో ఇప్పటికీ ఏడు సీజన్లు ముగించుకుంది. ఎనిమిదో సీజన్ మొదలైంది. ఇందులో పాల్గొనే వ్యక్తులు తమ ఆలోచనలను చెబితే, పెట్టుబడులు పెట్టే కొందరు వ్యక్తులు వారిని పలు రకాల ప్రశ్నలు అడుగుతారు. ఎంతో విసిగిస్తారు. విభేదిస్తారు. చర్చిస్తారు. చివరగా ఒప్పుకుంటారు. పెట్టుబడులు పెట్టి ప్రోత్సహిస్తారు.

Must Read: కార్పోరేట్ జాబుల్ని వదిలేసి మరీ క్యాబ్ డ్రైవర్లుగా మారిపోతున్న సాఫ్ట్ వేర్ ఉద్యోగులు…!

(Visited 2,765 times, 1 visits today)