Home / Latest Alajadi / జ్వరం వచ్చినప్పుడు త్వరగా బాడీ టెంపరేచర్ తగ్గించే చిట్కా.

జ్వరం వచ్చినప్పుడు త్వరగా బాడీ టెంపరేచర్ తగ్గించే చిట్కా.

Author:

ఈ శీతాకాలంలో జ్వరాలు పట్టి పీడిస్తుంటాయి. కొద్దీ సమయంలోనే సాధారణముగా ఉన్న బాడీ టెంపరేచర్ క్రమంగా పెరుగుతుంది. జ్వరం వచ్చినప్పుడు నోరంతా చేదు అయి ఏమి తినాలనిపించదు. జీర్ణక్రియ కూడా నెమ్మదిస్తుంది. శరీరమంతా నీరసంగా మారి ఒక్కసారిగా పడిపోతుంటారు కొందరు. ఇలాంటి సమయంలో శరీరంలో ఉన్న టెంపరేచర్ ని కంట్రోల్ చేస్తే భాదితుడికి చాలా ఉపశమనముగా ఉంటుంది. ఒక చిన్న చిట్కాతో అందరి వంటింట్లో దొరికే పెసరపప్పు తోనే జ్వరంతో బాధపడుతున్న వ్యక్తి బాడీ టెంపరేచర్ ను తగ్గించవచ్చు. పెసరు పప్పులో ఉండే అద్భుతమైన గుణాలు మాంగనీస్, ప్రోటీన్స్, విటమిన్ సి,విటమిన్ బి లు శరీరానికి తొందరగా చల్లదనాన్ని ఇవ్వడంలో ఉపయోగపడుతాయి.

fever-treatment

బాడీ టెంపరేచర్ తగ్గాలంటె ఈ విధానాన్ని పాటించండి:

. ముందుగా ఒక కప్పు పెసరుపప్పును తీసుకోని దానిని శుభ్రంగా కడగాలి.
. కడిగిన పెసరుపప్పును ఒక పాత్రలోకి తీసుకోని దానిలో నీళ్ళుపోసి ఒక 20-25 నిముషాలు నానబెట్టాలి.
. తరువాత పెసరు పప్పును నానపెట్టిన నీళ్లను వేరు చేసి ఒక గ్లాసులోకి తీసుకోవాలి.
. అలా వేరుచేసిన నీటిని జ్వరంతో బాధపడుతున్న వారికి తాగిపించాలి.

ఆ నీటిని త్రాగిన వ్యక్తి బాడీ టెంపరేచర్ 10-15 నిమిషాలలో క్రమంగా తగ్గుతుంది. అలా కొద్దీ సమయం తరువాత మామూలు స్థాయికి వస్తుంది. మామూలు స్థితికి వచ్చిన వ్యక్తికి కొద్దిగా శక్తి నిచ్చే తేలికపాటి ఆహారాన్ని ఇస్తూ డాక్టర్ ఇచ్చిన మందులను సమయానికి వాడాలి. అంతే కాకుండా సూర్యుని నుంచి వచ్చే అతినీలిలోహిత కిరణాలు, పర్యావరణ కాలుష్యం వల్ల వచ్చే చర్మ సమస్యల నుంచి కూడా పెసలు మనల్ని కాపాడుతాయి అందుకే వీలు చిక్కినప్పుడు ఎదో ఒక విధంగా పెసర్లు తినడానికి ప్రయత్నించండి.

Also Read: ఎండు ద్రాక్షలను ఇలా చేసి త్రాగితే రెండు రోజుల్లో మీ లివర్ క్లీన్ అవుతుంది.

(Visited 21,589 times, 1 visits today)