Home / health / రాత్రి పడుకునే ముందు ఈ టిప్స్ పాటిస్తే తెల్లారే సరికి ముఖం అందంగా అవుతుంది.

రాత్రి పడుకునే ముందు ఈ టిప్స్ పాటిస్తే తెల్లారే సరికి ముఖం అందంగా అవుతుంది.

Author:

రోజూ వారి పనుల్లో పడి మన గురించి మనం పట్టించుకోవడానికి కొంత సమయం కూడా కేటాయించలేని రోజులివి. అలా పట్టించుకోకుండా ఉంటే మన ఆరోగ్యంతో పాటు అందం కూడా కోల్పోతుంటాం. బ్యూటీ పార్లర్ వెళ్ళడానికి సమయం లేకపోతే, ఎలా..? అని బాధ పడకుండా రాత్రి పడుకునే ముందు కొన్ని చిట్కాలను పాటించండి.

simple-tips-for-glowing-face

 

Must Read: మగవారు మొలతాడు ఎందుకు కట్టుకుంటారో తెలుసా!?

  • కలబంద(aloe vera) అతి తక్కువ సమయంలో మొఖానికి మంచి అందం ఇస్తుంది. కలబంద జెల్ గాని, జ్యూస్ కానీ, మొఖానికి రాసుకొని గంట తరవాత గోరువెచ్చని నీటితో కడుక్కున్నట్లైతే, ముఖం మీద ఉన్న మొటిమలు, మచ్చలు అన్ని త్వరగా తగ్గిపోతాయి.
  • కంటి క్రింద నల్లగా ఉండడం వలన ఎంత మేకప్ వేసినా అందం రాదు. ఆల్మండ్‌ నూనెలో కాస్త నిమ్మరసం కలుపుకుని ముఖానికి, కళ్ళ క్రింద భాగంలో రాసుకుంటే చాలా మంచిది. ఇలా చేయటం వల్ల ఉదయం లేచే సమయానికి ముఖం కాంతి వంతంగా ఉంటుంది.
  • రాత్రి పడుకునే ముందే తాజా కొబ్బరి నూనెతో ముఖానికి మెల్లగా మస్సాజ్ చేసుకోవాలి. ఇలా చేయటం మూలంగా ముఖం కోమలంగా ఉండడమే కాకుండా, వయసుతో పాటు ముఖంపై వచ్చే ముడతలు అంత త్వరగా రావు.
  • ఇక కను రెప్పల విషయానికి వస్తే, వీటిని ఎవ్వరు పట్టించుకోరు. కాని, కనురెప్పలు ఎంత మృదువుగా ఉంటే అంత అందంగా ఉంటుంది. రాత్రి పడుకునే ముందు కనురెప్పలకు ఆముదం నూనె రాస్తే చాలా ఉపయోగకరం.

Must Read: Video: పడుకున్న ఒక నిమిషంలోనే నిద్రలోకి జారుకునే ట్రిక్..!

(Visited 81,582 times, 1 visits today)