Home / Political / సీటు నచ్చలేదని రైలును గంటపాటు ఆపేసిన ఎమ్మెల్యే.

సీటు నచ్చలేదని రైలును గంటపాటు ఆపేసిన ఎమ్మెల్యే.

Author:

Siva Sena Mla

ఎమ్మెల్యే అంటే తన నియోజక ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండ చూసుకునే వ్యక్తి కానీ ఒక ఎమ్మెల్యే తను కూర్చునే సీట్ నచ్చలేదని 2000 వేల మంది వెళ్తున్న రైలును గంట సేపు ఆపివేశాడు. దేవగిరి ఎక్స్‌ప్రెస్ 2000 మంది ప్రయాణికులతో బయలుదేరి ముంబయి చేరుకోగానే నాందేడ్ శివసేన ఎమ్మెల్యే హేమంత్ పాటిల్ హల్‌చల్ చేశారు.ప్రయాణికులు ఎమైన ఇబ్బంది ఉంటే ఇలాంటి ప్రయాణంలో గుర్తించి వాటిని చక్కదిద్దల్సిందిపోయి తానే ప్రయాణికులకు ఒక సమస్యగా అయ్యాడు. ఇంతకు ఏం జరిగిందో చూడండి.

ఎమ్మెల్యే హేమంత్ పాటిల్ దేవగిరి ఎక్స్‌ప్రెస్ లో 2వ ఏసీ కోచ్‌లోని 35, 36 సీట్లు కేటాయించారు. అయితే ఆ సీట్లు సైడ్ సీట్లని… అందులో తాను అసలు కూర్చునే ప్రసక్తే లేదని ఎమ్మెల్యే నానా హంగామా సృష్టించాడు. ఇక ఎమ్మెల్యే ఇంత హాంగామ చేస్తే తన వర్గీయులు ఊరుకుంటార! చెప్పండి. వారు ట్రైన్ చైన్ లాగడంతో 56 నిమిషాలు నిలిచిపోయింది. దీనితో అధికారులు దిగి వచ్చి బుజ్జగించి… చివరకు వేరే సీట్లు కేటాయించడంతో పరిస్థితి కొంత సద్దుమణిగింది.

ఇదే విషయం పై రైల్వే జనరల్ మేనేజర్ సునీల్ కుమార్ మాత్రం ఈ ఘటనకు ప్రయాణికులనే బాధ్యులను చేయడం గమనార్హం. . ఎవరో కొంతమంది ప్రయాణికులు చైన్ లాగారని… అందుకే గంటపాటు ట్రైన్ నిలిచిపోయిందని చెప్పుకొచ్చారు.ఎందుకంటే ప్రజలే కద ఎప్పుడైన బలి అయ్యేది. ప్రయాణికులు మాత్రం ఎమ్మెల్యే తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ ట్రైన్ ఆగడం వల్ల మంగళూరు ఎక్స్‌ప్రెస్, సిద్ధేశ్వర్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఆలస్యంగా నడిచాయి.

Must Read: కార్, బైక్ షో రూంల డీలర్ల చేతిలో మోసపోకండి.

(Visited 1,175 times, 1 visits today)