Home / Inspiring Stories / ఒకటీ రెండు కాదు 100 కోట్లు ఆదా చేసారు.

ఒకటీ రెండు కాదు 100 కోట్లు ఆదా చేసారు.

Author:

Delhi Flyover

ఒక ప్రాజెక్టు పూర్తి చేయాలంటే దానికోసం ముందస్తుగా అంచనా వ్యయం వేస్తారు. దాని మేరకు పనులు మొదలు పెడతారు. అయితే ఇన్ని సంవత్సరాల భారత దెశ చరిత్రలో కనీసం ఒక కల్వర్టు కూదా అంచనా వ్యయం కంటే తక్కువ ఖర్చులో నిర్మింపబడటం జరగ లేదు. ఎందుకు అన్న ప్రశనకి ప్రతీ భారతీయుడి కీ తెలిసిన సమాధానం తెలుసు..? ఐతే ఇప్పుదా పరిస్తితి మారే అవకాశాలున్నాయా… భారత్ లో ఉనడే అవినీతి కొంతైనా తగ్గే అవకాశం ఉందా అనే వైపు మళ్ళీ కొన్ని ఆశలు కలుగుతున్నాయి. ఎందుకంటే ఈ మధ్యనే డిల్లిలో ఒక 6 లైన్ ఫ్లై ఓవర్ నిర్మాణం జరిగింది ఐతే అంచనా వ్యయం కంటే వంద కోట్ల కంటే తక్కువ ఖర్చుతోనే…. ఆశ్చర్యంగా ఉందా..!? వివరాల్లోకి వెలితే…

ఉత్తర ఢిల్లీలోని అతిపెద్ద కూరగాయల మార్కెట్ ఉన్న ఆజాద్ పూర్ నుంచి 1.6 కిలోమీటర్ల ఆరు లైన్ల ఫ్లై ఓవర్ అనుకున్న అంచనా కంటే రూ.100 కోట్ల తక్కువ ఖర్చుతో ఫ్లై ఓవర్ ను పూర్తి చేసి సంచలనంగా మారారు ఢిల్లీ ముఖ్యమంత్రి. 2013 లోనే ఈ ఫ్లై ఓవర్ నిర్మాణానికి పునాది పడింది ఢిల్లీలోని అజాద్ పూర్ నుంచి షాలిమార్ బాగ్ వరకు నిర్మించే ఈ ప్రాజెక్ట్ కోసం రూ.247 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేశారు. ఇందుకు తగ్గట్లే శంకుస్థాపన కార్యక్రమాన్ని పూర్తి చేశారు. . అయితే.. అంచనా లెక్కింపు.. టెండర్లు..శంకుస్థాపన అంతా నాటి కాంగ్రెస్ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ హయాంలో చేపట్టారు. కానీ అది పూర్తి కాకుండానే ప్రభుత్వాలు మారాయి. అవినీతిని నిర్మూలిస్తాను అన్న కొత్త నినాదం తో వచ్చిన ఆం ఆద్మీ నేత అరవింద్ కేజ్రివాల్ ముఖ్య మంత్రి గా వచ్చారు. ఈ ప్రాజెక్ట్ పూర్తయ్యింది అయితే అనుకున్నా దానికంటే 100 కోట్లకు తక్కువ ఖర్చు తోనే. ఇది రూ. 143 కోట్లకే పూర్తయింది. ఈ విషయమై కేజ్రీవాల్ స్పందిస్తూ ‘రూ.250 కోట్ల ప్రాజెక్టు రూ. 100 కోట్లకే పూర్తవ్వడం నేనెప్పుడూ వినలేదు. సాధారణంగా ఒక ప్రాజెక్టు వ్యయం రూ. 250 కోట్లు అయితే అది రెట్టింపై రూ. 500 కోట్లకు, రూ. వెయ్యి కోట్లకు చేరుకోవడమే నేను చూశాను’ అని ట్విట్టర్ లో పేర్కొన్నారు కూడా.

Delhi Flyover saved 100crores

ఇక మన తెలుగు రాష్ట్రాల దగ్గరికి వస్తే పట్టిసీమను కేవలం 400 కోట్లతో నిర్మించవచ్చని కానీ.. ప్రభుత్వం దీని కోసం 1200 కోట్లు ఖర్చుచేస్తోందని.. ఇది కాంట్రాక్టర్ తో కుమ్మక్కవడమేనని విపక్షాలు ఆరోపించాయి. ఉండవల్లి అరుణ్ కుమార్ వంటి నాయకులు లెక్కలతో సహా సర్కారు తప్పులు ఎండగట్టారు. ప్రస్తుతం ప్రభుత్వమే పట్టిసీమ వ్యయాన్ని 1600 కోట్లకు పెంచే ఆలోచనలో ఉంది. ప్రభుత్వ కాంట్రాక్టుల అంచనా వ్యయాలు ఏటా పెరిగిపోవడం సర్వసాధారణమైపోయింది.అటు తెలంగాణలోనూ జలహారం పనుల్లోనూ అదే తరహా అవినీతి జరుగుతోందన్న ఆరోపణలున్నాయి. అంచనా వ్యయాలు విపరీతంగా పెరుగుతున్నాయా పెంచుతున్నారో తెలియటం లేదు.

పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ఖర్చు 2015-16 సంవత్సరాన్ని బేస్ గా తీసుకుని లెక్కవేస్తే 36 వేల కోట్లరూపాయలు అవుతుందన్న అంచనాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆమోదించింది. 2013 సంవత్సరం లెక్క ప్రకారం ఇది 16 వేల కోట్లరూపాయలే. పెరిగిన ధరల దృష్ట్యా బడ్జెట్ పెరుగుతోందంటూ చెబుతూనే ఉన్నారు.పూర్తి స్థాయి పారదర్శకతో వ్యవహరించాలే కానీ.అద్భుతాలు చేయొచ్చన్న విషయాన్ని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ చేతలతోచేసి చూపించారు. ఇవాళ.. రేపటి రోజున ఏదైనా ప్రాజెక్టుకు సంబంధించి ఒక అంచనాతో మొదలైత.. అది పూర్తి అయ్యేసరికి అంచనాకు మించి బారీగా ఖర్చు కావటం తెలిసిందే. అయితే.. అందుకు భిన్నమైన పరిస్థితి ఢిల్లీ రాష్ట్ర సర్కారు చేసింది. ఇలాంటి పని తీరు దేశమంతా జరిగితే భారత్ కి అచ్చే దిన్ వచ్చేసినట్టే.

Must Read:అఖిల్ సినిమా పర్ఫెక్ట్ రివ్యూ & రేటింగ్.

(Visited 144 times, 1 visits today)